బిగ్‌‌ బాస్ తెలుగు: 15 మంది కంటెస్టెంట్స్ వీళ్లే, ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ థీమ్‌తో ప్రారంభమైన 9వ సీజన్

బిగ్‌బాస్, బిగ్‌బాస్ తెలుగు, నాగార్జున, రీతూ చౌదరి,

ఫొటో సోర్స్, biggbossteluguofficials/instagram

ఫొటో క్యాప్షన్, బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభమైంది.

సంజనా గల్రానీ, ఫ్లోరా సైనీ, సుమన్ షెట్టి, రీతూ చౌదరి, శ్రష్టి వర్మ, ఇమ్మాన్యుయేల్... సినీ నటులు, సెలబ్రిటీలు సహా కొందరు సామాన్యులతో కలిపి బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభమైంది.

ఈసారి కంటెస్టెంట్లలో 9 మంది సెలబ్రిటీలు, ఆరుగురు సామాన్యులు ఉన్నారు. నటుడు నాగార్జున మరోసారి బిగ్‌బాస్ హోస్ట్‌గా వచ్చారు.

స్టార్‌మా, జియో హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమం ఈసారి డబుల్ హౌస్ కాన్సెప్ట్‌తో మరింత ఉత్సాహాన్ని అందిస్తుందని నాగార్జున చెప్పారు.

ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అనే కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సీజన్‌లో ఒక ఇంట్లో సెలబ్రిటీలు, మరో ఇంట్లో సామాన్యులు ఉంటారు. సామాన్యుల్ని ఎంపిక చేసేందుకు 'అగ్ని పరీక్ష' అనే ప్రీ షో నిర్వహించారు.

కంటెస్టెంట్స్ ఎవరంటే...

తనూజ పుట్ట స్వామి

ఫొటో సోర్స్, Instagram/thanuja_puttaswamy_

ఫొటో క్యాప్షన్, తనూజ పుట్ట స్వామి

తనూజ పుట్ట స్వామి: ముద్దమందారం సీరియల్‌లో నటించిన తనూజ పుట్ట స్వామి బిగ్‌బాస్ హౌస్‌ సీజన్-9 తొలి కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టారు.

స్టార్‌ మాలో ప్రసారమైన 'కుకు విత్ జాతిరత్నాలు' అనే షోలో ఆమె పాల్గొన్నారు. తన ఎనర్జీతో షోకు ఆకర్షణ తీసుకొస్తారని ఆమె గురించి స్టార్‌మా, జియోహాట్ స్టార్ ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్ చేశాయి.

ప్లోరా సైనీ

ఫొటో సోర్స్, Instagram/florasaini

ఫొటో క్యాప్షన్, ప్లోరా సైనీ

ఫ్లోరా సైనీ: ఆశా సైనీగా తెలుగువారికి బాగా పరిచయమైన నటి.

'నరసింహ నాయుడు' సినిమాలో హీరోయిన్ సోదరి పాత్రలో కనిపించిన ఆశా సైనీ, ఆ సినిమాలో 'లక్స్ పాప' అనే పాపులర్ సాంగ్‌లో బాలకృష్టతో కలిసి డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత కూడా సైనీ అనేక సినిమాల్లో నటించారు.

బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేముందు నాగార్జున ఆమెను ఆశా సైనీ అని పిలవగా తన పేరు 'ఫ్లోరా సైనీ' అని ఆమె చెప్పారు.

కళ్యాణ్ పడాల, బిగ్ బాస్ తెలుగు

ఫొటో సోర్స్, Instagram/Kalyanpadala881

ఫొటో క్యాప్షన్, పవన్ కళ్యాణ్ పడాల

పవన్ కళ్యాణ్ పడాల: ఈ సీజన్‌లో బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టిన మూడో కంటెస్టెంట్, తొలి సామాన్యుడు పవన్ కళ్యాణ్ పడాల అలియాస్ సోల్జర్ కళ్యాణ్.

బిగ్‌బాస్ హౌస్‌లోకి సామాన్యుల్ని ఎంపిక చేసేందుకు నిర్వహించిన "అగ్ని పరీక్ష" కార్యక్రమంలో ఆడియన్స్ ఓటింగ్ ఆధారంగా ఆయన ఎంపికయ్యారు. విజయనగరం జిల్లాకు చెందిన కళ్యాణ్ ఇండియన్ ఆర్మీలో పని చేస్తున్నారు.

ఇమ్మాన్యుయేల్, బిగ్ బాస్

ఫొటో సోర్స్, Instagram/jabardasth_emmanuel

ఫొటో క్యాప్షన్, ఇమ్మాన్యుయేల్

ఇమ్మాన్యుయేల్: బిగ్‌బాస్ హౌస్‌లోకి నాలుగో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ఇమ్మాన్యుయేల్ ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయ్యారు.

ఆయన అనేక టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన ఇమ్మాన్యుయేల్ స్టాండప్ కమెడియన్ కూడా.

శ్రష్టి వర్మ

ఫొటో సోర్స్, Instagram/vermashrasti

ఫొటో క్యాప్షన్, శ్రష్టి వర్మ

శ్రష్టి వర్మ: ఈటీవీలో ప్రసారమయ్యే 'ఢీ' షో ద్వారా డాన్సర్‌గా పరిచయమైన శ్రష్టి వర్మ, తర్వాతి కాలంలో కొరియోగ్రాఫర్‌గా మారారు.

ఆమె ఐదో కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టారు.

హరిత హరీశ్

ఫొటో సోర్స్, Instagram/jiohotstartelugu

ఫొటో క్యాప్షన్, హరిత హరీశ్

హరిత హరీశ్: ఆరో కంటెస్టెంట్‌గా సామాన్యుల కేటగిరీ నుంచి హరిత హరీశ్ ప్రవేశం దక్కించుకున్నారు.

అగ్నిపరీక్ష జ్యూరీ మెంబర్ అయిన బింధు మాధవి ఆయన పేరును ఎంపిక చేశారు. జీవితంలో తాను ఒత్తిడిలో ఉన్నప్పుడు బిగ్‎బాస్ ఊరటనిచ్చిందని హరీశ్ చెప్పారు.

భరణి శంకర్, బిగ్ బాస్

ఫొటో సోర్స్, Instagram/actor_bharanii

ఫొటో క్యాప్షన్, భరణి శంకర్

భరణి శంకర్: చి.ల.సౌ స్రవంతి సీరియల్‌తో పాపులరైన భరణి శంకర్ ఏడో కంటెస్టెంగ్‌గా బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు.

భరణి 25కి పైగా సీరియల్స్‌లో నటించారు. పలు తెలుగు సినిమాల్లోనూ నటించారు.

రీతూ చౌదరి

ఫొటో సోర్స్, Instagram/rithu_chowdhary

ఫొటో క్యాప్షన్, రీతూ చౌదరి

రీతూ చౌదరి: బిగ్‌బాస్ హౌస్‌లోకి 8వ కంటెస్టెంట్‌గా 'జబర్దస్త్' ఫేమ్ రీతూ చౌదరి ఎంట్రీ ఇచ్చారు.

ఇన్నాళ్లు పలు షోలు, ప్రోగ్రామ్స్ ద్వారా రీతూ పాపులర్ అయ్యారు. ఇప్పుడు బిగ్‎బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు.

డిమాన్ పవన్

ఫొటో సోర్స్, Instagram/jiohotstartelugu

ఫొటో క్యాప్షన్, డిమాన్ పవన్

డిమాన్ పవన్: తొమ్మిదవ కంటెస్టెంట్‌గా సామన్యుల కేటగిరీ నుంచి డిమాన్ పవన్ ఎంట్రీ ఇచ్చారు. అగ్నిపరీక్ష ద్వారా బిగ్‎బాస్ ఇంట్లోకి అడుగుపెట్టారాయన.

సంజనా గల్రానీ

ఫొటో సోర్స్, Instagram/sanjjanaagalrani

ఫొటో క్యాప్షన్, సంజనా గల్రానీ

సంజనా గల్రానీ: ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమాతో పాపులర్ అయిన సంజన, కన్నడ నటి. తెలుగులో అనేక సినిమాల్లో నటించారు.

2020 సెప్టెంబర్ 8న బెంగళూరు డ్రగ్స్ కేసులో సంజన అరెస్ట్ అయ్యారు.

ఈ కేసులో మూడు నెలలు జైలులో ఉన్నారు. హౌస్‌లోకి పదో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టారు.

రాము రాథోడ్

ఫొటో సోర్స్, Instagram/ramurathod_official

ఫొటో క్యాప్షన్, రాము రాథోడ్

రాము రాథోడ్: పదకొండవ కంటెస్టెంట్‌గా ఫోక్ సింగర్ రాము రాథోడ్ ఎంట్రీ ఇచ్చారు.

'రాను బొంబయికి రాను' పాటతో ఈయన పాపులర్ అయ్యారు.

అలాంటి ఫోక్ సాంగ్‌తో అలరించిన రాము ఇప్పుడు బిగ్‎బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు.

శ్రీజ దమ్ము

ఫొటో సోర్స్, Instagram/srija_sweetiee

ఫొటో క్యాప్షన్, శ్రీజ దమ్ము

శ్రీజ దమ్ము: బిగ్‌బాస్ హౌస్‌లోకి పన్నెండో కంటెస్టెంట్‌గా శ్రీజ దమ్ము పేరును సెలెక్ట్ చేశారు జ్యూరీ మెంబర్ నవదీప్.

తానెప్పుడూ విజేత స్థానానికే లక్ష్యం పెట్టుకున్నట్లు శ్రీజ షోలోకి ప్రవేశించే ముందు చెప్పారు. షోలో చివరి వరకు ఉంటానని ఆమె అన్నారు.

సుమన్ శెట్టి

ఫొటో సోర్స్, Instagram/jiohotstartelugu

ఫొటో క్యాప్షన్, సుమన్ శెట్టి

సుమన్ శెట్టి: ఇక సెలబ్రిటీ కేటగిరీ నుంచి బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు హాస్య నటుడు సుమన్ శెట్టి.

ఈయన పలు తెలుగు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. జయం సినిమాతో మొదలైన తన ప్రయాణం ఆ తర్వాత తెలుగు, కన్నడ, మలయళం, భోజ్ పురి చిత్రాల్లో నటించేలా చేసిందని అన్నారు.

ప్రియ శెట్టి

ఫొటో సోర్స్, Instagram/priyaa_epooru

ఫొటో క్యాప్షన్, ప్రియ శెట్టి

ప్రియ శెట్టి: 14వ పోటీదారుగా సామాన్యుల కేటగిరీ నుంచి ప్రియ శెట్టి ఎంపికయ్యారు. ఆమెను ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా సెలెక్ట్ చేశారు.

మర్యాద మనీష్

ఫొటో సోర్స్, Instagram/maryada.manish

ఫొటో క్యాప్షన్, మర్యాద మనీష్

మర్యాద మనీష్: ఇక జ్యూరీ మెంబర్ అభిజిత్ ఎంపిక ప్రకారం సామాన్యుల కేటగిరీ నుంచి మర్యాద మనీష్‌ను 15వ పోటీదారుగా హౌస్‌లోకి పంపించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)