కరోనావైరస్ పుట్టుకపై అంతర్జాతీయ దర్యాప్తు చేయాలనే డిమాండ్‌ను తోసిపుచ్చిన చైనా

ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్ పుట్టుక గురించి స్వతంత్రంగా అంతర్జాతీయ దర్యాప్తు జరిపించాలనే డిమాండ్‌ను చైనా తోసిపుచ్చింది.
ఈ డిమాండ్లు రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవని, కరోనా మహమ్మారి మీద పోరాడుతున్న చైనా దృష్టిని అవి పక్కదారి పట్టిస్తాయని బ్రిటన్‌లోని ఉన్నత స్థాయి చైనా రాయబారి ఒకరు షెన్ వెన్ బీబీసీతో అన్నారు.
కోవిడ్-19 మూలాలేమిటి, అది ప్రాథమికంగా ఎక్కడ విస్తరించిందనే వివరాలు ఈ వైరస్‌ను ఎదుర్కోవడంలో ఉపయోగపడతాయి.
వూహాన్ నగరంలోని మాంసాహార మార్కెట్ నుంచి ఈ వైరస్ మొదలై ఉంటుందని గత ఏడాది చివర్లో భావించారు.
అయితే, ఇటీవలి యూరోపియన్ యూనియన్ నివేదిక ఒకటి, ఈ సంక్షోభానికి సంబంధించి చైనా తప్పుడు సమాచారాన్ని ఇస్తోందని ఆరోపించింది.
రష్యా, కొంతవరకు చైనా కూడా యూరోపియన్ యూనియన్‌లో, దాని పొరుగు దేశాల్లో "ఒక లక్ష్యంతో కుట్ర సిద్ధాంతాలను" ప్రచారం చేస్తున్నాయని ఈయూ ఎక్స్‌టర్నల్ యాక్షన్ సర్వీస్ ఆరోపించింది.
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కూడా చైనా ఈ వైరస్ విషయంలో వ్యవహరించిన తీరుపై పదే పదే విమర్శలు చేస్తూ వచ్చారు. అమెరికాలోని మిస్సోరి రాష్ట్రం అయితే, వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆరోపిస్తూ చైనా ప్రభుత్వం మీద కేసు కూడా వేసింది.
అయితే, ఈ వైరస్ వూహాన్ ప్రయోగశాలల్లో తయారైందనే ప్రచారంపై శాస్త్రవేత్తలు నీళ్ళు చల్లారు.

ఫొటో సోర్స్, Getty Images
చైనా అభ్యంతరాలేంటి?
ఈ వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచే, అసలు అది ఎలా మొదలైందో తేల్చేందుకు అంతర్జాతీయ దర్యాప్తునకు చైనా అనుమతించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
వచ్చే నెలలో జరగనున్న వరల్డ్ హెల్త్ అసెంబ్లీ వార్షిక సమావేశంలో తాను ఈ విచారణకు సంబంధించి ఓ తీర్మానాన్ని ప్రవేశపెడతానని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిర్ణయాత్మక విభాగాల్లో వరల్డ్ హెల్త్ అసెంబ్లీ కూడా ఒకటి.
అయితే, తమ దేశం మాత్రం ఎటువంటి అంతర్జాతీయ విచారణకు అనుమతించబోదని షెన్ బీబీసికి స్పష్టం చేశారు.
“స్వతంత్ర దర్యాప్తు అన్నది పూర్తిగా రాజకీయ ప్రేరేపితం.” అని ఆమె చెప్పారు.
“ఇప్పటికే మేం వైరస్‌తో పోరాడుతున్నాం. మా దృష్టంతా ప్రస్తుతం దాని మీదే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో విచారణ గురించి మాట్లాడతారేంటి? ఇది కేవలం మా దృష్టిని మరల్చడమే కాదు. మా వనరులను కూడా దారి మళ్లిస్తాయి.” అని షెన్ వ్యాఖ్యానించారు. అంతేకాదు, "ఈ డిమాండ్ల వెనుక పూర్తిగా రాజాకీయ దురుద్దేశాలే ఉన్నాయి. దీన్ని ఎవరూ అంగీకరించలేరు. ఇది ఎవరికీ మంచి చేయదు" అని అన్నారు.
“ఈ వైరస్ ఎక్కడ పుట్టిందన్న విషయంలో అనేక వదంతులు ప్రచారంలో ఉన్నాయి. అలాంటి తప్పుడు ప్రచారం చాలా ప్రమాదకరం. కరోనావైరస్ కన్నా ఈ రాజకీయ వైరస్ మరింత ప్రమాదకరం.” అని షెన్ అన్నారు.
మరోవైపు వైరస్ కేంద్ర బిందువు వూహాన్ అంటూ వస్తున్న ఆరోపణల్ని చైనా అధికారులు, అక్కడ మీడియా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని యూరోపియన్ యూనియన్ తన నివేదికలో తెలిపింది. అలాగే ప్రభుత్వ అధీనంలో ఉన్న సోషల్ మీడియా ఛానెళ్లలో ఈ కోవిడ్-19 సంక్షోభానికి అమెరికా మిలటరీకి ముడి పెడుతూ కథనాలను కూడా వండి వారుస్తున్నారని నివేదిక పేర్కొంది.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?

చైనా తీరుపై ఆందోళన చెందుతున్న యూరోపియన్లు –గోర్డాన్ కొరిరా, బీబీసీ రక్షణ వ్యవహారాల ప్రతినిధి
ఇటువంటి సున్నిత పరిస్థితుల్లో వీలైనంత వరకు దౌత్య పరంగానే వ్యవహారం నడపాలని యూరోపియన్ దేశాలు భావిస్తున్నాయి.
ఈ విషయంలో చైనాను ప్రతిఘటిస్తే ఎక్కడ ఆదేశంతో సంబంధాలు దెబ్బతింటాయోనన్న భయం నెలకొని ఉందని తన పేరును వెల్లడించడానికి ఇష్టబడని ఓ బ్రిటన్ అధికారి వ్యాఖ్యానించారు.
ప్రస్తుత సంక్షోభ సమయంలో వైరస్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన సామాగ్రి విషయంలో చాలా దేశాలు బీజింగ్‌పైనే ఆధారపడి ఉన్నాయి. అందుకే ఈ విషయంలో ఆచి తూచి వ్యవవహరించాలని నిపుణులు చెబుతున్నారు.
“మనం వీలైనంత వరకు మాటల తీవ్రతను తగ్గించాలి. ప్రతిఘటించకుండా ఉండటం మంచిది. ఎందుకంటే మనం ప్రస్తుతం అంతకన్నా ప్రమాదకరమైన పరిస్థితులతో పోరాడుతున్నాం” అని చైనాలో ఒకప్పుడు బ్రిటన్ దౌత్యవేత్తగా పని చేసిన చార్లెస్ పార్టన్ అభిప్రాయపడ్డారు.
ఇక అమెరికా విషయానికొస్తే ఈ ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో వైరస్‌పై విచారణ పేరుతో బీజింగ్ మీద ఒత్తిడి తీసుకు రావడం ఎంతో రాజకీయ ప్రాధాన్యం ఉన్న అంశమని ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: వైరల్ లోడ్ అంటే.. ఎక్కువ మంది వైద్య సిబ్బంది అనారోగ్యానికి గురవ్వడానికి కారణం ఏంటి
- కరోనావైరస్: తొలి మేడిన్ ఇండియా టెస్టింగ్ కిట్ తయారు చేసిన భారతీయ శాస్త్రవేత్త
- కరోనావైరస్: కోవిడ్ రోగులపై తొలిసారిగా బ్రిటన్‌లో వ్యాక్సీన్ ట్రయల్స్
- కరోనావైరస్ వ్యాక్సీన్ తయారు చేసే అవకాశాన్ని ప్రపంచం ఎలా చేజార్చుకుంది?
- కరోనావైరస్: జంతువుల నుంచి మనుషులకు సోకింది ఇలాగేనా? శాస్త్రవేత్తల ‘డిటెక్టివ్ కథ’
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








