Emmy: 'అడాలసెన్స్'కు అవార్డుల పంట...ఐదు ఫోటోలతో విన్నర్ల విశేషాలు

అవార్డు గెలుచుకున్న కుమారుడు కూపర్‌తో తల్లిదండ్రులు నోరీన్, ఆండీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అవార్డు గెలుచుకున్న కుమారుడు కూపర్‌తో తల్లిదండ్రులు నోరీన్, ఆండీ

77వ ఎమ్మీ అవార్డుల ప్రదానోత్సవం కాలిఫోర్నియా డౌన్‌టౌన్‌ లాస్ఏంజెల్స్‌లోని పీకాక్ థియేటర్‌లో ఆదివారం సందడిగా జరిగింది.

మూడు టాప్ షోలు ‘అడాలసెన్స్’, ‘ది స్టూడియో’, ‘ది పిట్’ అత్యధిక అవార్డులను గెలుచుకున్నాయి.

నెట్‌ఫ్లిక్స్‌లో అత్యంత ఆదరణ పొందిన డ్రామా 'అడాలసెన్స్' అత్యధికంగా ఎమ్మీ అవార్డులను దక్కించుకుంది.

తన నటనతో మెప్పించిన 'ఓవెన్ కూపర్' (15) ఎమ్మీ అవార్డు గెలుచుకున్న పిన్న వయస్కుడిగా నిలిచారు. స్టీఫెన్ గ్రాహం ఉత్తమ లీడ్ యాక్టర్‌గా ఎమ్మీ అవార్డు సాధించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఎమ్మీ అవార్డు విజేతలైన ‘అడాలసెన్స్’ నటులు స్టీఫెన్ గ్రాహం, ఓవెన్ కూపర్, ఎరిన్ డోహెర్టీ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఎమ్మీ అవార్డు విజేతలైన ‘అడాలసెన్స్’ నటులు స్టీఫెన్ గ్రాహం, ఓవెన్ కూపర్, ఎరిన్ డోహెర్టీ

‘సమాజానికి అద్దం పట్టాలనుకున్నాం...’

అవుట్‌స్టాండింగ్ లిమిటెడ్/అంథాలజీ సిరీస్‌గా, అవుట్‌స్టాండింగ్ రైటింగ్‌గా 'అడాలసెన్స్' నిలిచింది. ఈ విభాగంలో అవుట్‌స్టాండింగ్ డైరెక్టింగ్ అవార్డును ఫిలిప్ బరాంటిని, అవుట్‌ స్టాండింగ్ లీడ్ యాక్టర్ అవార్డును స్టీఫెన్ గ్రాహం, అవుట్‌స్టాండింగ్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డును ఓవెన్ కూపర్, అవుట్‌స్టాండింగ్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డును ఎరిన్ డోహెర్టీ గెలుచుకున్నారు.

ఎమ్మీ అవార్డులతో ‘అడాలసెన్స్’ బృందం

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, తాము గెలుచుకున్న ఎమ్మీ అవార్డులతో ‘అడాలసెన్స్’ బృందం

''మేము సమాజానికి అద్దం పట్టాలనుకున్నాం. ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా మన మనసులను దోచుకుందని భావిస్తున్నాను'' అని 'అడాలసెన్స్' ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మార్క్ హెర్బెర్ట్ బీబీసీతో అన్నారు.

‘ఎమ్మీ’ అవార్డులతో ‘ది స్టూడియో’ బృందం

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ‘ఎమ్మీ’ అవార్డులతో ‘ది స్టూడియో’ బృందం

‘ది స్టూడియో’కు ఎమ్మీ అవార్డులు...

అవుట్‌స్టాండింగ్ కామెడీ సిరీస్ అవార్డును 'ది స్టూడియో' దక్కించుకుంది. ఈ విభాగంలో అవుట్‌స్టాండింగ్ లీడ్ యాక్టర్ అవార్డును సేథ్ రోగెన్, అవుట్‌స్టాండింగ్ డైరెక్టింగ్ అవార్డును సేథ్ గోరెన్, ఇవాన్ గోల్డ్ బెర్గ్ సంయుక్తంగా గెలుచుకున్నారు.

అవుట్‌స్టాండింగ్ రైటింగ్ అవార్డును సేథ్ రోగెన్, ఇవాన్ గోల్డ్‌బెర్గ్, పీటర్ హుయూక్, అలెక్స్ జార్జ్, ఫ్రిదా పెరేజ్ సంయుక్తంగా దక్కించుకున్నారు.

ఎమ్మీ అవార్డు విజేతలతో ‘ది పిట్’ సిరీస్ యూనిట్ సభ్యులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎమ్మీ అవార్డు విజేతలతో ‘ది పిట్’ సిరీస్ యూనిట్ సభ్యులు

మూడు ఎమ్మీలతో ‘ది పిట్’

అవుట్‌స్టాండింగ్ డ్రామా సిరీస్‌ అవార్డును 'ది పిట్' గెలుచుకుంది.

ఈ విభాగంలోనే అవుట్‌స్టాండింగ్ లీడ్ యాక్టర్‌గా నోవువైల్ నిలిచారు. అవుట్‌స్టాండింగ్ సపోర్టింగ్ యాక్టరెస్ అవార్డును కేథరిన్ లనాసా గెలుచుకున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)