భూమి బల్లపరుపుగా ఉందని నిరూపిస్తానని ప్రాణాలు పోగొట్టుకున్నారు

ఫొటో సోర్స్, CBS
భూమి గుండ్రంగా లేదని, బల్లపరుపుగా ఉందని నమ్మే ఓ అమెరికన్ పైలట్ తన అభిప్రాయం నిజమని నిరూపిస్తానంటూ చేపట్టిన ఓ రాకెట్ ప్రయోగంలో ప్రాణాలు కోల్పోయారు.
64 ఏళ్ల 'మ్యాడ్' మైక్ హ్యూజ్ సొంతంగా తయారుచేసిన రాకెట్ ఇది. ఇది ఆవిరితో ప్రయాణిస్తుంది.
హ్యూజ్ శనివారం బార్‌స్టో నగరానికి దగ్గర్లో కాలిఫోర్నియా ఎడారి ప్రాంతంలో రాకెట్ ప్రయోగాన్ని చేపట్టారు.
ఆయన ప్రయాణిస్తున్న రాకెట్ టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే కూలిపోయింది. ఆయన చనిపోయారు. రాకెట్ గాల్లోకి దూసుకెళ్లి వెంటనే నేల కూలుతున్న వీడియో సోషల్ మీడియాలో ఉంది.
రాకెట్ పైకి లేచిన తర్వాత పారాచ్యూట్ చాలా ముందుగా తెరచుకొన్నట్లు వీడియోను బట్టి తెలుస్తోంది.


భూమి బల్లపరుపుగా ఉందని బలంగా నమ్మేవారిలో హ్యూజ్ ఒకరు. రాకెట్ ప్రయోగంతో అంతరిక్షంలోకి వెళ్లి తన అభిప్రాయాన్ని నిరూపించాలని ఆయన ఆశించారు.
ఔత్సాహిక రాకెట్ తయారీదారులపై యూఎస్ సైన్స్ చానల్‌లో ప్రసారం కానున్న కొత్త టీవీ సిరీస్ 'హోమ్‌మేడ్ ఆస్ట్రోనాట్స్'లో భాగంగా ఈ రాకెట్ ప్రయోగాన్ని చిత్రీకరించినట్లు తెలుస్తోంది. పరిమితమైన బడ్జెట్‌తో ఈ ప్రాజెక్టును చేపట్టారు.
హ్యూజ్ తన పార్ట్‌నర్ వాల్డో స్టేక్స్ సాయంతో ఈ రాకెట్‌తో ఐదు వేల అడుగుల (1,525 మీటర్ల) ఎత్తుకు చేరుకొనేందుకు ప్రయత్నించారని స్పేస్.కామ్ తెలిపింది.
తన కలను సాకారం చేసుకొనే ప్రయత్నంలో హ్యూజ్ చనిపోయారని సైన్స్ చానల్ ట్విటర్లో వ్యాఖ్యానించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
శనివారం స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం దాదాపు రెండు గంటలకు రాకెట్ ప్రయోగ కార్యక్రమానికి తమ అధికారులను నిర్వాహకులు పిలిచారని శాన్ బెర్నార్డినో కౌంటీ షెరిఫ్ కార్యాలయం తెలిపింది.
రాకెట్ ఎడారిలో కూలిపోవడంతో ఒకరు చనిపోయారని షెరిఫ్ కార్యాలయం చెప్పింది.
చనిపోయింది పైలట్ హ్యూజేనని హ్యూజ్ ప్రచారకర్త అమెరికా మీడియా సంస్థలకు స్పష్టం చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
హ్యూజ్ లాంటి సాహసి ఆయన ఒక్కరేనని హ్యూజ్ మాజీ ప్రతినిధి డారెన్ షూస్టర్ టీఎంజడ్ మీడియా సంస్థతో వ్యాఖ్యానించారు.
హ్యూజ్ శాన్‌బెర్నార్డినో కౌంటీలోని యాపిల్ వ్యాలీలో నివసించేవారు.
సుమారు 18 వేల డాలర్లు వెచ్చించి హ్యూజ్, ఆయన అసిస్టెంట్లు హ్యూజ్ ఇంటి వద్ద ఈ రాకెట్ తయారుచేశారు.
ఒక నాజిల్ గుండా వెలువడే ఆవిరితో ఈ రాకెట్ ముందుకు సాగుతుంది.
భూమి బల్లపరుపుగా ఉందని నిరూపిస్తానని హ్యూజ్ లోగడ ప్రకటించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షించారు. తాను అంతరిక్షంలోకి వెళ్లి, భూమి బల్లపరుపుగా ఉందో, గుండ్రంగా ఉందో నిర్ధరించుకుంటానని ఆయన 2018లో చెప్పారు.
2019 మార్చిలో ఆయన 1870 అడుగుల (570 మీటర్ల) ఎత్తు వరకు వెళ్లి తర్వాత ప్యారాచూట్ సాయంతో కిందకు దిగారు. ల్యాండింగ్ సమయంలో కుదుపు వచ్చింది.
నాడు ఆయన స్పందిస్తూ- ప్రయోగంపై సంతోషం వ్యక్తంచేశారు.
కాలిఫోర్నియాలోని పెరిస్‌లో లిమోసిన్ వాహనంతో 31.39 మీటర్ల (103 అడుగుల) దూరం జంప్ చేసి, ఈ వాహనంతో అత్యధిక దూరం జంప్ చేసిన వ్యక్తిగా ఆయన 2002లో గిన్నిస్ ప్రపంచ రికార్డు నెలకొల్పారు.

ఇవి కూడా చదవండి:
- ‘భూమి నాశనమవుతున్న శకంలో మనం జీవిస్తున్నాం’
- నాసా పరిశోధన: భూమి నుంచి 640 కోట్ల కిలో మీటర్ల దూరంలో 'స్నో మ్యాన్'
- గగన్‌యాన్: ముగ్గురు భారతీయులు, ఏడు రోజులు, రూ.10 వేల కోట్ల వ్యయం
- వ్యోమగాములను సురక్షితంగా కిందకు తెచ్చే శక్తి భారత్ సొంతం
- ట్రంప్‌కు 70 లక్షల మంది స్వాగతం పలకడం సాధ్యమేనా...
- డోనల్డ్ ట్రంప్‌కు నది శుభ్రంగా కనిపించేలా, యమునలో నీళ్లు వదిలారు
- కరోనావైరస్: ఏ వయసు వారిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది?
- పిల్లల ఆరోగ్యం: 131వ స్థానంలో భారత్.. ఉత్తర కొరియా, భూటాన్, మయన్మార్ల కంటే దిగువన
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









