రియా చక్రవర్తిపై బిహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే వ్యాఖ్యలపై దుమారం

ఫొటో సోర్స్, Riya Chakraborty
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత బిహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే రియా చక్రవర్తిపై చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి.
ఈ కేసును సీబీఐకి అప్పగించడంతోపాటు, ఈ మేరకు బీహార్ ప్రభుత్వం చేసిన సిఫార్సు కూడా సరైనదేనని సుప్రీంకోర్టు పేర్కొంది. పట్నాలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో ఎలాంటి తప్పులులేవని కోర్టు తెలిపింది.
అయితే, ఈ సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత రియా చక్రవర్తిపై డీజీపీ గుప్తేశ్వర్ పాండే వ్యాఖ్యలు చేశారు. బిహార్ పోలీసుల మీద, ఇక్కడి రాజకీయాలపైనా రియా చక్రవర్తి కామెంట్లపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు పాండే సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మీదా, డీజీపీ మీదా కామెంట్ చేసే స్థాయి రియా చక్రవర్తికి లేదని ఆయన అన్నారు. బిహార్ పోలీసుల తీరుపై సందేహాలు వ్యక్తం చేస్తూ రియా చక్రవర్తి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఫొటో సోర్స్, Gupteshwar Pandey Twitter
బీహార్ పోలీసులు అంతా సవ్యంగానే కేసును విచారణ జరిపారని ఆయన అన్నారు. సుప్రీం కోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించడంపై డీజీపీ సంతోషం వ్యక్తం చేశారు.
జూన్ 14న అనుమానాస్పద స్థితిలో మరణించిన బాలీవుడ్ నటుడు బిహార్ రాష్ట్రానికి చెందినవారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ముంబయి పోలీసులు చెప్పారు. అయితే, ఆయన మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సుశాంత్ సింగ్ తండ్రి కె.కె.సింగ్ పట్నాలో కేసు పెట్టారు. రియా చక్రవర్తి, మరికొందరి వల్లనే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని కె.కె.సింగ్ ఆరోపించారు.

ఫొటో సోర్స్, Getty Images
సీబీఐకి అప్పగింతపై సీఎం నీతీశ్ కుమార్ సంతోషం
అయితే ముంబయి పోలీసులు కేసు దర్యాప్తుకు సహకరించలేదని బిహార్ పోలీసులు ఆరోపించారు. మరోవైపు ఇదే సమయంలో రియా చక్రవర్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇటు బిహార్ ప్రభుత్వం కూడా సీబీఐ దర్యాప్తు చేయడం మంచిదని సూచించింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకు సమ్మతించింది. ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా సీబీఐ విచారణకు ఆదేశించడంతో కేసు బిహార్ నుంచి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు బదిలీ అయ్యింది.
సుప్రీంకోర్టు నిర్ణయంపట్ల బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. సుశాంత్ సింగ్ కేసులో న్యాయం జరుగుతుందని తాను ఆశిస్తున్నానని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయం బిహార్ ప్రభుత్వ వైఖరిని రుజువు చేసిందని, ఈ కేసులో రాజకీయ జోక్యం లేదని కూడా స్పష్టమైందని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, InSTAGRAM
రియా చక్రవర్తి వ్యాఖ్యలపై స్పందిస్తూ “ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ సహకారంతో ఈ కేసులో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబానికి న్యాయం జరుగుతుంది” అని డీజీపీ గుప్తేశ్వర్ పాండే వ్యాఖ్యానించారు.
మరోవైపు సుశాంత్ కేసులో ముంబై పోలీసుల తీరుపై కూడా పాండే అసంతృప్తి వ్యక్తం చేశారు. తన సహచర ఐపీఎస్ అధికారి వినయ్ తివారీని అనవసరంగా క్వారంటైన్‌కు పంపడంతో తాను నోరు విప్పాల్సి వస్తోందని పాండే అన్నారు. బిహార్ పోలీసులకు అండగా నిలవాలని ప్రభుత్వం కోరడంతో తాను మాట్లాడుతున్నానని, రాజకీయ ప్రకటనలు చేయడంలేదని పాండే వ్యాఖ్యానించారు.
డీజీపీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు
అయితే బిహార్ డీజీపీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. “ మహిళలకు ఇంత అగౌరవమా? దయ చేసి ఆయనపై చర్యలు తీసుకోండి. ఒకవైపు మహిళలను గౌరవించాలని చెబుతారు. మరోవైపు వారి స్థాయిని తగ్గించి మాట్లాడతారు’’ అని సల్మాన్ అనే ట్విటర్ యూజర్ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్‌కు విజ్జప్తి చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
“మహిళల స్థాయి గురించి మాట్లాడటానికి మీరెవరు’’ అని మరో యూజర్ కామెంట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
గుప్తేశ్వర్ పాండే వ్యాఖ్యలను జర్నలిస్ట్ సంకేత్ ఉపాధ్యాయ్ కూడా తప్పుబట్టారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
అయితే బిహార్‌కు చెందిన కొందరు మాత్రం గుప్తేశ్వర్ పాండేకు అనుకూలంగా కామెంట్లు చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4

పోస్ట్ of X ముగిసింది, 5
క్షమాపణ చెబుతానన్న డీజీపీ పాండే
"బిహార్ ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేయడం సరికాదని నేను చెప్పదలుచుకున్నాను. ఉన్నత స్థానంలో ఉన్నవారి గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం మంచిదికాదు. ఒకవేళ నేను అన్నమాటలు ఆమె గౌరవానికి భంగం కలిగిస్తాయనుకుంటే క్షమాపణ చెప్పడానికి నాకు ఎలాంటి సంకోచం లేదు. కానీ స్త్రీగా మీరు ఎంత స్వేచ్ఛను కలిగి ఉన్నారో, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయనకు కూడా అంతే గౌరవం ఉంటుంది. అలాంటి వారి పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సరికాదు. మీకు ఏదైనా సమస్య ఉంటే మాతో చెప్పండి'' అని పాండే అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: భారత్‌లో గల్లంతవుతున్న కోవిడ్ మరణాలు ఎన్ని?
- ఉత్తరప్రదేశ్: రేప్‌లు, మహిళలపై నేరాలు పెరుగుతోంటే.. రామరాజ్యం అంటున్న యోగి
- భారత్‌లో కోవిడ్-19 వ్యాక్సీన్ హ్యూమన్ ట్రయల్స్ రెండు, మూడు దశలకు డీసీజీఐ అనుమతి
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- శకుంతలా దేవిని హ్యూమన్ కంప్యూటర్ అని ఎందుకు పిలుస్తారంటే..
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- కెప్టెన్‌గా ధోనీ తీసుకున్న 10 అసాధారణ నిర్ణయాలు
- కేరళ విమాన ప్రమాదంలో రియల్ హీరోలు వీళ్లే.. సెల్యూట్ చేసిన పోలీసు అధికారి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)