మెసేజ్‌లలో వచ్చే నగ్నచిత్రాలను తొలగించే ఫిల్టర్ తీసుకొచ్చిన ట్విటర్

డైరెక్ట్ మెసేజ్‌ల రూపంలో అవాంఛిత నగ్నచిత్రాలు రాకుండా అడ్డుకొనేందుకు తన యూజర్ల కోసం ట్విటర్ ఒక కొత్త ఫిల్టర్ తీసుకొచ్చింది.
డైరెక్ట్ మెసేజ్ రూపంలో పంపే పురుషాంగం చిత్రాలను అడ్డుకొని తొలగించే 'సేఫ్ డీఎం' అనే ప్లగ్‌ఇన్ ట్విటర్ యూజర్లకు శుక్రవారం అందుబాటులోకి వచ్చింది.
డెవలపర్ కెల్సీ బ్రెస్లర్‌కు ఈ ఫిల్టర్ ఆలోచన వచ్చింది. ఒక పురుషుడి నుంచి తనకు ఓ నగ్నచిత్రం వచ్చిన తర్వాత ఇలాంటి వాటిని అడ్డుకొనే దిశగా ఆమె ఆలోచన చేశారు.


అవాంఛిత, అసభ్యకర నగ్నచిత్రాలు, వీడియోలు యూజర్లకు రాకుండా అడ్డుకొనేందుకు సోషల్ మీడియా సంస్థలు మరిన్ని చర్యలు చేపట్టాలని కెల్సీ చెప్పారు.
మరో ప్రధాన సోషల్ మీడియా వేదికలోనూ ఈ ఫిల్టర్‌ను అందుబాటులోకి తెచ్చే విషయమై సేఫ్ డీఎం చర్చలు జరుపుతోందని, ఇవి ప్రాథమిక దశలో ఉన్నాయని ఆమె బీబీసీతో తెలిపారు. ఇతర సోషల్ మీడియా వేదికలకూ ఈ ఫిల్టర్‌ను అందించాలనుకొంటున్నామని చెప్పారు.
సేఫ్ డీఎం 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ)' సాయంతో పనిచేస్తుంది.

ఫొటో సోర్స్, Twitter
ఈ ఫిల్టర్‌కు అవసరమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అభివృద్ధి చేసేందుకు పురుషాంగాల చిత్రాలు పంపాలని కెల్సీ నిరుడు సెప్టెంబరులో ట్విటర్లో కోరారు.
ఆమెకు నాలుగు వేల చిత్రాలు వచ్చాయి.
ఫిల్టర్ 99 శాతం సందర్భాల్లో పనిచేస్తోందని సేఫ్ డీఎం బృందం చెబుతోంది.

ఫొటో సోర్స్, Twitter
పురుషాంగాల చిత్రాలను గుర్తించి తొలగించడంలో ఫిల్టర్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్ చాలా కచ్చితత్వంతో పనిచేస్తున్నట్లు బజ్‌ఫీడ్ న్యూస్ నిర్వహించిన ఓ పరీక్షలో తేలింది. ఫిల్టర్ ఈ పని పూర్తిచేయడానికి కొన్ని నిమిషాల సమయం తీసుకొంటున్నట్లు వెల్లడైంది.
సేఫ్ డీఎం వాడాలనుకొనే ట్విటర్ యూజర్లు తమ ఖాతాకు ఓ ప్లగ్ఇన్ జోడించి, డైరెక్ట్ మెసేజ్‌లను చూసేందుకు దానిని అనుమతించాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
సాఫ్ట్‌వేర్ ఈ మెసేజ్‌లలోని చిత్రాలను పరిశీలించి, పురుషాంగాల చిత్రాలు ఉంటే గుర్తించి తొలగిస్తుంది. సదరు మెసేజ్ అనుచితమైనదని, అందుకే తొలగించానంటూ మెసేజ్ పంపిన యూజర్‌కు, మెసేజ్ వచ్చిన యూజర్‌కు సందేశం పంపిస్తుంది.
సాఫ్ట్‌వేర్‌లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెసేజ్‌లను చదవదని, అక్కడ వచ్చిన చిత్రాలను మాత్రమే పరిశీలిస్తుందని కెల్సీ వివరించారు.
2017 నాటి ప్యూ రీసర్చ్ సెంటర్ అధ్యయనం ప్రకారం 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో 53 శాతం మందికి కనీసం ఒక్కటైనా అవాంఛిత చిత్రం వచ్చింది.

ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్లో చక్కెర కొరత... ఇబ్బందులు పడుతున్న ప్రజలు
- కరోనా వైరస్: పిల్లలపై ప్రభావం చూపలేకపోతున్న వైరస్.. కారణాలు చెప్పలేకపోతున్న వైద్య నిపుణులు
- ‘ఎప్పుడూ ప్రేమలో పడం.. ప్రేమ వివాహం చేసుకోం’ అని అమ్మాయిలతో ప్రమాణం చేయించిన కాలేజీ
- నెలసరిలో ఉన్నారేమో అని విద్యార్థినులను దుస్తులు విప్పించి చెక్ చేశారు
- మంట పుట్టించే ఘాటైన ఆహారాన్ని జనాలు ఎందుకు ఇష్టపడుతున్నారు?
- ఆహార వృథాయే ఆకలి కేకలకు అసలు కారణమా?
- హైటెక్ వ్యవసాయం: ఆహార ఉత్పత్తుల దిగుబడిని పెంచడంలో టెక్నాలజీ పాత్ర ఏమిటి...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









