పులుల అవయవాల అక్రమ రవాణా కేసుల్లో ఇంటర్‌పోల్ వెతుకుతున్న నిందితురాలు ఇండియాలో అరెస్ట్.. ఎవరీమె?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఎన్‌బరాసన్ ఎథిరాజన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పులుల శరీరభాగాల అక్రమ రవాణాకు సంబంధించి ప్రపంచంలోని ‘మోస్ట్ వాంటెడ్’లలో ఒకరైన నిందితురాలిని భారత్‌లో ఇటీవల అరెస్ట్ చేశారు.
యాంగ్‌చెన్ లచుంగ్‌పాను గత వారం ప్రారంభంలో అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు చెప్పారు.
పులుల శరీరభాగాలను దేశం బయటకు తరలించడానికి అక్రమ రవాణా కారిడార్లను ఏర్పాటుచేయడంలో ఆమె కీలకపాత్ర పోషించినట్లు ఆరోపణలున్నాయి.
లచుంగ్‌పా ఇంటర్‌పోల్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నారు. ఆమె బెయిల్ విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది.
భారత్‌లో పులుల వేట, అక్రమరవాణా అరికట్టడానికి చేస్తున్న ప్రయత్నాల్లో యాంగ్‌చెన్ అరెస్ట్ అతిపెద్ద విజయమని వన్యప్రాణి సంరక్షణాధికారులు చెప్పారు.


ఫొటో సోర్స్, Getty Images
జంతువుల అవయవాల అక్రమ రవాణా కేసులో మహిళను అరెస్టు చేయడం అరుదైన విషయం.
లచుంగ్‌పా కోసం పోలీసులు చాలా ఏళ్లుగా వెతుకుతున్నారు. మధ్యప్రదేశ్ స్టేట్ టైగర్ స్ట్రైక్ ఫోర్స్, వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో ఆమె అరెస్టయినట్లు పర్యావరణ మంత్రిత్వశాఖ తెలిపింది.
నేపాల్, టిబెట్, భూటాన్‌లలో ఉన్న అక్రమరవాణా నెట్‌వర్క్‌లో లచుంగ్‌పా ప్రధాన సభ్యురాలు. దిల్లీ సహా అనేక భారత నగరాల్లో ఈ నెట్‌వర్క్ విస్తరించి ఉంది.
ఇంతకుముందు 2017లో లచుంగ్‌పా అరెస్టయ్యారు. బెయిల్ మంజూరయిన తర్వాత కనిపించకుండాపోయారు.

ఫొటో సోర్స్, Getty Images
పులుల అవయవాలకు చైనాలో డిమాండ్
2015లో అరెస్టయిన జై తమాంగ్ అనే నిందితుడు తనకు ఆశ్రయమిచ్చినందుకు ప్రతిగా వన్యప్రాణుల శరీరభాగాలను లచుంగ్‌పాకు అప్పగించినట్టు చెప్పారు.
చైనా సంప్రదాయ వైద్యంలో పులుల అవయవాలకు డిమాండ్ ఉంది.
2024లో పులుల అక్రమవేటకు సంబంధించిన కేసులు 26, అంతకుముందు ఏడాది 56 నమోదయ్యాయని అంతర్జాతీయ వన్యప్రాణి సంరక్షణ సంస్థ తెలిపింది.
అయితే అక్రమవేట వల్ల ఎన్నో పులులు చనిపోతున్నాయని వాటికి ఆధారాలు ఉండడం లేదని తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














