మిస్ అర్జెంటీనా, మిస్ పుయెర్టోరీకో: 'ఔను... మేమిద్దరం పెళ్ళి చేసుకున్నాం'

మరియానా వారెలా, ఫాబియోలా

ఫొటో సోర్స్, MARIANA VARELA/INSTAGRAM

మాజీ మిస్ అర్జెంటీనా, మాజీ మిస్ పుయెర్టోరీకో పెళ్ళి చేసుకున్నారు. తాము పెళ్ళి చేసుకున్నామని వారు ఇన్‌స్టాగ్రామ్‍లో ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

అర్జెంటీనాకు చెందిన మరియానా వారెలా, పుయెర్టోరీకోకు చెందిన ఫాబియోలా వాలెంటిన్ ఇద్దరూ మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్-2020 ఈవెంట్‌లో కలుసుకున్నారు. ఆ అందాల పోటీలలో వారు ఆ ఏడాదికి తమ తమ దేశాల తరఫున చాంపియన్స్‌గా నిలిచారు.

థాయిలాండ్‌లో జరిగిన ఆపోటీలలో వారిద్దరూ టాప్-10 దశకు చేరుకున్నారు. ఆ సమయంలోనే తమ మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చాటుకున్నారని సీఎన్ఎన్ తెలిపింది.

పీపుల్ మ్యాగజీన్ కథనం ప్రకారం, ఈ అందాల భామలు ఆదివారం నాడు స్పానిష్ భాషలో తమ పెళ్ళి గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు.

మాజీ మిస్ అర్జెంటీనా

ఫొటో సోర్స్, MARIANA VARELA/INSTAGRAM

"మా అనుబంధాన్ని రహస్యంగా ఉంచాలనుకున్నాం. అయితే, ఒక స్పెషల్ రోజున ఈ విషయాన్ని చెప్పాలనుకున్నాం. అదే 28 అక్టోబర్" అని ఆ పోస్ట్‌లో రాశారు.

ఈ సందర్భంగా 26 ఏళ్ళ వారెలా కొన్ని ఫోటోలు కూడా విడుదల చేశారు. వారు కలుసుకున్నప్పుడు, ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్చుకున్నప్పుడు, స్నేహితులతో సరదాగా గడుపుతున్నప్పుడు తీసిన ఫోటోలు అందులో ఉన్నాయి.

సీఎన్ఎన్ వార్తా కథనం ప్రకారం ఈ ఇద్దరు అమ్మాయిలు పుయెర్టోరీకోలోని సాన్ జువాన్ నగరంలో అక్టోబర్ 28న పెళ్ళి చేసుకున్నారు.

స్నేహితులు, అందాల పోటీల విజేతలు వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్-2020 (ఎంజీఐ) విజేత అయిన ఘనా గాయకురాలు అబెనా అకువాబా వారికి ధన్యవాదాలు చెబుతూ, "ఎంజీఐ ఓ గొప్ప కలయికకు వేదికైంది" అని వ్యాఖ్యానించారు.

వీడియో క్యాప్షన్, ఈ అమ్మాయిలిద్దరూ అందాల పోటీల విజేతలు, ఒకరినొకరు ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)