బ్లడ్‌ మూన్: ప్రపంచవ్యాప్తంగా చంద్ర గ్రహణం, 8 ఫోటోలలో..

చంద్ర గ్రహణం, భూమి, చంద్రుడు, బ్లడ్ మూన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దిల్లీ శివార్లలో చంద్రగ్రహణం ఇలా కనిపించింది.

సెప్టెంబర్ 7, ఆదివారం ఖగోళ శాస్త్రవేత్తలకు, అంతరిక్ష ప్రియులకు వెరీ స్పెషల్ డే. భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో పూర్తి చంద్రగ్రహణం కనిపించింది.

ఈ సంపూర్ణ చంద్రగ్రహణం 'బ్లడ్ మూన్'గా కనిపించింది. అంటే చంద్రుడు ఎరుపు రంగులో, సాధారణం కంటే పెద్ద సైజులో కనిపించాడు.

భారతదేశంతో సహా తూర్పు ఆఫ్రికా, యూరప్, పశ్చిమ ఆస్ట్రేలియా, ఆసియాలోని చాలా దేశాలలో ఈ ఖగోళ ఘటన ప్రారంభం నుండి చివరి వరకు స్పష్టంగా కనిపించింది.

ఇది ఈ సంవత్సరపు చివరి చంద్రగ్రహణం.

చంద్ర గ్రహణం, భూమి, చంద్రుడు, బ్లడ్ మూన్, తెహ్రాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తెహ్రాన్‌లో టెలిస్కోప్ ద్వారా స్థానికులు చంద్రగ్రహణాన్ని చూశారు.
చంద్ర గ్రహణం, భూమి, చంద్రుడు, బ్లడ్ మూన్, తెహ్రాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, షాంఘై వరల్డ్ ఫైనాన్షియల్ సెంటర్‌‌లో చంద్రగ్రహణం ఇలా కనిపించింది

లద్దాఖ్ నుంచి తమిళనాడు వరకు, ఆదివారం రాత్రి సాగిన చంద్రగ్రహణాన్ని కోట్ల కళ్లు వీక్షించాయి. అరుదైన 'బ్లడ్‌ మూన్'తోపాటు సంపూర్ణ చంద్రగ్రహణాన్ని ప్రజలు చూశారు.

ఆదివారం రాత్రి 9:57 గంటల నుండి భూమి నీడ చంద్రుని ఉపరితల మీద పడటం ప్రారంభించింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మేఘావృతమైన ఆకాశం, వర్షాల కారణంగా చంద్రుడు కనిపించ లేదు.

భూమి నీడ మొత్తం చంద్రుడిని కప్పివేశాక 'బ్లడ్ మూన్' ఆవిష్కృతమైంది.

చంద్ర గ్రహణం, భూమి, చంద్రుడు, బ్లడ్ మూన్, తెహ్రాన్

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్‌లోని ఒడెసా బీచ్‌లో చంద్రగ్రహణం సమయంలో అలలు ఎగసి పడ్డాయి
చంద్ర గ్రహణం, భూమి, చంద్రుడు, బ్లడ్ మూన్, తెహ్రాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కువైట్ నగరంలో మినార్ పై నుంచి నిండు చంద్రుడు ఇలా కనిపించాడు
చంద్ర గ్రహణం, భూమి, చంద్రుడు, బ్లడ్ మూన్, తెహ్రాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆసియాతో పాటు యూరప్, ఆఫ్రికా మరికొన్ని ప్రాంతాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది.
చంద్ర గ్రహణం, భూమి, చంద్రుడు, బ్లడ్ మూన్, తెహ్రాన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, బాగ్దాద్
చంద్ర గ్రహణం, భూమి, చంద్రుడు, బ్లడ్ మూన్, తెహ్రాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈజిప్టులోని సినాయ్ ఎడారి

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)