సురాన్‌కోట్: తాత్కాలిక బాంబు షెల్టర్‌లో ఒక రాత్రి ఎలా గడిచిందంటే...

సురాన్‌కోట్‌

ఫొటో సోర్స్, Debalin Roy

ఫొటో క్యాప్షన్, పూంఛ్‌లో షెల్లింగ్ నుంచి తప్పించుకోవడానికి సురాన్‌కోట్‌కు వచ్చిన యువ జంటకు ఇక్కడ కూడా అదే అనుభవం ఎదురైంది.
    • రచయిత, డెబాలిన్ రాయ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో ఉన్న సురాన్‌కోట్‌లో తొలిసారిగా షెల్లింగ్, ఫిరంగి కాల్పుల ఘటనలు జరిగాయని స్థానికులు చెప్పారు. సరిహద్దు ప్రాంతాలలో దీన్ని చాలా సురక్షితమైన పట్టణంగా భావిస్తారు, ప్రజలు అక్కడికి సేఫ్టీ కోసం వెళ్తుంటారు.

పూంఛ్ జిల్లా నియంత్రణ రేఖకు దగ్గరగా ఉంటుంది. నేను, నా సహోద్యోగి రాఘవేంద్ర, నేను అక్కడ ఉన్నప్పుడు రాత్రంతా భారీ షెల్లింగ్ జరిగింది.

ఆ రాత్రి సురక్షితంగా ఉండటానికి నియంత్రణ రేఖ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సురాన్‌కోట్ పట్టణానికి మేం వచ్చాం.

రాత్రి 11 గంటల ప్రాంతంలో మా కథనాలను పంపిన తర్వాత, నిద్రపోవడానికి సిద్ధమవుతుండగా, మా హోటల్ సిటీ ప్యాలెస్ దగ్గర ఒక షెల్ పడింది. మాది 10 గదులున్న ఒక చిన్న చెక్క డబుల్ ఫ్లోర్.

పెద్ద శబ్దం వినగానే మాతో పాటు ఇతర గెస్టులు గదుల నుంచి బయటకు పరిగెత్తాం. ఇంతకుముందు ఇలా జరిగిందా? పేలుళ్ల నుంచి దాక్కోవడానికి సురక్షితమైన స్థలం ఉందా? అని మేం హోటల్ మేనేజర్‌ను అడిగాం.

హోటల్ యజమాని వసీం తల అడ్డంగా ఊపారు. సురాన్‌కోట్‌లో కాల్పులు జరగడం ఇదే మొదటిసారని మాకు చెప్పారు.

ఆయన మమ్మల్నందరినీ హోటల్ బేస్‌మెంట్‌కు తీసుకెళ్లారు. ఇది మూడు వైపుల నుంచి రక్షణగా ఉండటంతో కాస్త సేఫ్ అనిపించింది.

మొదటి 30 నిమిషాలు గందరగోళంగా గడిచింది. సమీపంలోనే మరో పేలుడు సంభవించింది. మేం బేస్‌మెంట్‌లోకి పరిగెత్తుకుంటూ వెళ్తుండగా భవనం కిటికీలు ధ్వంసమయ్యాయి.

అక్కడ ఆరుగురు పిల్లలతో సహా దాదాపు 25 మందిమి ఉన్నాం. మరికొన్ని గంటల పాటు 10-15 నిమిషాల విరామాల్లో షెల్లింగ్, ఫిరంగి కాల్పులు కొనసాగాయి.

ఉదయం 5 గంటల ప్రాంతంలో బేస్‌మెంట్ నుంచి మా గదులకు వెళ్లాం.

వసీం తండ్రి అబ్దుల్లా

ఫొటో సోర్స్, Debalin Roy

ఫొటో క్యాప్షన్, హోటల్ యజమాని వసీం తండ్రి అబ్దుల్లా నిరంతరం ఫోన్‌ తనిఖీ చేసుకుంటూ, ఆ ప్రాంత పోలీసు అధికారుల కోసం ప్రయత్నించారు.
నేలమాళిగ

ఫొటో సోర్స్, Debalin Roy

ఫొటో క్యాప్షన్, 7 సంవత్సరాల పిల్లల నుంచి 80 సంవత్సరాల వృద్ధుల వరకు చిన్న నేలమాళిగలోకి వచ్చారు.
సురాన్‌కోట్‌

ఫొటో సోర్స్, Debalin Roy

ఫొటో క్యాప్షన్, సురాన్‌కోట్‌లో చోటుచేసుకున్న షెల్లింగ్‌తో పలువురికి గాయాలైనట్లు స్థానిక సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కంటెంట్‌లో కలవరపరిచే దృశ్యాలున్నాయి కాబట్టి అవి అస్పష్టంగా ఉన్నాయి.
బీబీసీ కరస్పాండెంట్ రాఘవేంద్ర రావు

ఫొటో సోర్స్, Debalin Roy

ఫొటో క్యాప్షన్, బీబీసీ కరస్పాండెంట్ రాఘవేంద్ర రావు నేలమాళిగలో ఉన్నపుడు బయట పరిస్థితిపై అప్‌డేట్స్ కోసం నిరంతరం ఫోన్ చెక్ చేశారు.
షెల్లింగ్ జరిగిన ప్రాంతం

ఫొటో సోర్స్, Debalin Roy

ఫొటో క్యాప్షన్, షెల్లింగ్ జరిగిన ప్రాంతంలో మరుసటి రోజు ఉదయం
షెల్లింగ్ జరిగిన ప్రాంతం

ఫొటో సోర్స్, Debalin Roy

ఫొటో క్యాప్షన్, షెల్లింగ్ జరిగిన ప్రాంతంలో మరుసటి రోజు
షెల్స్ ముక్కలు

ఫొటో సోర్స్, Debalin Roy

ఫొటో క్యాప్షన్, షెల్లింగ్ తర్వాత దొరికిన శిథిలాలు
షెల్స్ ముక్కలు

ఫొటో సోర్స్, Debalin Roy

ఫొటో క్యాప్షన్, షెల్లింగ్ తర్వాత దొరికిన శిథిలాలు
సురాన్‌కోట్

ఫొటో సోర్స్, Debalin Roy

ఫొటో క్యాప్షన్, మరుసటి రోజు ఉదయం కుటుంబాలతో కలిసి సురాన్‌కోట్ నుంచి సురక్షిత ప్రాంతాలకు బయలుదేరుతున్న ప్రజలు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)