తెలంగాణలో మొంథా తుపాను తీవ్రత చెప్పే 9 ఫొటోలు

తెలంగాణ, ఉమ్మడి వరంగల్, వరదలు, మొంథా తుపాను
ఫొటో క్యాప్షన్, కాలనీల్లోకి చెరువు నుంచి నీరు రావడంతో చేపల కోసం స్థానికులు వలలు వేశారు.
    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

మొంథా తుపాను కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. వరద ముంచెత్తడంతో చాలా ప్రాంతాల్లో రహదారులు మునిగిపోయాయి, రాకపోకలు నిలిచిపోయాయి.

బుధవారం తెలంగాణలోనే అత్యధికంగా హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో 42 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

చుట్టుపక్కల చెరువుల నుంచి భారీగా వరద నీరు రావడంతో వరంగల్ నగరంలో పలు కాలనీలు జలమయమయ్యాయి. ఎస్టీఆర్ఎఫ్, స్థానిక మునిసిపాలిటీ, రెవెన్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

వరంగల్‌లోని అండర్ బ్రిడ్జి సమీపంలో వరద నీరు పోటెత్తడంతో ఉత్తర తెలంగాణ నుంచి నగరంలోకి వచ్చే వాహనాలు వందల సంఖ్యల చిక్కుకుపోయాయి.

ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి కొండా సురేఖ చెప్పారు.

తెలంగాణలో మొంథా తుపాను, ఉమ్మడి వరంగల్
ఫొటో క్యాప్షన్, భారీ వర్షాలు, వరదలతో వరంగల్ నగరంలో వివిధ కాలనీలు జలమయమయ్యాయి.
ఉమ్మడి వరంగల్, వరదలు, తెలంగాణ, తుపాను
ఫొటో క్యాప్షన్, వరంగల్ నగరంలో వరద ముంచెత్తడంతో రహదారులు మునిగిపోయాయి.
తెలంగాణ, ఉమ్మడి వరంగల్, వరదలు, మొంథా తుపాను
ఫొటో క్యాప్షన్, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది.
తెలంగాణ, ఉమ్మడి వరంగల్, వరదలు, మొంథా తుపాను
ఫొటో క్యాప్షన్, కరీంనగర్ దగ్గర మానేరు ప్రవాహం. ఎల్ఎండీ డ్యామ్ గేట్లు ఎత్తడంతో మానేరు ఇలా ప్రవహిస్తోంది.
తుపాను, ఉమ్మడి వరంగల్
ఫొటో క్యాప్షన్, రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
ఉమ్మడి వరంగల్, వరదలు, మొంథా తుపాను
ఫొటో క్యాప్షన్, గోపాల్ పూర్, వడ్డేపల్లి చెరువుల నుంచి భారీగా వరద నీరు కాలనీల్లోకి చేరింది. వరంగల్‌లో సుమారుగా వంద కాలనీలు జలమయమయ్యాయి.
తెలంగాణ, మొంథా తుపాను
ఫొటో క్యాప్షన్, ఇంజిన్లలోకి నీరు వెళ్లడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
తెలంగాణలో మొంథా తుపాను, ఉమ్మడి వరంగల్, వరదలు
ఫొటో క్యాప్షన్, వరంగల్‌లోని భద్రకాలి నాలా, సమ్మయ్య నగర్ నాల, నయూం నగర్ నాలాల్లో నీరు పొంగి పొర్లాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)