బాంబుల శబ్దానికే కాదు.. ఇప్పుడు మాములు పరిస్థితుల్లో కూడా ఈ చిన్నారి నవ్వుతోంది

కరోనావైరస్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, బాంబుల శబ్దానికే కాదు.. ఇప్పుడు మాములు పరిస్థితుల్లో కూడా ఈ చిన్నారి నవ్వుతోంది.

బాంబుల శబ్దం వినిపించినప్పుడల్లా ఆ ఒత్తిడిని అధిగమించేందుకు తన తండ్రితో కలిసి నవ్వుతూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరచిన సిరియా చిన్నారిని తమ దేశంలోని సురక్షిత ప్రాంతానికి చేర్చినట్టు టర్కీ వెల్లడించింది.

News image

సిరియాకు చెందిన సాల్వా అనే మూడేళ్ల చిన్నారి వీడియో గత నెలలో వైరల్ అయ్యింది. ఇడ్లిబ్‌లోని తన ఇంటికి సమీపంలో యుద్ధ విమానాలు జారవేసే బాంబుల శబ్దాలను వింటూ ఆడుకోవడం ఆ వీడియోలో కనిపించింది.

వీడియో క్యాప్షన్, వీడియో: సిరియా యుద్ధం.. బాంబులు పడుతున్నా నవ్వుతున్న చిన్నారి

అయితే ఆ వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయిన వారం రోజుల తర్వాత ఆమె కుటుంబాన్ని సరిహద్దులు దాటి సురక్షిత ప్రాంతానికి చేర్చడంలో టర్కీ ప్రభుత్వం సాయపడింది. సిరియాలోని ఇడ్లిబ్ తిరుగుబాటుదారులకు గట్టి పట్టున్న ప్రాంతం.

వైమానిక దాడుల్ని ఎదుర్కొనేందుకు సాల్వా, ఆమె తండ్రి అబ్దుల్లా మొహమ్మద్ ఓ వినూత్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు.

బాంబుల శబ్దానికి భయపడే బదులు శబ్దం వినిపించినప్పుడల్లా నవ్వుతూ ఉండాలని తన బిడ్డకు చెప్పారు అబ్దుల్లా.

ఫలితంగా అంత భయానక పరిస్థితిలో కూడా ప్రశాంతంగా ఆడుకుంటూ సంతోషంగా ఉండగల్గేది సాల్వా.

బాంబుల శబ్దాలు అవసరం లేదు

వారి పరిస్థితిని అర్థం చేసుకున్న టర్కీ ప్రభుత్వం తమ దేశానికి వచ్చేందుకు వారికి అనుమతిచ్చింది. ప్రస్తుతం వాళ్లకు రేహన్లలోని శరణార్ధి శిబిరంలో ఆశ్రయమిచ్చారు.

శరణార్ధి శిబిరంలో ఆ తండ్రీకూతుళ్లను చూసిన గార్డియన్ పత్రికకు చెందిన రిపోర్టర్ మెక్‌కెర్నన్... మొదటిసారిగా ఆమె సాధారణ పరిస్థితుల్లో కూడా నవ్వగల్గుతోందంటూ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

టర్కీ చేరుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని, సాల్వాకు బడికెళ్లే అవకాశం వచ్చిందని టర్కీ మీడియా ద్వారా అంతర్జాతీయ సమాజానికి తెలియజేశారు అబ్దుల్లా.

టర్కీ ఇప్పటి వరకు 37లక్షల మంది సిరియా శరణార్ధులకు ఆశ్రయమిచ్చింది.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)