పద్మ అవార్డులు: మొగిలయ్య, గరికపాటి నరసింహారావులకు పద్మశ్రీ.. ఎల్లా సుచిత్ర, ఎల్లా కృష్ణలకు పద్మ భూషణ్

మొగిలయ్య, గరికపాటి

కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డలును ప్రకటించింది. ఏడుగురు తెలుగు వారికి పద్మ అవార్డులు వచ్చాయి.

కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా

ఫొటో సోర్స్, facebook/bharatbiotech

ఫొటో క్యాప్షన్, కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా

కోవాగ్జిన్ తయారు చేసిన భారత్ బయోటిక్ వ్యవస్థాపకులు ఎల్లా సుచిత్ర, ఎల్లా కృష్ణలకు పద్మ భూషణ్ ఇచ్చారు. వీరిద్దరికీ కలపి అవార్డు ఇచ్చారు.

ప్రవచనకర్త గరికపాటి నరసింహా రావుకు పద్మశ్రీ ప్రకటించారు. కళలకు సంబంధించి కిన్నెర వాయిద్యకారుడు దర్శనం మొగిలయ్య, నాదస్వర కళాకారుడు గోసవీడు షేక్ హుస్సేన్, రామచంద్రయ్య, కూచిపూడి కళాకారిణి పద్మజా రెడ్డిలకు పద్మశ్రీ వచ్చింది.

వైద్యానికి సంబంధించి డా. సుంకర వెంకట ఆదినారాయణ రావుకు పద్మశ్రీ ప్రకటించారు.

మొత్తం నలుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మ భూషణ్, 107 మందికి పద్మశ్రీ ప్రకటించారు.

హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన బిపిన్ రావత్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగులకు పద్మ విభూషణ్ పురస్కారం మరణానంతరం ప్రకటించారు.

సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల

ఫొటో సోర్స్, Getty Images

టాటా గ్రూపుల ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్, సీరమ్ ఇనిస్టిట్యూట్ చైర్మన్ సైరస్ పూనావాలా, కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ లకు కూడా పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించారు.

34 మంది మహిళలు, 10 విదేశాల్లో ఉంటున్న వారు లేదా విదేశీ పౌరసత్వం ఉన్నవారు, 13 మందికి మరణానంతరం అవార్డులు ప్రకటించారు. ఇద్దరికి జంటగా ఇచ్చారు. (జంటగా అవార్డు ఇచ్చినా దాన్ని ఒక అవార్డుగానే పరిగణిస్తారు.)

వీడియో క్యాప్షన్, మొగిలయ్య పాడిన భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ అసలు పాట ఏంటి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)