#RIPTwitter: 24 గంటల్లో ఈ మెసేజ్‌లు మాయం.. ట్విటర్ కొత్త ఫీచర్‌పై యూజర్ల నిరసన

ఫొటో సోర్స్, Getty Images
సోషల్ మీడియా దిగ్గజాల్లో ఒకటైన ట్విటర్ ఒక కొత్త ఫీచర్‌ను పరీక్షించి చూస్తోంది.
కొన్ని ట్వీట్లు 24 గంటల తర్వాత కనిపించకుండాపోయేందుకు ఈ ఫీచర్ వీలు కల్పిస్తుంది.
'ఫ్లీట్స్' అనే ఈ ఫీచర్ స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ తరహాలో పనిచేస్తుంది.
ఈ ప్రయోగంపై ట్విటర్లో అనేక మంది యూజర్లు నిరసన వ్యక్తంచేశారు. ఈ ఫీచర్‌తో ట్విటర్ కూడా ఇతర సోషల్ మీడియా వేదికల్లాగే మారుతుందని, తన ప్రత్యేకతను కోల్పోతుందని ఆక్షేపిస్తూ ట్వీట్లు చేశారు. ఈ క్రమంలో #RIPTwitter హ్యాష్‌టాగ్ ట్రెండ్ అయ్యింది.
ప్రస్తుతానికి బ్రెజిల్లో మాత్రమే ట్విటర్ ఈ ఫీచర్‌ను ప్రయోగించి చూస్తోంది.


ఏవైనా ఆలోచనలను బహిరంగంగా వ్యక్తంచేయడానికి ఇబ్బందిపడేవారికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని సంస్థ ప్రొడక్ట్ లీడ్ కేవన్ బేక్పౌర్ చెప్పారు. (తొలగిస్తే తప్ప) ట్విటర్లో పోస్ట్ చేసింది ఎప్పటికీ ఉంటుందని, దీనివల్ల పోస్టులు పెట్టడానికి కొందరు వెనకాడవచ్చని తెలిపారు.
యూజర్లు ట్వీట్ చేయడానికి ఇష్టపడని స్వల్పకాలిక ఆలోచనలను పంచుకోవడానికి ఫ్లీట్స్ ఉపయోగపడుతుందని ఆయన వివరించారు.
ప్రొఫైల్ పిక్చర్‌ను క్లిక్ చేస్తే ఫ్లీట్స్ కనిపిస్తాయి. ఈ మెసేజ్‌లకు రిప్లై ఇవ్వడానికిగాని, లైక్ కొట్టడానికిగాని, వీటిపై బహిరంగంగా వ్యాఖ్యానించడానికిగాని వీలు ఉండదు.
ఈ ఫీచర్ నచ్చని యూజర్లు ట్విటర్లో తమ అసంతృప్తిని వ్యక్తంచేశారు.
ఫేస్‌బుక్-తరహా ఫీచర్లను ఎవరూ కోరుకోవట్లేదని, జనం ఎడిట్ ఆప్షన్ మాత్రమే కోరుకొంటున్నారని క్రిస్ డే పేరుతో ఉన్న ఓ యూజర్ చెప్పారు.

ఫొటో సోర్స్, Twitter

ఫొటో సోర్స్, Twitter
ఎడిట్ బటన్ కావాలని అందరూ అడుగుతుంటే, ట్విటర్ మాత్రం ఇకపై 24 గంటలపాటు ఉండి మాయమయ్యే స్టోరీస్ పోస్ట్ చేసుకోవచ్చని చెబుతోందని, అందుకే అందరూ #RIPTwitter అని అంటున్నారని మరో యూజర్ వ్యాఖ్యానించారు.
ఫ్లీట్స్ ఫీచర్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌కు చాలా దగ్గరగా ఉందనే విషయాన్ని కేవన్ బేక్పౌర్ అంగీకరించారు.
తాము తీసుకొస్తున్న ఫ్లీట్స్‌కు ఉద్దేశపూర్వకంగానే కొన్ని ప్రత్యేకతలు కల్పిస్తున్నామని ఆయన తెలిపారు.
అంతర్జాతీయంగా ఫ్లీట్స్ ఎప్పుడు ప్రవేశపెడతారనేది ట్విటర్ వెల్లడించలేదు.

ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- హ్యాండ్‌షేక్ చరిత్ర.. ఎప్పుడు, ఎందుకు, ఎలా పుట్టింది?
- దిల్లీ హింస: అల్లర్లలో మరణించినవారి వ్యధలివీ..
- ఇంటర్ విద్యార్థులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? దీనికి పరిష్కారం ఏంటి?
- కరోనావైరస్: శశిథరూర్ మెడలోని ఈ గాడ్జెట్ వైరస్‌లను అడ్డుకుంటుందా
- కరోనావైరస్లు ఎక్కడి నుంచి వస్తాయి... ఒక్కసారిగా ఎలా వ్యాపిస్తాయి?
- కరోనావైరస్ ఎంత వేగంగా విస్తరిస్తోంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









