ఏపీ, తెలంగాణల్లో వరద కష్టం, నష్టం కళ్లకు కట్టే చిత్రాలు: వీధుల్లో పడవలు, భోజనం అందిస్తున్న డ్రోన్లు

పొలాల్లో కూరుకుపోయిన కార్లను ట్రాక్టర్లతో బయటికి తీసుకొస్తున్నారు
ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ దగ్గర పొలాల్లో కూరుకుపోయిన కార్లను ఇలా ట్రాక్టర్లతో బయటికి తీసుకొస్తున్నారు

ఏపీ, తెలంగాణలలో వరద తగ్గుముఖం పట్టింది. ఇప్పటికీ వరదనీటిలో చిక్కుకుపోయిన వారికి పడవల్లో వెళ్లి, డ్రోన్ల సహాయంతో ఆహారాన్ని అందిస్తున్నారు. విజయవాడలో పడవల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు దెబ్బతిన్న రైల్వే లైన్లకు మరమ్మతులు వేగంగా కొనసాగుతున్నాయి.

విజయవాడలో చిక్కుకున్నవారిని వీధుల్లో పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నిన్నటిదాక నడిచిన దారే: విజయవాడలో జలదిగ్బంధంలో చిక్కుకున్నప్రజలను పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు
వీడియో క్యాప్షన్, ఖమ్మం వరదలు: "నేను ఒక్కడిని పోయినా పర్వాలేదు.. ఆ 9 మందిని కాపాడాలనుకున్నా.."
విజయవాడలో వరదలో చిక్కుకున్న వృద్ధులను తరలిస్తున్న వలంటీర్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చేయూత: విజయవాడలో వరదలో చిక్కుకున్న వృద్ధులను తరలిస్తున్న వలంటీర్లు
హెలికాప్టర్‌లో ఆహార పదార్థాల సరఫరా
ఫొటో క్యాప్షన్, వాయువేగం: వరద బాధిత ప్రాంతాల ప్రజలకు హెలికాప్టర్ ద్వారా ఆహారపదార్థాలు అందించే ఏర్పాట్లు
విజయవాడ ప్రకాశం బరాజ్ వద్ద పరిస్థితి ఇలా
ఫొటో క్యాప్షన్, తెరిపినపడ్డట్టేనా?: రైల్వే బ్రిడ్జి కింద కృష్ణమ్మ ఉద్ధృతి
చుట్టూ నీరు ముంచెత్తడంతో భవనాలపై ఉండిపోయినవారికి డ్రోన్లతో ఆహార ప్యాకెట్ల సరఫరా
ఫొటో క్యాప్షన్, టెక్నాలజీ సాయం: విజయవాడలో భవనాలపై ఉండిపోయినవారికి డ్రోన్లతో ఆహార ప్యాకెట్ల సరఫరా
తెలంగాణలో వరదకు కోత పడిన రోడ్డు
ఫొటో క్యాప్షన్, ‘తారెత్తిస్తున్న’రోడ్డు: తెలంగాణలో వరదకు కోత పడిన రోడ్డు
దెబ్బతిన్న రైల్వే లైన్
ఫొటో క్యాప్షన్, పట్టాలెక్కుతున్న పనులు: తెలంగాణలో తాళ్ళపూసపల్లి సమీపంలో దెబ్బతిన్న రైల్వే లైనుకు మరమ్మతులు
వరద నీటిలో మునిగి తేలిన ఇల్లు..
ఫొటో క్యాప్షన్, ఖమ్మం పట్టణ శివారులో వరద నీటిలో మునిగి తేలిన ఇల్లు..
వరదలో కొట్టుకొచ్చిన చెత్త ఓ ఇంటి కిటికీలో చిక్కింది
ఫొటో క్యాప్షన్, ఖమ్మం శివారులో ఇదీ పరిస్థితి: వరదలో కొట్టుకొచ్చిన చెత్త ఓ ఇంటి కిటికీలో చిక్కింది
ఖమ్మంలోని ఓ ఇల్లు
ఫొటో క్యాప్షన్, మున్నేరు ఉప్పొంగడంతో ఖమ్మంలోని ఓ ఇల్లు ఇలా అయ్యింది..
ఖమ్మంలో మున్నేరు పరిసర ప్రాంతాల్లోని అనేక ఇళ్లు వరద నీటిలో మునిగాయి
ఫొటో క్యాప్షన్, ఖమ్మంలో మున్నేరు పరిసర ప్రాంతాల్లోని అనేక ఇళ్లు వరద నీటిలో మునిగాయి
ఖమ్మంలో వరద
ఫొటో క్యాప్షన్, ఖమ్మంలో మున్నేరు పరిసర ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు వెళ్లడంతో సామాన్లన్నీ తడిసిపోయాయి. వరద తగ్గడంతో ఆ సమాన్లను ఇలా ఆరబెడుతున్నారు
ఖమ్మం జిల్లా పాలేరులో వరద బీభత్సం
ఫొటో క్యాప్షన్, ఖమ్మం జిల్లా పాలేరులో వరద సృష్టించిన విధ్వంసం ఇది..
ఖమ్మం వరద
ఫొటో క్యాప్షన్, ఇది గార్డెన్ కాదు: ఖమ్మంలో వరద విధ్వంసాన్ని కళ్లకు కట్టే చిత్రాల్లో ఇదొకటి. వరదలో కొట్టుకొచ్చిన గుర్రపుడెక్క, పిచ్చి మొక్కలు ఒక గ్యాస్ ఏజెన్సీ కార్యాలయం పరిసరాల్లో ఇలా పేరుకుపోయాయి.
వీడియో క్యాప్షన్, ఖమ్మం కన్నీటి గాథ, కొట్టుకుపోయిన యాకుబ్ కుటుంబం

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)