టోంగా, ఫిజీ, న్యూజీలాండ్: సముద్రంలో భారీ అగ్నిపర్వత విస్పోటం.. పలు దేశాలకు సునామీ హెచ్చరిక

అగ్నిపర్వతం

ఫొటో సోర్స్, NOAA

ఫొటో క్యాప్షన్, టోంగా‌లో నీటి అడుగున ఉన్న అగ్నిపర్వతం హుంగా టోంగా-హుంగా హాపై హింసాత్మకంగా విస్పోటనం చెందింది

సముద్రం అడుగున భారీ అగ్ని పర్వతం విస్పోటం చెందడంతో టోంగా, ఫిజీ, న్యూజీలాండ్ సహా పలుదేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

టోంగాలోని చర్చిని, అనేక ఇళ్లను అలలు ముంచెత్తినట్లు సామాజిక మాధ్యమాల్లో షేర్ అవుతున్న వీడియోల వల్ల తెలుస్తోంది.

రాజధాని నుకులోఫాపై బూడిద ఆవరించిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా అక్కడి స్థానికులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

'హుంగా టోంగా-హుంగా హాపై' అగ్నిపర్వత శ్రేణి పేలుళ్లలో ఇది తాజా విస్పోటం.

8 నిమిషాల పాటు సంభవించిన ఈ పేలుడు భీభత్సంగా ఉందని... దీనికి 800 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న ఫిజీలో 'పెద్ద ఉరుముల్లాంటి శబ్దాలు' వినిపించాయని రాజధాని సువాలోని అధికారులు చెప్పారు.

అగ్నిపర్వతం బద్దలవడం వల్ల వెలువడిన వాయువులు, పొగ, బూడిద... ఆకాశంలో 20 కి.మీ. ఎత్తు వరకు విస్తరించాయని టోంగా జియోలాజికల్ సర్వీసెస్ చెప్పింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

'హుంగా టోంగా-హుంగా హాపై' అగ్ని పర్వత శ్రేణికి ఉత్తరాన 65 కి.మీ దూరంలోనే టోంగా రాజధాని 'నుకులోఫా' ఉంటుంది. అక్కడ 1.2 మీ. ఎత్తున్న సునామీ అలలు కనిపించాయని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ పేర్కొంది.

అగ్నిపర్వతం బద్ధలైన ప్రాంతానికి 2,300 కి.మీ పైగా దూరంలో ఉన్న న్యూజీలాండ్‌లో తుపాను వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

''దేశంలోని కొన్ని ప్రాంతాల్లో బలమైన, అసాధారణమైన వరదలు, తీర ప్రాంతాల్లో అనూహ్యమైన ఉప్పెనలు వచ్చే అవకాశముందని'' నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ తెలిపింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

''ఆశ్చర్యకర రీతిలో శక్తి విడుదల అయింది. న్యూజీలాండ్ వ్యాప్తంగా ప్రజలు అత్యంత శక్తిమంతమైన పేలుడు ధ్వనులు విన్నట్లు చెబుతున్నారు'' అని స్థానిక వాతావరణ కేంద్రం 'వెదర్ వాచ్' ట్వీట్ చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)