పాకిస్తాన్‌లో 97 మంది మృతికి కారణమైన విమాన ప్రమాదానికి కారణాలేంటో తెలిశాయి..

ఫొటో సోర్స్, EPA
పాకిస్తాన్‌లో 97 మంది మరణానికి కారణమైన విమాన ప్రమాదం మానవ తప్పిదం వల్లే జరిగిందని ఆ దేశం వెల్లడించింది.
పైలట్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగాల పొరపాట్లే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక నివేదిక ఒకటి తేల్చింది.
విమాన ప్రమాదానికి గల కారణాలను పార్లమెంటులో చెబుతూ ఆ దేశ విమానయాన శాఖ మంత్రి గులాన్ సర్వార్ ఖాన్, పైలట్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) సిబ్బంది ప్రోటోకాల్ పాటించలేదని అన్నారు.
మే 22న కరాచీలో నివాస ప్రాంతాలపై విమానం కూలిపోవడంతో 97 మంది మరణించారు.
కేవలం ఇద్దరు మాత్రమే ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు(పీఐఏ)కు చెందిన ఆ ఎయిర్‌బస్ 320 విమానంలో ఎలాంటి లోపం లేదని మంత్రి చెప్పారు.
‘‘ఏటీసీ నుంచి వచ్చిన సూచనలను పైలట్ పట్టించుకోలేదు. అలాగే ఇంజిన్ ఢీకొన్న సంగతిని ఏటీసీ పైలట్‌కు చెప్పలేదు’’ అని సర్వార్ ఖాన్ అన్నారు.
లాహోర్ నుంచి కరాచీ వస్తూ ల్యాండింగ్ సమయంలో విమానాశ్రయానికి సమీపంలోని నివాస ప్రాంతంలో ఈ విమానం కూలిపోయింది.
‘‘విమానాన్ని మొదట రన్‌వేపై దించే క్రమంలో ల్యాండింగ్ గేర్ సరిగా వేయకపోవడంతో విమానం రన్‌వేపై ఈడ్చుకుంటూ వెళ్లింది.. దాంతో విమానాన్ని మళ్లీ గాల్లోకి ఎగిరించి రెండోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించాడు పైలట్. కానీ ఈలోగా ఏటీసీ సిబ్బంది విమానం తొలి ల్యాండింగ్ ప్రయత్నంలో ఇంజిన్ దారుణంగా దెబ్బతిందన్న సంగతిని పైలట్‌కు చెప్పలేదు’’ అని మంత్రి వెల్లడించారు.

ఫొటో సోర్స్, getty images
విమానం కూలిపోయిన తరువాత పాకిస్తాన్ మీడియాలో పైలట్, ఏటీసీ మధ్య సంభాషణగా చెబుతున్న ఆడియో సారాంశం ఒకటి వచ్చింది. అందులో విమానం ఇంజిన్లు పోయాయి అని పైలట్ అనడం వినిపిస్తుంది.
అప్పుడు ఏటీసీ నుంచి ‘బెల్లీ ల్యాండింగ్ చేస్తారా’ అని అడగ్గా ‘మేడే మేడే మేడే’ అని పైలట్ చెప్పడం వరకు వినిపిస్తుంది.
అదే పైలట్, ఏటీసీ మధ్య చివరి సంభాషణ.
కాగా మొదటిసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించడం, ఆ తరువాత విమానం కూలిపోవడానికి మధ్య 10 నుంచి 15 నిమిషాల సమయం పట్టిందని ఈ ప్రమాదం నుంచి బతికి బయటపడిన ముహమ్మద్ జుబేర్ చెప్పారు.
అయితే.. క్రాష్ అయ్యేంతవరకు ప్రయాణం సాఫీగా అనిపించడంతో ఎవరూ ఈ ఘోరాన్ని ఊహించలేదన్నారాయన.
ఇవి కూడా చదవండి:
- పైలట్లకు ఇంగ్లిష్ రాకపోవడమే విమాన ప్రమాదాలకు కారణమా?
- 2018లో పెరిగిన విమాన ప్రమాద మరణాలు.. ఒక్క ఏడాదే 556 మంది చనిపోయారు
- ప్రపంచవ్యాప్తంగా 737 మాక్స్ 8 విమానాలను నిలిపేసిన బోయింగ్
- పాకిస్తాన్ గగనతలంపై నిషేధంతో భారత విమానాలు ఎలా ప్రయాణిస్తున్నాయి
- పాకిస్తాన్ మీదుగా విమానాలు బంద్
- మేడ మీదే విమానం తయారీ
- ‘నేవీ నుంచి బయటపడటానికి విమానాన్ని దొంగిలించా’
- మీరు ఎక్కే విమానం ఎంత వరకు సురక్షితం?
- ఇంటెన్సివ్ పేరెంటింగ్ అంటే ఏమిటి? ఈ తరహా పెంపకం పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
- చెన్నై సిక్స్: ‘చేయని నేరానికి చిక్కుకుపోయా.. భారతీయ జైల్లోనే చచ్చిపోతా అనుకున్నా’ - బ్రిటన్ మాజీ సైనికుడి కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








