పాకిస్తాన్ కొత్త మ్యాప్‌లో జమ్మూకశ్మీర్, లద్దాఖ్, జునాగఢ్... ఆమోదం తెలిపిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, REUTERS/SAIYNA BASHIR/FILE PHOTO

పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మంగళవారం తమ దేశ కొత్త చిత్ర పటాన్ని అమోదించారు. ఈ కొత్త మ్యాపులో జమ్ముూ కశ్మీర్, లద్దాఖ్, జునాగఢ్ ప్రాంతాలను పాకిస్తాన్‌లో భాగంగా చూపించారు.

ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో సమావేశమైన ఫెడరల్ క్యాబినెట్ కొత్త చిత్రపటాన్ని ఆమోదించింది. క్యాబినెట్ నిర్ణయాన్ని అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష నేతలు, కశ్మీర్ నాయకులు కూడా స్వాగతించారని ఇమ్రాన్ అన్నారు.

పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా ఈ విషయాన్ని ట్వీట్ చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఆ తరువాత ప్రధాని ఇమ్రాన్ ఖాన్ టీవీలో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈరోజు పాకిస్తాన్ చరిత్రలో చాలా ముఖ్యమైన రోజు అని, ప్రపంచం ఎదుట పాకిస్తాన్ సరికొత్త చిత్ర పటాన్ని ఆవిష్కరించిన రోజు ఇదని వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

పీటీవీ న్యూస్‌ టీవీ చానల్‌లో మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, "ఈరోజు పాకిస్తాన్ దేశ సరికొత్త రాజకీయ చిత్ర పటాన్ని ప్రపంచం ముందుంచాం. ఇకపై పాకిస్తాన్‌లోని పాఠశాలలు, కళాశాలల్లో ఈ మ్యాపే ఉంటుంది." అని అన్నారు.

భారత విదేశాంగ శాఖ స్పందన

దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విడుదల చేసిన మ్యాపును చూశామని, అదొక వింత చర్యగా భావిస్తున్నామని భారత్ ప్రకటించింది.

"భారత రాష్ట్రమైన గుజరాత్‌లోని భూభాగాన్ని, కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లలోని ప్రాంతాలను తమవే అంటూ నిరాధారమైన ప్రకటనలను చేయడం రాజకీయపరమైన వింత చర్య. ఇలాంటి హాస్యాస్పదమైన ప్రకటనలకు చట్టబద్ధత కానీ, అంతర్జాతీయ గుర్తింపు కానీ ఉండవు. నిజానికి, ఈ సరికొత్త చర్య సరిహద్దు తీవ్రవాదంతో ఆక్రమణలకు పాల్పడాలనే పాకిస్తాన్ అసలు స్వభావాన్నే మరోసారి బయటపెట్టింది" అని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.

పాకిస్తాన్

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ కురేషీ

పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఏమన్నారు...

ఈ సందర్భంలోపాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ కురేషీ, "పాకిస్తాన్ పరిపాలనా పటం ఇంతకు ముందు (1949, 1976)లో కూడా ఉన్నాయి. కానీ, మూసిన గదుల్లో పాకిస్తానీలు ఇన్నాళ్లూ చెప్పుకుంటూ వచ్చిన రాజకీయ పటం ఇప్పుడు బయటకు వచ్చింది. పాకిస్తాన్ ఎక్కడ నిలిచిందో ఈ మ్యాప్ ద్వారా మొత్తం ప్రపంచానికి చెబుతున్నాం" అన్నారు.

సర్ క్రీక్, సియాచిన్ మాదేనని వాదన

"గత ఏడాది ఆగస్టులో భారత్ ఒక మ్యాప్ విడుదల చేసింది. అందులో పాక్ పాలిత కశ్మీర్, గిల్గిత్-బాల్టిస్తాన్ భారత్‌లో భాగంగా చూపించారు. భారత్ అలాంటి చర్యలకు పాల్పడడం ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తీర్మానాలకు పూర్తి విరుద్ధం" అని షా మహమూద్ ఖురేషీ అన్నారు. అదంతా వివాదిత ప్రాంతం అని పాకిస్తాన్ భావిస్తోంది. దానిని పరిష్కరించుకోవచ్చని ఆయన చెప్పారు.

"కశ్మీరీలు, పాకిస్తాన్ ప్రజలు హర్షించేలా ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తీర్మాననం ప్రకారం దీనికి పరిష్కారం లభిస్తుంది. భారత్ అలా మాట ఇచ్చింది. కశ్మీర్ భవిష్యత్తు ఏంటి అనేదానిపై ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో ఒక జనాభిప్రాయ సేకరణ జరుగుతుంది" అని ఖురేషీ చెప్పారు.

ఈ మ్యాప్ ద్వారా సియాచిన్ గ్లేసియర్, సర్ క్రీక్‌పై భారత వాదనలను కూడా పాకిస్తాన్ కొట్టిపారేసిందని ఆయన తెలిపారు. "పాకిస్తాన్ ప్రజలు నిన్నటి వరకూ కశ్మీరీలతో ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారని మా కొత్త రాజకీయ మ్యాప్ భారత్, కశ్మీర్‌కు స్పష్టమైన సందేశం ఇస్తుంది" అని ఖురేషీ అన్నారు.

ఆర్టికల్ 370 రద్దు

ఫొటో సోర్స్, LSTV

ఆర్టికల్ 370 రద్దుకు ఏడాది

భారత్ గత ఏడాది(2019) ఆగస్టు 5న భారత రాజ్యాంగంలోని సెక్షన్ 370 కింద కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసినప్పుడు ఇచ్చిన ప్రత్యేక రాష్ట్రం హోదాను రద్దు చేసింది. దాంతోపాటూ జమ్ము-కశ్మీర్ రాష్ట్రాన్ని కూడా రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసింది.

భారత్ ఈ నిర్ణయానికి ఏడాది పూర్తవడంతో పాకిస్తాన్ భారత పాలిత కశ్మీర్ ప్రజలకు తమ మద్దతు ప్రకటించడానికి ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ కొత్త మ్యాప్ జారీ చేయడం కూడా వాటిలో ఒక భాగం. మంగళవారం కొత్త మ్యాప్‌ ఆవిష్కరించిన ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్‌ సమస్యకు ఒకే ఒక పరిష్కారం ఉందని, అది ఐక్యరాజ్యసమితి తీర్మానాలను అంగీకరించడమేనని అన్నారు.

"కశ్మీరీలు పాకిస్తాన్‌తో ఉండాలా, లేక భారత్‌తో ఉండాలా అనేది వారు ఒక్క ఓటుతో నిర్ణయించే హక్కును ఐక్యరాజ్యసమితి తీర్మానo కల్పిస్తుంది. అంతర్జాతీయ సమాజం ఇచ్చిన ఆ హక్కు వారికి ఇప్పటివరకూ లభించలేద"ని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

సైనిక పరిష్కారాలపై తమకు నమ్మకం లేదని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. "కశ్మీర్ సమస్యకు రాజకీయ పరిష్కారమే సాధ్యం. ఆ దిశగా ఈ మ్యాప్ మా మొదటి అడుగు. కశ్మీరీల కోసం మా రాజకీయ పోరాటం కొనసాగుతుంది" అన్నారు.

పాకిస్తాన్ రాజ్యాంగం దీనిని అనుమతిస్తుందా

పాకిస్తాన్ విదేశాంగ శాఖకు చెందిన అధికారి హసన్ అబ్బాస్ ఈ కొత్త మ్యాప్‌ గురించి వివరిస్తూ "ఇమ్రాన్ ఖాన్ జారీ చేసిన పాకిస్తాన్ కొత్త రాజకీయ మ్యాప్‌లో పాక్ పాలిత కశ్మీర్ (పాకిస్తాన్ దీనిని ఆజాద్ కశ్మీర్ అంటుంది), గిల్గిత్-బాల్టిస్తాన్, జునాగఢ్, సర్ క్రీక్ NJ9842 తర్వాత(సియాచిన్) ప్రాంతాలను పాకిస్తాన్‌లో భాగంగా భావిస్తోంది. భారత్ వైపున్న జమ్ము-కశ్మీర్ వివాదిత ప్రాంతం. దానికి ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తీర్మానాల ప్రకారం పరిష్కరించుకోవచ్చు" అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

సోషల్ మీడియాలో దీనిపై మిశ్రమ స్పందనలు వ్యక్తం అవుతున్నాయి. సీనియర్ జర్నలిస్ట్ తలత్ అస్లమ్ దీనిని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

"కొత్త మ్యాప్ అంటే కశ్మీర్‌ ఒక వివాదాస్పద ప్రాంతం, దానిని జనాభిప్రాయ సేకరణ ద్వారానే పరిష్కరించాలి అనే మన పాత పొజిషన్‌ను మనం వదిలేశామా.. దీని మిగతా పరిణామాలు ఎలా ఉంటాయి. గిల్గిత్-బాల్టిస్తాన్‌ను ఇప్పుడు ఒక కొత్త ప్రావిన్సుగా మారుస్తారా" అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)