ఆస్ట్రేలియా డే: కేకు తినే పోటీలో గెలవాలనే ఆత్రుతతో ప్రాణం కోల్పోయిన మహిళ

లామింగ్టన్

ఫొటో సోర్స్, Getty Images

‘పది నిమిషాల్లో ఎవరు ఎక్కువ ఐస్‌క్రీమ్‌లు తింటారు? ఎవరు ఎక్కువ సమోసాలు తింటారు?.. ఇలాంటి పోటీలు అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. అలాంటి ఒక పోటీలో గెలవాలన్న తాపత్రయంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటన ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో జరిగింది. అక్కడ ఆస్ట్రేలియా డే సందర్భంగా హెర్వే బే అనే ఒక హోటల్లో ఈ ‘బింజ్ ఈటింగ్’ పోటీ నిర్వహించారు. నిర్దేశిత సమయంలో ఎవరు ఎక్కువ లామింగ్టన్‌లను తింటే వాళ్లే విజేతలని ప్రకటించారు.

లామింగ్టన్‌ అంటే కొబ్బరి కోరు, చాక్లెట్‌‌ను కలగలిపి తయారు చేసే కేకు. ఆస్ట్రేలియాలో అదో సంప్రదాయ వంటకం. ఆ కేకుల్ని తినే పోటీల్లో ఓ మహిళ కూడా పాల్గొన్నారు. వీలైనన్ని ఎక్కువ కేకులు తినాలన్న ఆత్రుతలో ఆమె గుండెపోటుకు గురై చనిపోయారు. ఆమె వయసు 60 ఏళ్లు.

ఆమె కుప్పకూలిన వెంటనే సీపీఆర్ నిర్వహించి ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది.

Presentational grey line
News image
Presentational grey line

కేకుని ఆమె చాలా ఆత్రంగా నోట్లో బుక్కుకున్నారని, ఆ తరువాత ఆమెకు సమస్యలు మొదలయ్యాయని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు.

ఈ ప్రమాదం జరగడానికి ముందు చుట్టూ ఉన్న వాళ్లంతా చప్పట్లు కొడుతూ పోటీల్లో పాల్గొన్నవారిని ప్రోత్సహిస్తున్న ఒక వీడియో కూడా బయటికొచ్చింది.

హోటల్ యాజమాన్యం చనిపోయిన మహిళ పేరు వెల్లడించలేదు. ఆమె కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సానుభూతి తెలుపుతూ ఫేస్‌బుక్‌లో తమ సందేశాన్ని పోస్ట్ చేసింది.

చాలా వేగంగా స్పందించి హోటల్‌కు చేరుకున్న అంబులెన్సు సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేసింది.

తొలిసారి యురోపియన్లు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని ఏటా ఆస్ట్రేలియా డే నిర్వహిస్తారు. దాన్ని జాతీయ సెలవుగా కూడా ప్రకటించారు. ఆ రోజున దేశవ్యాప్తంగా ఇలాంటి తిండి పోటీలు నిర్వహించడం ఆనవాయితీ.

నిర్దేశించిన సమయంలోగా ఎక్కువ కేకులు, హాట్ డాగ్స్, పేస్ట్రీల లాంటి వాటిని తిన్నవారికి బహుమతులు ఇస్తుంటారు.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)