కోవిడ్: కష్టకాలంలో భారత్‌కు సాయం చేస్తామన్న పాకిస్తాన్.. వెంటిలేటర్లు, ఇతర పరికరాలు పంపిస్తామని ట్వీట్: Newsreel

ఫొటో సోర్స్, Reuters
కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న భారత్‌కు సాయం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు పాకిస్తాన్ చెప్పింది.
భారత్‌లో గత మూడు రోజులుగా ప్రపంచంలోనే అత్యధిక రోజువారీ కరోనా కేసులు నమోదయ్యాయి.
కరోనా మహమ్మారితో తీవ్రంగా ప్రభావితం అవుతున్న భారత్‌కు అత్యవసర మెడికల్ పరికరాలను అందించాలని భావిస్తున్నట్లు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన జారీ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
"కరోనా సంక్షోభ సమయంలో భారత్‌కు వెంటిలేటర్లు, బై పాప్ మెషిన్లు, డిజిటల్ ఎక్స్ రే మెషిన్లు, పీపీఈ కిట్లు, ఇతర అత్యవసర మెడికల్ పరికరాలు అందిస్తాం. మేం 'హ్యుమానిటీ ఫస్ట్' అనే విధానాన్ని విశ్వసిస్తున్నాం" అని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ తన అధికారిక ట్విటర్ హ్యాండిల్లో ఒక పోస్ట్ చేశారు.
ఈ పరికరాలు వీలైనంత త్వరగా భారత్ చేరుకోవడానికి, ఇరు దేశాలకు చెందిన సంబంధిత అధికారులు కలిసి పనిచేయాలని పాకిస్తాన్ తన ప్రకటనలో కోరింది.
"మహమ్మారి వల్ల ముందు ముందు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి రెండు దేశాలూ తగిన విధానాలను కూడా అన్వేషించవచ్చు" అని కూడా పాక్ అందులో పేర్కొంది.
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కూడా కరోనా సంక్షోభ సమయంలో భారత ప్రజలకు తన సంఘీభావం తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
"పొరుగు దేశంలో, ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతక కోవిడ్-19 వైరస్‌తో పోరాడుతున్న ప్రజలు వీలైనంత త్వరగా కోలుకోవాలని పాకిస్తాన్ ప్రార్థిస్తోంది" అని అన్నారు.
"మానవాళి ఎదుర్కొంటున్న ఈ సవాల్‌తో మనమంతా కలిసి పోరాడాలని" ఆయన పిలుపునిచ్చారు.
పాకిస్తాన్‌కు చెందిన చాలా మంది ప్రజలు కూడా భారత్‌కు సాయం అందించడానికి ముందుకొస్తున్నారు.
దిల్లీలో లాక్‌డౌన్ మరో వారం పొడిగింపు

ఫొటో సోర్స్, EPA
కరోనా కేసులు పెరుగుతుండడంతో దిల్లీలో లాక్‌డౌన్‌ను మరోవారం పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
దిల్లీ ప్రభుత్వం మొదట ఆరు రోజులు లాక్‌డౌన్ విధించింది.
అది ఏప్రిల్ 26న ముగుస్తుంది. దానిని ఇప్పుడు మరో వారం పొడిగించారు. అంటే లాక్‌డౌన్ ఇప్పుడు మే 3 వరకూ ఉండబోతోంది.
దిల్లీలో కరోనా కేసులు వేగంగా పెరుగుతుండడంతో ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో లాక్‌డౌన్ పొడిగించాల్సి వచ్చిందని కేజ్రీవాల్ చెప్పారు.
"ఇది ఆఖరి ఆయుధం. దానిని మేం ఉపయోగించాలని అనుకోలేదు. కానీ ఇప్పుడు మేం లాక్‌డౌన్ పొడిగించాల్సి వస్తోంది" అన్నారు.
"దిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు 36-37 శాతానికి చేరుకుంది. దిల్లీలో అది ఈ స్థాయిలో ఎప్పుడూ లేదు. ఒక్కరోజులో అది 30 శాతానికి తగ్గింది. కానీ కరోనా అంతం కాబోతోందని మనం చెప్పలేం" అని కేజ్రీవాల్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: సెకండ్ వేవ్‌లో పిల్లలు, యువతకు ఎక్కువగా వైరస్ సోకుతోందా?
- బెల్లం: ఆహారమా... ఔషధమా?
- తెలంగాణ: పదో తరగతి పరీక్షలు రద్దు.. ఇంటర్ సెకండియర్ పరీక్షలు వాయిదా
- దీర్ఘకాలిక కోవిడ్: ‘రిపోర్టులన్నీ నార్మల్‌గానే వచ్చాయి. కానీ అడుగేస్తే నరకం కనిపించేది’
- స్పుత్నిక్ V: రష్యా వ్యాక్సీన్‌కు భారత్ అనుమతి.. ఈ టీకా గురించి తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..
- కరోనావైరస్ సెకండ్ వేవ్: 'గత ఏడాది లాక్డౌన్ వల్ల అడుక్కోవాల్సి వచ్చింది... మళ్లీ విధిస్తారా'
- కరోనా వ్యాక్సీన్ : అన్ని ముస్లిం దేశాలు టీకా తీసుకుంటాయా ? హలాల్, హరామ్ చర్చ ఎందుకు మొదలైంది ? బీబీసీ ఫ్యాక్ట్ చెక్
- కరోనావైరస్: మాస్క్ వేసుకోలేదని ఓ వ్యక్తిని రోడ్డు మీద పడేసి తీవ్రంగా కొట్టిన పోలీసులు... వైరల్ అయిన వీడియో
- న్యూజీలాండ్ ప్రభుత్వం 'తల్లుల' కోసం చేసిన చట్టంపై చర్చ ఎందుకు... భారత్‌లో పరిస్థితి ఏంటి?
- టీకా ఉత్సవ్: విశాఖ జిల్లాలో వ్యాక్సీన్ల కోసం 14వేల మంది వస్తే.. 580 మందికి మాత్రమే ఇచ్చారు.. భారత్‌లో టీకాల కొరతకు కారణమేంటి..
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?








