అఫ్గానిస్తాన్: షియాల మసీదుపై ఆత్మాహుతి బాంబు దాడి... 37 మంది మృతి

అఫ్గానిస్తాన్‌లోని ఒక షియా మసీదుపై శుక్రవారం నాటి ప్రార్థనల సమయంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 37 మంది మరణించారు. మరో 70 మంది గాయపడ్డారు.
కాందహార్‌లోని ఇమాన్ బార్గా మసీదులో మూడు బాంబు పేలుడులు సంభవించాయి. విరిగిపోయిన కిటికీలు, చెల్లాచెదురుగా ఉన్న మృతదేహాలున్న ఫొటోలు షేర్ అవుతున్నాయి.
పేలుడుకి ఎవరు బాధ్యులన్నది ఇంతవరకూ తెలియలేదు.
పేలుడు తీవ్రతకు గాయపడినవారికి మీర్ వాయిస్ ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక వైద్యుడొకరు బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఐఎస్ తీవ్రవాద సంస్థకు అఫ్గానిస్తాన్ శాఖగా పనిచేస్తున్న ఐఎస్-కే సంస్థ ఈ బాంబుదాడి వెనుక ఉన్నట్లు భావిస్తున్నారని బీబీసీ అఫ్గానిస్తాన్ ప్రతినిధి సయ్యద్ కిర్మానీ తెలిపారు.
గత శుక్రవారం కుందుజ్ నగరంలోని షియా మసీదుపై జరిగిన బాంబు దాడిలో 50 మందికిపైగా మరణించారు.
అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సేనలు వైదొలగిన తరువాత జరిగిన ఆ అతిపెద్ద దాడికి తామే కారణమని ఐఎస్-కే ప్రకటించుకుంది.
తాలిబాన్లు ప్రభుత్వం ఏర్పాటుచేయడాన్ని వ్యతిరేకిస్తున్న ఐఎస్-కే అఫ్గానిస్తాన్‌లో అనేక దాడులకు పాల్పడింది.
అత్యంత హింసాత్మక సంస్థ ఐఎస్-కే
అఫ్గానిస్తాన్‌లోని అన్ని జిహాదిస్ట్ గ్రూపుల కంటే ఐఎస్-కే అత్యంత హింసాత్మకమైనది. ఇది సున్నీ ముస్లిం గ్రూప్.
షియా ముస్లింలను తీవ్రంగా వ్యతిరేకించే వీరు వారిని లక్ష్యంగా చేసుకుంటారు.
అఫ్గానిస్తాన్ రాజకీయ నాయకులు, భద్రతా దళాలు, మంత్రిత్వ కార్యాలయాలను, తాలిబాన్లను, అమెరికా, నాటో సేనలను, అంతర్జాతీయ సహాయ సంస్థలను, షియా మైనారిటీలు, సిక్ మైనారిటీలను కూడా వీరు లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు.
ఇవి కూడా చదవండి:
- మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతి.. అనారోగ్యంతో మరణించారని ప్రకటించిన పార్టీ
- కేజీ బేసిన్లో గ్యాస్ ఉన్నా ఆంధ్రప్రదేశ్‌లో గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ఎందుకు జరగడం లేదు
- ‘వ్యాక్సీన్ వేసుకోను అన్నందుకు నా ఉద్యోగం తీసేశారు’
- అఫ్గానిస్తాన్: సేనల ఉపసంహరణ తర్వాత తొలిసారి తాలిబాన్లతో అమెరికా చర్చలు
- చైనా ముప్పును ఎదుర్కోడానికి భారత వాయు సేన సన్నద్ధంగా ఉందా?
- భారత్-పాక్ యుద్ధం 1971: చెరువులో నీటి అడుగున దాక్కొని ప్రాణాలు కాపాడుకున్న భారత సైనికుడి కథ
- మలేరియాపై పోరాటంలో చరిత్రాత్మక ముందడుగు.. వ్యాక్సినేషన్‌కు అనుమతి
- టీటీడీ బోర్డును జగన్ తన 'సంపన్న మిత్రుల క్లబ్'గా మార్చేశారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








