అండర్-19 మెన్స్ వరల్డ్ కప్: భారత్‌ను ఓడించిన ఆస్ట్రేలియా

ఫొటో సోర్స్, Getty Images
అండర్-19 వరల్డ్ కప్‌లో భారత జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. 253 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 174 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
మూడో ఓవర్ నుంచే భారత్ టాపార్డర్ పతనం మొదలైంది. ఆ తర్వాత క్రమంగా వికెట్లు కోల్పోతూ వచ్చిన భారత జట్టు ఆస్ట్రేలియాకు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది.
25 ఓవర్లు పూర్తయ్యే సరికి 90 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. టాపార్డర్ విఫలం కావడంతో మిగిలిన వారిపై ఒత్తిడి పెరిగింది. 30 ఓవర్లు వచ్చే సరికి భారత్ ఆరు వికెట్లు కోల్పోయి 115 పరుగులు మాత్రమే చేయగలిగింది.
8వ వికెట్ కోల్పోయిన తర్వాత తిరిగి భారత జట్టు కాస్త కోలుకున్నట్లు కనిపించినా, చివరకు 43.5 ఓవర్లలో 174 పరుగుల వద్ద భారత్ కథ ముగిసింది.
భారత జట్టులో ఆదర్శ్ సింగ్ ఒక్కడే 47 పరుగులు చేశాడు. ముషీర్‌ఖాన్(22), మురుగన్ అభిషేక్(42) , నమన్ తివారి(14) తప్ప జట్టులో మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇద్దరు బ్యాటర్లు డకౌట్ అయ్యారు.
ఆస్ట్రేలియా బౌలర్లలో మెక్ మిలన్, బియర్డ్‌మాన్ చెరి 3 వికెట్లు తీయగా, కల్లమ్ విడ్లర్ 2 వికెట్లు తీశాడు.

ఫొటో సోర్స్, Getty Images
అంతకు ముందు టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 253 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియన్ బ్యాటర్లలో హర్జాస్ సింగ్ 55, విబ్జెన్ 48, డిక్సన్ 42 పరుగులు చేయగా, ఓలీవర్ పీకే 46 పరుగులతో, టామ్ స్ట్రేకర్ 8 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
భారత బౌలర్లలో లింబానీ 3 వికెట్లు తీయగా, నమన్ తివారీ 2, సౌమీ పాండే, ముషీర్‌ఖాన్‌లు చెరో వికెట్ తీశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
అండర్ 19లో భారత్ ఆధిపత్యం
అండర్-19 క్రికెట్ ప్రపంచకప్‌లో భారత్ ఆధిపత్యం చెలాయిస్తూ వస్తోంది. గతంలో ఐదుసార్లు వరల్డ్ ఫైనల్‌లో విజయం సాధించిన ఘనత భారత్ పేరిట ఉంది.
ఆస్ట్రేలియాతో 2012, 2018 సంవత్సరాలలో ఫైనల్లో తలపడగా, ఈ రెండు మ్యాచుల్లోనూ భారత్‌నే విజయం వరించింది.
అయితే, ఆదివారంనాటి ఫైనల్లో కూడా ఆస్ట్రేలియాను మరోసారి ఓడించి ఆరోసారి కప్ గెలవాలన్న భారత్ ఆశలు నెరవేర లేదు.

ఫొటో సోర్స్, Getty Images
గ్రూప్ మ్యాచుల్లోనూ భారత్ హవా
గ్రూప్, సూపర్ సిక్స్ మ్యాచుల్లో కూడా భారత్ తన సత్తా చాటింది. బంగ్లాదేశ్, ఐర్లాండ్, యూఎస్ఏల మీద విజయం సాధించడం ద్వారా గ్రూప్ ఏ భారత జట్టు తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది.
సూపర్ సిక్స్‌లో న్యూజీలాండ్, నేపాల్‌లను ఓడించి టోర్నీలో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. గ్రూప్ ఏలో టాప్‌లో నిలవడమే కాకుండా, సెమీస్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.
2000, 2008, 2012, 2018, 2022 సంవత్సరాలలో జరిగిన అండర్ 19 వరల్డ్ కప్‌లను భారత జట్టు గెలుచుకుంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా (రెండుసార్లు), పాకిస్తాన్, సౌతాఫ్రికాలపై వరల్డ్ కప్‌లలో భారత జట్టు విజయం సాధించింది.
ఇవి కూడా చదవండి:
- పరీక్షల్లో ‘చీటింగ్’ను అరికట్టేందుకు తీసుకొచ్చిన కొత్త చట్టం వల్ల ఫలితం ఉంటుందా... అసలు ఈ చట్టంలో ఏముంది?
- ఉత్తరాఖండ్ యూసీసీ: 'లివ్-ఇన్ రిలేషన్షిప్'లో ఉన్నవారు రిజిస్ట్రార్‌కు సమాచారం ఇవ్వాలి, లేకుంటే శిక్ష తప్పదంటున్నకొత్త చట్టం
- రేవంత్ రెడ్డి X కేసీఆర్: ముఖ్యమంత్రులు బూతులు మాట్లాడొచ్చా? నేతల దిగజారుడు భాషను ఎలా చూడాలి?
- ఫుడ్ ప్యాకెట్ల మీద ధరతోపాటు చూడాల్సిన కీలక అంశాలు ఇవీ








