ఆంగ్ సాన్ సూచీకి నాలుగేళ్ల జైలు శిక్ష

ఆంగ్ సాన్ సూచీ Aung San Suu Kyi

ఫొటో సోర్స్, Getty Images

మియన్మార్ నేత ఆంగ్ సాన్ సూచీకి నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది అక్కడి కోర్టు

ప్రకృతి వైపరీత్యాల చట్టం ఉల్లంఘన, ప్రేరేపణ వంటి ఆరోపణలలో దోషిగా తేల్చి ఆమెకు ఈ శిక్ష విధించారు.

సూచీపై మొత్తం 11 అభియొగాలు ఉన్నాయి. అన్నిటిలో దోషిగా తేలితే మియన్మార్ చట్టాల ప్రకారం గరిష్ఠంగా వందేళ్ల శిక్ష కూడా పడొచ్చు.

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని నడుపుతున్న 76 ఏళ్ల సూచీ ఫిబ్రవరి నెలలో సైనిక తిరుగుబాటుతో పదవి కోల్పోయారు.

ఆంగ్ సాన్ సూచీ Aung San Suu Kyi

ఫొటో సోర్స్, Getty Images

ఆంగ్ సాన్ సూచీ మీద సైనిక పాలకులు వలస పాలన కాలం నాటి అధికారిక రహస్యాల చట్టం ఉల్లంఘన అభియోగాన్నినమోదు చేశారు.

ఇప్పటి వరకు ఆమె పై నమోదు చేసిన అభియోగాల్లో అదే అత్యంత తీవ్రమైనది.

మియన్మార్‌లో సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఆమెను ఫిబ్రవరి 1న అరెస్టు చేశారు.

గత సంవత్సరం మియన్మార్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆమె అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణతో ఆమెను పదవి నుంచి తప్పించి నిర్బంధంలోకి తీసుకున్నారు.

తిరుగుబాటు జరిగిన నాటి నుంచి మియన్మార్‌లో నిరసనలు చోటు చేసుకోగా వాటిని సైన్యం హింసాత్మకంగా అణచివేసింది.

ఆ నిరసనల్లో 500 మందికి పైగా మరణించారు. అందులో 40 మంది పిల్లలు కూడా ఉన్నారు.

ఆంగ్ సాన్ సూచీ Aung San Suu Kyi

ఫొటో సోర్స్, Reuters

సూచీపై అభియోగాలేమిటి?

సూచీతో పాటు పదవీచ్యుతులైన మరో ముగ్గురు క్యాబినెట్ మంత్రులు, నిర్బంధంలో ఉన్న ఆస్ట్రేలియాకు చెందిన ఆర్థిక సలహాదారు సీన్ టర్నెల్‌పైనా అధికార రహస్యాల చట్ట ఉల్లంఘన అభియోగాలు నమోదు చేశారు.

సూచీ 6,00,000 డాలర్ల సొమ్మును నగదు రూపంలో తీసుకోవడంతో పాటు 11 కేజీల బంగారాన్నీ తీసుకుని అవినీతికి పాల్పడినట్లు అంతకుముందే అభియోగాలు నమోదు చేశారు.

వాటితో పాటు విపత్తుల చట్టాన్ని కూడా ఉల్లంఘించి చట్ట వ్యతిరేకంగా వాకీ టాకీలను తీసుకున్నారన్నది మరో అభియోగం.

ఈ కేసులోనే ప్రస్తుతం నాలుగేళ్ల జైలు శిక్ష పడింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)