కింగ్ చార్లెస్ 3: ఫొటోల్లో బ్రిటన్ రాజు జీవితం

కింగ్ చార్లెస్ 3 60వ పుట్టినరోజు ఫోటో కోసం పోజు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కింగ్ చార్లెస్ 3 60వ పుట్టినరోజు ఫోటో కోసం ఇలా కనిపించారు

కింగ్ చార్లెస్ 3 బ్రిటిష్ చరిత్రలోనే సుదీర్ఘ కాలం పాటు వారసుడిగా ఉన్నారు. ఆయన 70ఏళ్ల పాటు రాజ సింహాసనానికి వారసునిగా ఉన్నారు. దీంతో, బ్రిటిష్ రాజ కుటుంబంలో అతి పెద్ద వయసులో రాజు అయిన వ్యక్తిగా నిలిచారు.

కింగ్ చార్లెస్ 3 జీవితంలో కొన్ని ముఖ్యమైన క్షణాలు ఫోటోలలో..

1948లో చార్లెస్‌‌కు పేరు పెడుతున్న సమయంలో ఎలిజబెత్ రాణి 2

ఫొటో సోర్స్, Mirrorpix / Getty Images

ఫొటో క్యాప్షన్, చార్లెస్ ఫిలిప్ ఆర్థర్ జార్జ్ నవంబరు 14, 1948లో జన్మించారు. ఆయన తల్లి రాణి అయ్యేనాటికి ఆయన వయసు 3 సంవత్సరాలు
ఎలిజబెత్ రాణి II, ప్రిన్స్ ఫిలిప్

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, ఎలిజబెత్ రాణి II నావికా దళ అధికారిగా పని చేస్తున్న భర్త ప్రిన్స్ ఫిలిప్ దగ్గరకు మాల్టా వెళ్లడంతో చార్లెస్ ఏడాది వయసునుంచే తల్లి తండ్రులకు దూరంగా ఉండాల్సి రావడం మొదలయింది
క్లారెన్స్ హౌస్ గోడ పై నిల్చుని ప్రజలకు అభివాదం చేస్తున్న చార్లెస్. ఆయనను ఆయా పట్టుకుని ఉన్నారు. రాజు, రాణి, అమ్మమ్మ, ఎలిజబెత్ రాణి వెస్ట్ మిన్స్టర్ పార్లమెంట్ లో జరిగే కార్యక్రమానికి వెళుతుండగా చూస్తున్న ఫోటో.

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, తల్లి తండ్రులు దూరంగా ఉన్న సమయంలో చార్లెస్ ఆయాల చేతిలో పెరిగేవారు
1px transparent line
1957లో ఫుట్ బాల్ ఆడుతున్న చార్లెస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 8ఏళ్ల వరకు ఇంట్లోనే విద్యాభ్యాసం కొనసాగించారు. రాజకుటుంబం వారసుల్లో మొదటి సారి స్కూలు కు వెళ్లినవారిలో చార్లెస్ మొదటి వ్యక్తి
చార్లెస్‌కు అమ్మమ్మతో అనుబంధం ఎక్కువగా ఉండేది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చార్లెస్‌కు అమ్మమ్మతో అనుబంధం ఎక్కువగా ఉండేది
1px transparent line
ఎలిజబెత్ రాణి 1967, జులై 31 స్కూలు ఆఖరు రోజున చార్లెస్‌ను కలిసిన సందర్భం

ఫొటో సోర్స్, Keystone / Getty Images

ఫొటో క్యాప్షన్, చార్లెస్‌ను స్కాట్లాండ్ లోని గార్దన్ స్టన్ స్కూలుకు పంపారు. కానీ, అక్కడ తోటి విద్యార్థులు ఆయనను ఏడిపిస్తున్నారని చెబుతూ స్కూలు వదిలిపెట్టేందుకు అనుమతి ఇమ్మని ఆయన తల్లితండ్రులను కోరారు
1px transparent line
మే 1969లో కేంబ్రిడ్జ్ లో తన గదిలో చదువుకుంటున్న చార్లెస్

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, చార్లెస్ ట్రినిటీ కాలేజీ కేంబ్రిడ్జ్‌లో ఆర్కియాలజీ, ఆంత్రోపాలజీ, హిస్టరీ చదువుకున్నారు. బ్రిటిష్ రాజకుటుంబం వారసుల్లో డిగ్రీ పూర్తి చేసిన తొలి వ్యక్తి కూడా ఈయనే
చార్లెస్ కు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ బిరుదునిస్తూ కిరీటం పెడుతున్న ఎలిజబెత్ రాణి 2

ఫొటో సోర్స్, Central Press / Getty Images

ఫొటో క్యాప్షన్, జులై 1969లో సెర్నాఫన్ క్యాసిల్ లో జరిగిన కార్యక్రమంలో ఆయనకు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ బిరుదును ఇచ్చారు
1969, మే 20న కేంబ్రిడ్జ్ షైర్ లోని ఆర్ ఏ ఎఫ్ నుంచి ఎగిరే ముందు చిప్ ముంక్ ఎయిర్ క్రాఫ్ట్ కాక్ పిట్ లో ఉన్న కింగ్ చార్లెస్ 3 .

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, రాజకుటుంబ సంప్రదాయాన్ని పాటిస్తూ చార్లెస్ కూడా సైన్యంలో సేవలందించేందుకు వెళ్లారు. కింగ్ చార్లెస్ 3 డార్ట్ మౌథ్ లోని రాయల్ నావల్ కాలేజీలో చేరక ముందు ఆర్ఏఎఫ్ క్రాన్ వెల్ లో పైలట్ గా అర్హత పొందారు
డెవాన్ లోని లింప్ స్టోన్ లో 1975, జనవరి13న రాయల్ మెరైన్స్ ట్రైనింగ్ సెంటర్ లో కోర్సు పూర్తి చేసి మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.

ఫొటో సోర్స్, Central Press / Getty Images

ఫొటో క్యాప్షన్, చార్లెస్ సైన్యంలో కఠినమైన శిక్షణ తీసుకుని "యాక్షన్ మ్యాన్" అనే బిరుదును గెలుచుకున్నారు. సైన్యం కవాతులు జరిగే సమయాల్లో విమానాల నుంచి బయటకు దూకడం, సబ్ మెరైన్ల నుంచి తప్పించుకోవడం లాంటివి చేసేవారు. డ్రైవర్, కమాండోగా శిక్షణ తీసుకున్నారు
హెచ్‌ఎం‌ఎస్ బ్రోనింగ్‌టన్

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, వివిధ నావికా దళ నౌకల్లో సేవలందించిన తర్వాత రాయల్ నేవీలో మైన్ హంటర్ హెచ్‌ఎం‌ఎస్ బ్రోనింగ్‌టన్ వెసెల్ కమాండ్ తీసుకున్నారు
1px transparent line
నల్ల కళ్లద్దాలు ధరించి ఆస్టన్ మార్టిన్ స్పోర్ట్స్ కార్‌లో ఇంగ్లాండ్ పోలో గ్రౌండ్స్‌లో ఉన్న కింగ్ చార్లెస్ 3 - 1975

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చార్లెస్ కు 30 ఏళ్ళు వచ్చే నాటికి ఆయన ప్లే బాయ్ గా పేరు సంపాదించుకున్నారు
విండ్ సర్ఫింగ్ 1979

ఫొటో సోర్స్, Hulton Archive / Getty Images

ఫొటో క్యాప్షన్, ఆయన పోలో, స్విమ్మింగ్, విండ్ సర్ఫింగ్ చేస్తుండగా ఫోటోలు కనిపిస్తాయి
కింగ్ చార్లెస్ 3, కామిలా పార్కర్ బౌల్స్

ఫొటో సోర్స్, Hulton Royals Collection / Getty Images

ఫొటో క్యాప్షన్, చార్లెస్ చాలా మంది అమ్మాయిలతో సన్నిహితంగా ఉండేవారని అంటారు. కామిలా పార్కర్ బౌల్స్ తో కూడా ఆయనకు సాన్నిహిత్యం ఉండేది
ఫిజీ పర్యటనలో భాగంలో డ్యాన్స్ చేస్తున్న కింగ్ చార్లెస్ 3

ఫొటో సోర్స్, Hulton Archive / Getty Images

ఫొటో క్యాప్షన్, చార్లెస్ అనేక రాయల్ పర్యటనలు చేసి స్వచ్చంద సేవా కార్యక్రమాల్లో భాగంగా ఉండేవారు. 1976లో ప్రిన్స్ ట్రస్ట్ ప్రారంభించారు
చార్లెస్‌కు లేడీ డయానా స్పెన్సర్‌కు 1981లో నిశ్చితార్ధం జరిగింది

ఫొటో సోర్స్, Hulton Archive / Getty Images

ఫొటో క్యాప్షన్, చార్లెస్‌కు లేడీ డయానా స్పెన్సర్‌కు 1981లో నిశ్చితార్ధం జరిగింది
1px transparent line
వివాహం తర్వాత బకింగ్‌హాం ప్యాలెస్ ముందు నిల్చుని ముద్దు పెట్టుకుంటున్న వేల్స్ ప్రిన్స్, ప్రిన్సెస్

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, ఐదు నెలల తర్వాత సెయింట్ పాల్స్ క్యాథెడ్రల్ లో వారి వివాహం జరిగింది. ఈ జంటను చూసేందుకు సుమారు 600,000 మంది ప్రజలు లండన్ వీధుల్లో గుమిగూడారు
స్కాట్ లాండ్ లోని బల్మోరల్ క్యాసిల్ మైదానంలో ఫోటోకు పోజ్ ఇచ్చిన చార్లెస్, డయానా.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్కాట్లాండ్ లోని బాల్మోరల్ క్యాసిల్ మైదానంలో ఫోటోకు పోజు ఇచ్చిన చార్లెస్, డయానా.
ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీలతో చార్లెస్, డయానా - రాయల్ యాట్ బ్రిటానియా డెక్ పై నుంచి - మే 05, 1985

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా చార్లెస్, డయానా మధ్య వైవాహిక బంధంలో సమస్యలుండేవి. 1996 జులైలో చార్లెస్, డయానా విడాకులు తీసుకున్నారు
ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీ, చార్లెస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్యారిస్ లో 1997లో జరిగిన కారు ప్రమాదంలో డయానా మరణించిన తర్వాత ఆమెకు రాజ మర్యాదలతో అంత్యక్రియలు చేయాలని చార్లెస్ పట్టుబట్టారు
ప్రిన్స్ విలియం, కింగ్ చార్లెస్ 3, ప్రిన్స్ హ్యారీ, - 2000.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డయానా మరణంతో రాజ కుటుంబం తమ ప్రతిష్ట గురించి పునరాలోచించుకోవాల్సి వచ్చింది. చార్లెస్ ఈ మార్పులకు వేగంగా స్పందించారు. ఆయన పిల్లల బాధ్యతలను చూసుకునే తండ్రిగా కనిపించారు
డయానా మరణం తర్వాత ప్రజల్లో తనకొక కొత్త ప్రతిష్టను కల్పించుకోవడానికి చార్లెస్ ప్రయత్నించారు.

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, డయానా మరణం తర్వాత ప్రజల్లో తనకొక కొత్త ప్రతిష్టను కల్పించుకోవడానికి చార్లెస్ ప్రయత్నించారు
పందుల పెంపకందారుతో కింగ్ చార్లెస్ 3

ఫొటో సోర్స్, Tim Graham Photo Library via Getty Images

ఫొటో క్యాప్షన్, కింగ్ చార్లెస్ 3 చాలా అంశాల పై బహిరంగంగా అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సేంద్రియ వ్యవసాయం, ప్రత్యామ్నాయ ఔషధాలకు మద్దతు ఇస్తూ, జన్యుపరంగా రూపాంతరం చెందించే పంటల పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేశారు
పౌండ్‌బరీ గ్రామంలో కింగ్ చార్లెస్ 3

ఫొటో సోర్స్, Shutterstock

ఫొటో క్యాప్షన్, డోర్సెట్‌లో పౌండ్‌బరీ గ్రామంలో ఆయన ఊహకనుగుణంగా నగర ప్రణాళిక రూపొందింది. ఆయన ఆధునిక నిర్మాణ శైలిని విమర్శిస్తారు
క్వీన్ మథర్శవపేటిక పక్కన నిల్చున్న చార్లెస్.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2002లో చార్లెస్ అమ్మమ్మ క్వీన్ మథర్ మరణించినప్పుడు ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె 101 ఏళ్లకు మరణించారు
1px transparent line
చార్లెస్ కామిలాతో తన సంబంధాలను కొనసాగిస్తూ వచ్చారు. వీరిద్దరూ 1970లో మొదటిసారి కలిశారు. వీరి నిశ్చితార్దాన్ని 2005లో ప్రకటించారు.

ఫొటో సోర్స్, Wireimage / Getty Images

ఫొటో క్యాప్షన్, చార్లెస్ కామిలాతో తన సంబంధాలను కొనసాగిస్తూ వచ్చారు. వీరిద్దరూ 1970లో మొదటిసారి కలిశారు. వీరి నిశ్చితార్దాన్ని 2005లో ప్రకటించారు
విండ్సర్ కాసిల్‌లో కింగ్ చార్లెస్ 3, క్వీన్ కన్సోర్ట్ కామిలా పార్కర్ బౌల్స్, ప్రిన్స్ హ్యారీ, ప్రిన్స్ విలియం, టామ్, లారా పార్కర్ బౌల్స్, డ్యూక్ ఆఫ్ ఎడిన్ బరా , క్వీన్ ఎలిజబెత్ 2, మేజర్ బ్రూస్ షాన్డ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాజకుటుంబంలో బహిరంగ వేడుకగా పెళ్లి చేసుకున్న వారిలో కూడా చార్లెస్ మొదటివారు. పార్కర్ బౌల్స్ కార్న్ వాల్ డచెస్ అయ్యారు. చార్లెస్ రాజుగా అయిన తర్వాత ఆమె క్వీన్ కన్సోర్ట్ గా మారారు
2011లో ఆయన పెద్ద కొడుకు ప్రిన్స్ విలియం వెస్ట్ మిన్స్టర్ అబే లో కేట్ మిడిల్ టన్ ను పెళ్లి చేసుకున్నారు.

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, 2011లో చార్లెస్ పెద్ద కొడుకు ప్రిన్స్ విలియం వెస్ట్ మినిస్టర్ అబే లో కేట్ మిడిల్ టన్ ను పెళ్లి చేసుకున్నారు.
కింగ్ చార్లెస్ 3, కేంబ్రిడ్జ్ డచెస్, ప్రిన్సెస్ షార్లోట్, ప్రిన్స్ జార్జ్, ప్రిన్స్ విలియం, డ్యూక్ ఆఫ్ కేంబ్రిడ్జ్, ప్రిన్స్ హ్యారీ, క్వీన్ ఎలిజబెత్ 2, ప్రిన్స్ ఫిలిప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చార్లెస్ మనవడు ప్రిన్స్ జార్జ్ 2013లో, మనవరాలు ప్రిన్సెస్ చార్లెట్ 2015లో పుట్టారు
2018లో ప్రిన్స్ హ్యారీ పెళ్లి సమయంలో మేఘన్ మెర్కెల్ ను వివాహ వేదిక దగ్గరకు తోడ్కొని వెళ్లిన చార్లెస్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, 2018లో ప్రిన్స్ హ్యారీ పెళ్లి సమయంలో మేఘన్ మెర్కెల్ ను వివాహ వేదిక దగ్గరకు తోడ్కొని వెళ్లిన చార్లెస్
1px transparent line
2021లో తండ్రి ప్రిన్స్ ఫిలిప్ మరణ సమయంలో దిగులుగా కనిపించిన చార్లెస్

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, 2021లో తండ్రి ప్రిన్స్ ఫిలిప్ మరణ సమయంలో దిగులుగా చార్లెస్
1px transparent line
కింగ్ చార్లెస్ 3, క్వీన్ కన్సోర్ట్, ప్రిన్స్ హ్యారీ, మేఘం మెర్కెల్ - 2018లో కింగ్ చార్లెస్ 70వ పుట్టినరోజు వేడుకల్లో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాజకుటుంబం పట్ల ప్రజల విశ్వాసాలు మారుతున్న సమయంలో చార్లెస్ రాజు అయ్యారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)