పాబ్లో పికాసో: తొమ్మిది సంవత్సరాల తర్వాత ఏథెన్స్‌లో దొరికిన పికాసో పెయింటింగ్

ఫొటో సోర్స్, NATIONAL ART GALLERY
చోరీకి గురైన పాబ్లో పికాసో పెయింటింగ్ ఒకటి ఇప్పుడు ఏథెన్స్‌లో దొరికింది.
ఈ పెయింటింగ్ గ్రీక్ గ్యాలరీ నుంచి తొమ్మిది సంవత్సరాల క్రితం చోరీకి గురైంది.
పికాసో వేసిన 'మహిళ తల' పెయింటింగ్‌తో పాటు పీట్ మాండ్రియన్ అనే డచ్ ఆర్టిస్ట్ 1905లో వేసిన మరో పెయింటింగ్ కూడా దొరికిందని ఏథెన్స్ పోలీసులు చెప్పారు.
2012లో ఏథెన్స్ నేషనల్ గ్యాలరీ నుంచి ఈ రెండు పెయింటింగ్‌లతో పాటు మరొకదాన్ని దొంగిలించారు.
నగర శివార్లలోని ఇరుకైన ఒక లోయ దగ్గర దాచిపెట్టిన ఈ పెయింటింగ్‌లను స్వాధీనం చేసుకున్న తర్వాత ఒక గ్రీక్ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారంటూ పోలీసులను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ చెప్పింది.
ఈ కళాఖండం తమ దేశంలోనే ఉంటుందని భావిస్తున్నట్లు గ్రీక్ పోలీసులు చెప్పిన కొన్ని నెలల్లోనే, వాళ్లు దాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఓ గుహలో దొరికిన 44 వేల ఏళ్ళ నాటి అతి పురాతన పెయింటింగ్ ఏం చెబుతోంది...
- ఈఫిల్ టవర్ వద్ద మానవాళి ఐక్యతను చాటుతూ భారీ పెయింటింగ్
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- ‘రాబిన్ హుడ్’ హ్యాకర్లు: దోచుకున్న సొమ్మును దానం చేస్తున్నారు.. ఎందుకు?
- ‘మోడలింగ్ జాబ్ ఉందంటే వెళ్లా... అది గ్యాంగ్ రేప్ కోసం పన్నిన ఉచ్చు అని అర్థమైంది’
- కరోనావైరస్ సెకండ్ వేవ్ భారత్‌లో బలహీన పడుతోందా... కేసులు నిజంగానే తగ్గుతున్నాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





