Shehbaz Sharif: భారత్‌లోని ముస్లింలపై పాకిస్తాన్ ప్రధాని ఐక్యరాజ్య సమితిలో ఏమన్నారు? భారత్ ఏమని సమాధానం ఇచ్చింది?

Shehbaz Sharif

ఫొటో సోర్స్, Reuters

Red line
  • పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ శుక్రవారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో మాట్లాడారు.
  • భారత్‌లో ముస్లింలపై అక్కడి ప్రభుత్వం అణచివేతకు పాల్పడుతోందని షరీఫ్ ఐరాస వేదికగా ఆరోపించారు.
  • వివక్షాపూరిత చట్టాలు, హిజాబ్ నిషేధం, మసీదులపై దాడులు, మూక దాడులకు భారతీయ ముస్లింలు బాధితులవుతున్నారని షరీఫ్ ఆరోపించారు.
  • పాకిస్తాన్ తన పొరుగు దేశాలన్నిటితోనూ శాంతిని కోరుకుంటోందని షరీఫ్ అన్నారు.
  • పాకిస్తాన్‌లో వరదల తీవ్రతను షరీఫ్ ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రస్తావించారు.
  • అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Red line

అమెరికాలోని న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్య రాజ్య సమితి 77వ జనరల్ అసెంబ్లీలో పాకిస్తాన్ అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్ శుక్రవారం ప్రసంగించారు.

తమ దేశంలోని వరదల నుంచి ప్రారంభించిన షరీఫ్ భారత్, ఇజ్రాయెల్, పాలస్తీనా, కశ్మీర్ వరకు మాట్లాడుతూ.. ఇస్లామోఫోబియాను ప్రస్తావించారు.

పాకిస్తాన్‌లోని సింధ్, బలూచిస్తాన్ ప్రాంతాలలో వరదలతో తన ఉపన్యాసాన్ని ప్రారంభించిన షాబాజ్ షరీఫ్ భారత్‌తో శాంతి గురించి మాట్లాడారు.

భారత్ విషయం మాట్లాడుతూ.. భారత్‌లో 20 కోట్ల మంది ముస్లింలపై అధికారిక రూపంలో వేధింపులు ఉన్నాయని.. ఇది ఇస్లామోఫోబియా వికృత రూపమని షాబాజ్ షరీఫ్ అన్నారు. వివక్షాపూరిత చట్టాలు, హిజాబ్ నిషేధం, మసీదులపై దాడులు, మూక దాడులకు భారతీయ ముస్లింలు బాధితులవుతున్నారని షరీఫ్ ఆరోపించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

భారత్‌లోని కొన్ని అతివాద గ్రూపులు ముస్లింలను నిర్మూలించాలంటూ పిలుపునివ్వడం ఆందోళనకరమని ఆయన అన్నారు.

ఇస్లామోఫోబియా ప్రపంచవ్యాప్తంగా ఉందని.. 9/11 తరువాత ముస్లింలంటే భయం, వారిపై అనుమానం అంటువ్యాధిలా పెరిగిపోయాయని షరీఫ్ అన్నారు.

షరీఫ్ కంటే ముందు ప్రధానిగా పనిచేసిన ఇమ్రాన్ ఖాన్ అనేకసార్లు చెప్పినట్లే షరీఫ్ కూడా 'ఉగ్రవాదానికి పాకిస్తాన్ ప్రధాన బాధితురాలిగా ఉంది' అన్నారు.

గత రెండు దశాబ్దాల కాలంలో పాకిస్తాన్‌లో ఉగ్రవాద దాడుల కారణంగా 80,000 మంది చనిపోయారని.. 15,000 కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆయన అన్నారు.

పాక్ ప్రధాని తన ప్రసంగంలో కశ్మీర్ అంశం, భారత్‌తో శాంతి అంశాన్నీ ప్రస్తావించారు.

భారత్‌ సహా అన్ని పొరుగు దేశాలతో పాకిస్తాన్ శాంతిని కోరుకుంటోందని ఆయన అన్నారు.

దక్షిణాసియాలో శాంతి, స్థిరత్వం కశ్మీర్ అంశం పరిష్కారంపై ఆధారపడి ఉంటుందని షరీఫ్ అన్నారు.

Shehbaz Sharif

ఫొటో సోర్స్, Reuters

కశ్మీర్ ప్రజలకు స్వయం నిర్ణయాధికారం ఇవ్వకపోవడమనేది సుదీర్ఘకాలంగా ఉన్న ఈ వివాదానికి కేంద్రమని షరీఫ్ అన్నారు. కశ్మీరీలపై భారతదేశం నిరంతరం అణచివేత సాగిస్తోందని.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని చేస్తున్న హత్యలు, కస్టడీ మరణాలు, విచక్షణా రహిత బలప్రయోగం, పెల్లెట్ గన్‌లకు కశ్మీర్ యువత లక్ష్యమవుతున్నారని షరీఫ్ అన్నారు.

అక్రమ మార్గాలలో జనాభా మార్పులు చేపట్టి ముస్లిం మెజారిటీ ప్రాంతాలై జమ్ము, కశ్మీర్‌లను హిందూ మెజారిటీ ప్రాంతంగా మార్చుతున్నారని షరీఫ్ ఆరోపించారు.

'పాకిస్తాన్ ప్రజలు మా కశ్మీరీ సోదరసోదరీమణులకు సంఘీభావంగా ఉంటారు. ఐరాస భద్రత మండలి తీర్మానాల ప్రకారం స్వయం నిర్ణయాధికారం పొందేవరకు కశ్మీరీలు పోరాడుతారు'' అన్నారు షరీఫ్.

''భారత్ 2019 ఆగస్ట్ 15న తీసుకున్న చట్టవిరుద్ధ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. శాంతి, చర్చల మార్గాన్నిఅనుసరించాలి'' అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

భారత్ సమాధానం..

అయితే.. జమ్ముకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని.. అక్కడి వ్యవహారాలు భారత్ అంతర్గత విషయాలని భారత్ అనేక సార్లు చెప్పింది.

తీవ్రవాదం, హింసాత్మక వాతవరణం పోయేంతవరకు పాకిస్తాన్‌తో సాధారణ పరిస్థితులు ఏర్పడడం సాధ్యం కాదని భారత్ చెబుతోంది.

షరీఫ్ ప్రసంగం తరువాత ప్రత్యుత్తర హక్కు కింద భారత్ సమాధానమిచ్చింది. ఐరాసలోని భారత మిషన్ మొదటి కార్యదర్శి మిజితో వినిటో ఈ సమాధానం ఇచ్చారు.

ఐరాస వేదికగా పాకిస్తాన్ ప్రధాని భారత్‌పై అసత్య ఆరోపణలు చేయడం విచారకరమని, పాకిస్తాన్ తన దుశ్చర్యలను కప్పిపుచ్చుకోవడానికే భారత్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తోందని మిజితో అన్నారు.

''పొరుగు దేశాలతో శాంతిని కోరుకునే ఏ దేశమూ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషించదు. భయానక ముంబయి ఉగ్రదాడులకు ప్రణాళిక రచించినవారికి ఆశ్రయం ఇవ్వదు'' అన్నారు.

Red line

షాబాజ్ షరీఫ్ ఇంకా ఏమన్నారంటే..

  • రెండు దేశాల దగ్గరా అనేక ఆయుధాలు ఉన్నప్పటికీ యుద్ధం సరైన మార్గం కాదని భారత్ అర్థం చేసుకోవాలి.
  • శాంతియుత చర్చలతోనే సమస్యలు పరిష్కారమవుతాయి. అలా చేయడం వల్ల ప్రపంచం ముందుముందు మరింత శాంతియుతంగా మారుతుంది.
  • చర్చలకు రావాలని భారత్‌ను కోరుతున్నాను.
  • 1947 నుంచి మూడు యుద్ధాలు జరిగాయి.. వాటివల్ల రెండు దేశాల్లోనూ పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలు పెరిగిపోయాయి.
  • ఫలవంతమైన చర్చలకు వీలైన వాతావరణాన్ని భారత్ కల్పించాలి.
  • భారత్, పాకిస్తాన్‌లు ఇకపై ఆయుధ కొనుగోళ్లకు, ఉద్రిక్తతలు పెంచడానికి నిధులు వెచ్చించే పరిస్థితి రాకూడదు.
  • అభివృద్ధి వేగవంతం చేయడం, లక్షలాది మందిని పేదరికం నుంచి బయటకు తేవడం ఇప్పుడు పాకిస్తాన్ తొలి ప్రాధాన్యం.
  • శతాబ్ద కాలపు వాతావరణ రికార్డులను చెరిపేస్తూ 40 రోజులుగా పాకిస్తాన్‌ను వరదలు అతలాకుతలం చేశాయి. 3.3 కోట్ల మంది ప్రజల ఆరోగ్యం ముప్పు ముంగిట ఉంది. 6.5 లక్షల మంది మహిళలు డేరాల్లోనే పిల్లలకు జన్మనిస్తున్నారు. ఇలాంటి వినాశనాన్ని పాకిస్తాన్ ముందెన్నడూ చూడలేదు.
  • వాతావరణ మార్పులకు మా ప్రజలు ఎందుకు మూల్యం చెల్లించాలి?
Red line
పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

బైడెన్, షాబాజ్ సమావేశం

ఐరాస సమావేశానికి వచ్చిన ప్రపంచ నేతలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బైడెన్, షాబాజ్ షరీఫ్‌లు సమావేశమయ్యారు.

పాకిస్తాన్ వరద బాధితులకు సహాయం చేసినందుకు బైడెన్‌కు షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ మానవతా సంక్షోభం నుంచి బయటపడేందుకు అమెరికా సహాయం కొనసాగిస్తుందని బైడెన్ చెప్పారు.

కాగా ఐరాస జనరల్ అసెంబ్లీలో షరీఫ్ ప్రసంగం తరువాత పాకిస్తాన్ సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

షరీఫ్ మద్దతుదారులు ప్రశంసలు కురిపిస్తుండగా.. ఇమ్రాన్ మద్దతుదారులు విమర్శలు గుప్పిస్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

ఇంతకుముందు ప్రధాని హోదాలో ఇమ్రాన్ ఖాన్ ఐరాసలో మాట్లాడినప్పుడు అక్కడ కుర్చీలన్నీ నిండిపోయిన చిత్రం.. ఇప్పుడు షరీఫ్ మాట్లాడుతున్నప్పుడు కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయంటూ మరో చిత్రం కలిపి పీటీఐ మహిళా నేత కన్వల్ సౌజాబ్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

ఐరాస జనరల్ అసెంబ్లీలో మొత్తం ప్రపంచం ఎదుట ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్ అంశాన్ని ఇలా లేవనెత్తారంటూ ఇమ్రాన్ గతంలో చేసిన ప్రసంగాన్ని ట్వీట్ చేశారు మరో నేత అనాస్ హఫీజ్.

కాగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ శనివారం ఐరాసలో మాట్లాడనున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)