కారులో అస్థిపంజరంతో ప్రయాణం... ఏమిటి కారణం?

రహదారిపైన వేగంగా వెళ్లడానికి ఓ వ్యక్తి తన పక్కన అస్థిపంజరాన్ని పెట్టుకొని దానికి టోపీపెట్టి మనిషిలా సీట్లో కూర్చోబెట్టి, హై ఆక్యుపెన్సీ వెహికిల్ లైన్‌లోకి(హెచ్ఓవీ) ప్రవేశించాడు.
కానీ, పోలీసులు అతడిని గుర్తించి అడ్డుకొని జరిమానా విధించారు. ఈ ఘటన అమెరికాలోని ఆరిజోనాలో జరిగింది.
'హెచ్ఓవీ'లోకి ప్రవేశించేందుకే ఆ వ్యక్తి ఓ నకిలీ అస్థిపంజరానికి టోపీ పెట్టి, దానికి సీటు బెల్టు పెట్టి కారులో తీసుకెళ్లాడు. కానీ, ఓ పోలీసు అధికారి అతడిని గుర్తించి అడ్డుకున్నారు.
అతనొక్కడే కాదు, ఆరిజోనాలో ఇలా ఏడాదికి దాదాపు 7వేల మంది డ్రైవర్లు హెచ్‌ఓవీలోకి ప్రవేశించేందుకు ఇలా రకరకాల విన్యాసాలు చేస్తుంటారని అక్కడి పోలీసులు తెలిపారు.
ఏంటీ హెచ్‌ఓవీ లైన్?
అమెరికా, కెనడా, న్యూజీలాండ్ లాంటి దేశాల్లో ఈ హై ఆక్యుపెన్సీ వెహికిల్ లైన్లనే డైమండ్ లైన్, ట్రాన్సిట్ లైన్, కార్ పూల్ లైన్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. కారులో డ్రైవర్‌తో కనీసం మరో వ్యక్తి అయినా ఉన్నప్పుడే ఈ లైన్లలో కారు ప్రవేశించడానికి అనుమతి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా కొన్ని ప్రాంతాల్లో అన్ని వేళల్లో ఈ లైన్ వాడుకలో ఉంటుంది.
సాధారణంగా కార్ పూలింగ్‌ను ప్రోత్సహించడానికి, రోడ్ల ఆక్యుపెన్సీని పెంచడానికి ఈ లైన్లను ఉపయోగిస్తారు. కేవలం ఒక వ్యక్తే కారు నడుపుతూ ఈ లైన్లలోకి ప్రవేశిస్తే వారికి జరిమానా విధిస్తారు. అందుకే చాలాసార్లు ఆ ఫైన్లను తప్పించుకునేందుకు కొందరు రకరకాల మార్గాలను అన్వేషిస్తారు.



ఫొటో సోర్స్, Arizaona Police
ప్యాసింజర్ సీట్లలో పెద్ద పెద్ద బొమ్మలు, చెక్క కటౌట్‌లు పెట్టడం, దిండుకు దుప్పటికప్పి అది కనిపించకుండా చేయడం, కుక్కలు, పిల్లులు లాంటి పెంపుడు జంతువులకు సీటు బెల్టు పెట్టి తీసుకెళ్లడం.. ఇలా రకరకాల మార్గాల్లో ట్రాఫిక్ పోలీసులను బురిడీ కొట్టించి ఆ మార్గంలో ప్రయాణించడానికి చూస్తారు. సింగిల్ డ్రైవర్లు ప్రయాణించే మార్గంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందుకే వేగంగా ప్రయాణం సాగించేందుకే వాళ్లంతా ఇలా చేస్తారు.
ఇక ఆరిజోనాలో అస్థిపంజరాన్ని తీసుకెళ్లిన వ్యక్తి విషయానికి వస్తే, ఆ పని చేసిన వ్యక్తికి 62 ఏళ్లు. అతడిని ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో అనేక మంది పోస్టులు పెట్టారు. ఆరిజానా పోలీసు శాఖ కూడా ఇలాంటి ట్రిక్కులతో తమను మోసం చేయలేరని పోస్టు పెట్టింది.
#NiceTry, #YoureNotHeMan లాంటి హ్యాష్ ట్యాగ్‌లు కూడా ట్రెండ్ అయ్యాయి. గతంలో ఇలాంటి ప్రయత్నాలు చేసి దొరికిపోయిన వారి ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి:
- కరోనా వైరస్-వుహాన్ : ఒక నగరాన్ని మూసేయడం సాధ్యమా? చైనా చర్యతో వైరస్ వ్యాప్తి ఆగిపోతుందా?
- సముద్రజీవులను, భారీ తిమింగలాలను సైతం చంపేస్తున్న ‘ఘోస్ట్ గేర్’
- బంగారం ధరలకు, అంతర్జాతీయ సంక్షోభాలకు ఏమిటి సంబంధం...
- సీఏఏకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో అర్ధ రాత్రి వరకు మహిళల ఆందోళన
- NRC ఎన్డీఏ కూటమిలో చీలికలు తీసుకొచ్చిందా
- భారత్‌లో ప్రతి 20 మంది చిన్నారుల్లో ఒకరు అయిదేళ్లలోపే చనిపోతున్నారు...
- ‘దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.. అలాంటి పిటిషన్లతో ఉపయోగం లేదు’- చీఫ్ జస్టిస్ బోబ్డే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









