వోగ్ పత్రిక ముఖచిత్రంగా మలాలా: 'ఒక అమ్మాయికి విజన్ ఉంటే ఆమె హృదయం ఎంత శక్తిమంతం అవుతుందో నాకు తెలుసు'

జూలై సంచిక కవర్ పేజీ పై మలాలా

ఫొటో సోర్స్, Nick Knight/British Vogue

ఫొటో క్యాప్షన్, జులై సంచిక కవర్ పేజీ పై మలాలా

యూనివర్సిటీకి వెళ్లడం వల్ల మెక్ డొనాల్డ్స్‌లో తినడం, పోకర్ ఆడటంతో పాటు తన కోసం తనకు కాస్త సమయం దొరికిందని మలాలా యూసుఫ్‌జాయ్ చెప్పారు.

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత 23 ఏళ్ల మలాలా బ్రిటిష్ వోగ్ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆమె ఫోటోను పత్రిక జులై సంచిక కవర్ పేజీ పై ప్రచురిస్తున్నారు.

మలాలా గత సంవత్సరం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా తీసుకున్నారు.

"స్నేహితులతో కలిసి మెక్ డొనాల్డ్స్ కి వెళ్లడం నుంచి పోకర్ ఆడటం వరకు ప్రతీ విషయంలోనూ నేను చాలా ఉత్తేజితురాలినయ్యాను. నేనిదంతా గతంలో చూడకపోవడం వల్ల ప్రతీ క్షణాన్ని ఆనందిస్తూ గడిపాను" అని ఆమె చెప్పారు.

నా వయసులో ఉన్న వారితో నేనంతకు ముందెప్పుడూ గడపలేదు అని చెప్పారు.

ఆమె 14 ఏళ్ల వయసులోనే స్వదేశమైన పాకిస్తాన్‌లో అమ్మాయిలకు విద్య అవసరమని పోరాడుతుండగా, తాలిబన్ మిలిటంట్లు ఆమె పై కాల్పులు జరిపారు.

వోగ్ ఫోటో షూట్‌లో తలకు స్కార్ఫ్ ధరించిన మలాలా

ఫొటో సోర్స్, Nick Knight/British Vogue

ఫొటో క్యాప్షన్, వోగ్ ఫోటో షూట్‌లో తలకు స్కార్ఫ్ ధరించిన మలాలా

"నేను ఆ సంఘటన నుంచి కోలుకుంటూ ఉండటం వల్ల, ప్రపంచంలో పలు దేశాలకు తిరుగుతూ ఉండటం వల్ల, పుస్తకం ప్రచురణ చేస్తూ, ఒక డాక్యుమెంటరీ చేస్తుండటం వల్ల నా తోటి వారితో ఎప్పుడూ గడపలేదు. నా జీవితంలో మరెన్నో విషయాలు జరుగుతున్నాయి. యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు మాత్రం నా కోసం నాకు కాస్త సమయం దొరికింది" అని అన్నారు.

ఎర్రని హెడ్ స్కార్ఫ్ ధరించిన యూసఫ్ జాయ్ ఆ స్కార్ఫ్ అణచివేతకు సంకేతం కాదని అన్నారు

తలకు చుట్టుకున్న స్కార్ఫ్ ఆమె సున్నీ ముస్లిం కి చెందిన పష్టున్ మూలాలకు ప్రాతినిధ్యం వహిస్తుందని అన్నారు.

"ముస్లిం అమ్మాయిలు కానీ, పాకిస్తాన్ అమ్మాయిలు కానీ సంప్రదాయ దుస్తులు ధరించినప్పుడు వారు అణిచివేతకు గురైనట్లుగా, మాట్లాడే స్వేచ్ఛ లేనట్లుగా, లేదా పితృస్వామ్యం నీడలో బ్రతుకుతున్నట్లుగా చాలా మంది భావిస్తారు" అని ఆమె అన్నారు.

"మీ సంస్కృతిని పాటిస్తూనే మీ గొంతును వినిపించవచ్చు. అలాగే, మీ సంస్కృతిలో ఉన్న సమానత్వాన్ని కూడా అనుభవించవచ్చని అందరికీ చెప్పాలని అనుకుంటున్నాను" అని అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఆమె సోషల్ మీడియాలో జరిగే ఉద్యమ ప్రచారాలను కూడా విమర్శించారు. ఈ విధానం మారాలని అన్నారు.

"మనం ఉద్యమాలను ట్వీట్‌లతో అనుసంధించాం. అది మారాలి. ట్విటర్ పూర్తిగా మరో ప్రపంచం" అని ఆమె వోగ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

సలహాల కోసంగ్రెటా నాకు సందేశాలు పంపుతుంటారు

మలాలాకు ఇతర ఉద్యమకారులతో ఉన్న స్నేహం గురించి చెబుతూ గ్రెటా సలహాల కోసం తనను సంప్రదిస్తూ ఉంటుంటారని చెప్పారు.

"ఒక చిన్న అమ్మాయికి విజన్, మిషన్ ఉంటే ఆమె హృదయంలో ఎలాంటి శక్తి ఉంటుందో నాకు తెలుసు" అని అన్నారు.

గ్రెటా - మలాలా

ఫొటో సోర్స్, @malala

ఫొటో క్యాప్షన్, మలాలా పర్యావరణ ఉద్యమకర్త గ్రెటాను ఆక్స్‌ఫర్డ్‌లో కలిశారు.

మలాలా బాలికల సార్వత్రిక విద్య కోసం చేసిన ఉద్యమానికి గాను, 2014లో నోబెల్ బహుమతి అందుకున్నారు. ఇప్పటి వరకు నోబెల్ శాంతి బహుమతి అందుకున్న అతిపిన్న వయస్కురాలు మలాలా.

నోబెల్ బహుమతిని సంపాదించేందుకు పుస్తకాన్ని రాయలేదని ఆక్స్ ఫర్డ్ కి రాసిన వ్యక్తిగత ప్రకటనలో తెలిపారు. అలా రాస్తున్నప్పుడు నాకు ఇబ్బందిగా అనిపించింది" అని అన్నారు. .

ఆమె ఫిలాసఫి, పాలిటిక్స్, ఎకనామిక్స్ లో డిగ్రీ చేశారు. ఆమె ప్రతీ వారం వ్యాసాలు రాసేందుకు రాత్రంతా మెలకువగా ఉండేదానినని చెప్పారు.

"అర్ధరాత్రి 2 గంటలకు కూర్చుని ఈ వ్యాసాలెందుకు రాస్తున్నాను? నేనెందుకు ఏమీ చదవలేదు అని నా మీద నాకే కోపంగా ఉండేది. నాకు కేవలం విద్యార్ధిగానే ఉండాలనిపించేది" అని చెప్పారు.

ఆమెకున్న ప్రతిష్ట ఆమె స్కూల్ విద్య పై ప్రభావం చూపించిందని చెప్పారు. ఆమె పాకిస్తాన్ నుంచి వచ్చిన తర్వాత బర్మింగ్‌హాం లో చదివారు.

" స్కూల్లో తోటి విద్యార్థులు ఎమ్మా వాట్‌సన్‌ని, ఏంజెలినా జోలీని, ఒబామాను కలిసినప్పుడు నీకెలా అనిపించేది. లాంటి ప్రశ్నలను అడుగుతూ ఉండేవారు. వాటికి ఏమి సమాధానం చెప్పాలో నాకర్ధమయ్యేది కాదు" అని అన్నారు.

"చాలా ఇబ్బందిగా ఉండేది. ఆ మలాలాను స్కూలు బయటే వదిలి రావాలనిపించేది. నాకు కేవలం ఒక విద్యార్థిగా, ఒక స్నేహితురాలిగా ఉండాలనిపించేది" అని అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

యూసుఫ్‌జాయ్ ప్రస్తుతం బర్మింగ్‌హామ్‌లో తన తల్లితండ్రులతో కలిసి ఉంటున్నారు. పాకిస్తాన్‌లో ఆమెపై హత్యాయత్నం జరిగిన తరువాత ఆమె కుటుంబం బ్రిటన్‌కు వెళ్లింది.

భవిష్యత్తు ప్రణాళికల విషయంలో తనకు స్పష్టత లేదని ఆమె చెప్పారు. "భవిష్యత్తులో నేను ఎక్కడ ఉంటాను? యూకేలోనే ఉంటానా? లేదా పాకిస్తాన్‌కి వెళతానా? లేదా మరో దేశంలో ఉంటానా అని నాకు నేనే ప్రశ్నించుకుంటాను" అని చెప్పారు.

పాకిస్తాన్ నుంచి పెళ్లి సంబంధాల ప్రతిపాదనలు కూడా తన తండ్రికి పంపిస్తూ ఉంటారని ఆమె చెప్పారు.

"ఆ అబ్బాయిలు తమకు చాలా ఎకరాల భూమి ఉందని, చాలా ఇళ్ళు ఉన్నాయని, నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామని ఆ ఉత్తరాల్లో రాస్తారు" అని చెప్పారు.

ఆమె పూర్తి ఇంటర్వ్యూ బ్రిటిష్ వోగ్ జులై సంచికలో వస్తుంది. ఈ శుక్రవారం నుంచి ఆన్ లైన్‌లో సంచికను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)