44 మంది మరణానికి కారణమైన హాంకాంగ్ అపార్ట్‌మెంట్స్ అగ్నిప్రమాద తీవ్రతను చెప్పే 10 ఫోటోలు ఇవే...

ఫొటో సోర్స్, AFP via Getty Images
హాంకాంగ్‌లోని తై పో ప్రాంతంలోని ఓ నివాస ప్రాంతంలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో ఇప్పటివరకు 44 మంది మరణించినట్లు ధృవీకరించారు. ఇంకా 279 మంది ఆచూకీ తెలియలేదు.


ఫొటో సోర్స్, Reuters
గురువారం డ్రోన్‌తో తీసిన చిత్రంలో వాంగ్ ఫు కోర్ట్ గా పిలిచే హౌసింగ్ కాంప్లెక్స్ నుంచి అగ్నికీలలు, దట్టమైన పొగ ఎగసిపడుతున్న దృశ్యం కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
ఈ అగ్నిప్రమాదం స్థానిక కాలమానప్రకారం బుధవారం మధ్యాహ్నం సుమారు 2 గంటల 51 నిమిషాలకు జరిగినట్టు హాంకాంగ్ ప్రభుత్వం తెలిపింది.

ఫొటో సోర్స్, Reuters
మంటలను ఆర్పేందుకు సుమారు 800 మంది అగ్నిమాపక సిబ్బందిని నియమించారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి వారు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
"సుమారు 95 శాతం మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ప్రజలు ఆశ్రయం పొందేందుకు శిబిరాలు ఏర్పాటు చేశారు. అక్కడ మందులు, ఆహారం వంటివి అందిస్తున్నారు" అని తై పో డిస్ట్రిక్ట్ కౌన్సిలర్ బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
అగ్ని ప్రమాదానికి కారణం ఏంటనేది ఇంకా తెలియలేదు. అయితే భవనంలో మరమ్మతు పనులు జరుగుతున్నాయని, అక్కడ పనుల కోసం వెదురు బొంగులతో ఏర్పాటు చేసిన నిర్మాణం(పరంజా), పోలిస్టైరిన్ బోర్డులు(ప్లాస్టిక్ బోర్డులు) ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు అనుమానిస్తున్నారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
"నేను షాక్‌లో ఉన్నాను. నా కుటుంబ సభ్యులు, పెంపుడు కుక్క గురించి చాలా ఆందోళనగా ఉన్నాను" అని వాంగ్ ఫు కోర్ట్ నివాసి జేసన్ కాంగ్ రాయిటర్స్‌తో అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
వాంగ్ ఫుక్ట్ కోర్ట్ నివాసులు ప్రస్తుతానికి శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. వారికి ఎంతమేర నష్టం జరిగిందో తెలియలేదు.

ఫొటో సోర్స్, Getty Images
వాంగ్ ఫు కోర్ట్‌లో మొత్తం ఎనిమిది టవర్ బ్లాకులు ఉన్నాయి. ప్రతి ఒక్కటి 31 అంతస్తుల ఎత్తులో ఉంది. 2021 ప్రభుత్వ జనగణన ప్రకారం, ఇక్కడ సుమారు 4,600 నివాసులకు 1,984 ఫ్లాట్లు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Reuters
ఈ టవర్ బ్లాక్‌లను 1983 లో నిర్మించారు. ప్రస్తుతం వీటి మరమ్మతు పనులు జరుగుతున్నాయి. చిత్రంలో వెదురుబొంగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవి అగ్నికీలలు వేగంగా వ్యాపించడానికి కారణమయ్యాయని అంచనా వేస్తున్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














