పంచగ్రహకూటమి: ఆకాశంలో అరుదైన దృశ్యం... ఒకేసారి 5 గ్రహాలు

ఫొటో సోర్స్, Getty Images
మంగళవారం, మార్చి 28న ఆకాశంలో అయిదు గ్రహాలు సమాంతరంగా రానున్నాయి.
దీనినే ''ప్లానెటరీ పరేడ్'' లేదా ''పంచగ్రహ కూటమి''గా పిలుస్తున్నారు.
బుధుడు, గురుడు, శుక్రుడు, యురేనస్, అంగారకుడు సమాంతరంగా ఒకే కక్ష్యలోకి వచ్చే దృశ్యం కనిపించనుంది. వీటిలోని కొన్ని గ్రహాలను నేరుగా కళ్లతో చూడొచ్చని చెబుతున్నారు.
ఈ ఐదు గ్రహాల్లో మూడు గ్రహాలు మనము నేరుగా చూడలేమని బిర్లా ప్లానిటోరియం, ప్లానిటరీ సొసైటీ, ఓయూ ఆస్ట్రానమీ డిపార్ట్మెంట్‌కు చెందిన వారు తెలిపారు. రెండిటిని మాత్రమే చూడగలమని వెల్లడించారు. టెలిస్కోప్ ద్వారా అన్ని గ్రహాలను చూడొచ్చు.
బుధుడు, గురు గ్రహాలు సమాంతర కక్ష్య నుంచి కొద్దిసేపటికే పక్కకు జరిగే అవకాశం ఉంది.
స్కాట్లాండ్‌లోని ఉత్తర ప్రాంతాలు, దాని ద్వీపాల నుంచి ఈ దృశ్యం అత్యంత స్పష్టం కనిపించనుంది. స్కాట్లాండ్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ కేతరిన్ హేమన్స్ ఈ అద్భుత దృశ్యాన్ని ఎడిన్‌బర పోర్టోబెల్లో బీచ్ నుంచి వీక్షించనున్నారు. ''రాత్రి వేళలో గ్రహాలు సమాంతరంగా వచ్చే దృశ్యం చూసే అవకాశం రావడం ఖగోళ ఔత్సాహికులకు అద్భుతమైన అవకాశం'' అని ఆమె బీబీసీతో అన్నారు.
ఇలాంటి గ్రహాల కలయికలు అత్యంత ప్రత్యేకమైనవని రాయల్ అబ్జర్వేటరీ గ్రీన్విచ్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్త జేక్ ఫోస్టర్ తెలిపారు. ''గ్రహాలు ఇప్పుడు సమాంతరంగా రావడం లేదు. సౌర మండలంలో విడివిడిగా ఉండే గ్రహాలు, అప్పుడప్పుడు ఇలా ఒకదానికి మరొకటి దగ్గరగా వచ్చే దృశ్యాలు మనకు అరుదుగా కనిపిస్తాయి'' అని అన్నారు.
ఈ అరుదైన గ్రహాల కలయిక కనువిందు చేయనుందని నార్త్ వేల్స్‌కి చెందిన డార్క్ స్కైస్ ఆఫీసర్ డాని రోబర్‌స్టన్ అన్నారు.
''నా గార్డెన్లో కూర్చుని అర్థాకారంలో అందమైన చంద్రుడిని, దానికి ఎడమ వైపు పైభాగంలో అరుణ వర్ణంలో దర్శనమిచ్చే అంగారకుడిని, కొంచెం కింద వైపు వెలుగులీనుతున్న శుక్రుడిని చూస్తా'' అని ఆమె అన్నారు '' అది స్పష్టంగా కనిపిస్తే, మొత్తం చూస్తాను అని అన్నారు.
ఇలాంటి గ్రహాల కలయికలతో సౌర వ్యవస్థలో మనం ఎక్కడున్నామో తెలుస్తుందని కీల్డర్ అబ్బర్వేటరీకి చెందిన డాన్ పై అన్నారు. చంద్రుడు భూమి చుట్టూ, భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్టుగా గ్రహాలు కూడా సూర్యుని చుట్టూ తిరుగుతుంటాయని.. అందువల్ల గ్రహాల మధ్య దూరం మారుతూ ఉంటుందన్నారు.
ఇవి కూడా చదవండి:
- నవరాత్రి వేడుకల సమయంలో మాంసం షాపులను ఎందుకు మూయించేస్తున్నారు? అసలు మాంసం తినని వారు ఎంత మంది?
- ఉత్తర కొరియా- తొలిసారి ‘అణ్వాయుధాలు’ ప్రదర్శించిన కిమ్ జోంగ్ ఉన్
- అల్లు అర్జున్: గంగోత్రి నుంచి పుష్ప వరకు - తగ్గేదేల్యా
- ప్రియాంక గాంధీ దూకుడు కాంగ్రెస్ పార్టీకి గత వైభవాన్ని తీసుకురాగలదా-
- తెలంగాణ- ఆదివాసీలు పరిశ్రమలు పెట్టేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందడం ఎలా-
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








