నాన్‌కానా సాహెబ్ గురుద్వారాపై దాడి.. సీఏఏ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఇది భారత్ కుట్ర అంటున్న పాకిస్తాన్

ఫొటో సోర్స్, Sardar Harmeet Singh
డజన్ల కొద్దీ నిరసనకారులు పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రాంతంలో ఉన్న నాన్‌కానా సాహెబ్ గురుద్వారా జన్మస్థాన్‌పై శుక్రవారం సాయంత్రం రాళ్లు రువ్వారు.
జుమ్మా ప్రార్థనలు ముగిసిన తర్వాత అక్కడ చేరిన గుంపు సిక్కు వర్గానికి, స్థానిక అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించింది.
ఈ గుంపుకు ముహమ్మద్ హసన్ అనే వ్యక్తి కుటుంబం నేతృత్వం వహిస్తోంది.
జగ్జీత్ కౌర్ అనే సిక్కు యువతి మతం మార్చుకుని, హసన్ అనే ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకుంది కాబట్టి ఆమెను తమకు అప్పగించాలని వాళ్లు డిమాండ్ చేశారు.
సిక్కు వర్గీయులను బెదిరిస్తుండటం, నాన్‌కానా సాహెబ్ పేరును గులామన్-ఏ-ముస్తఫా పట్టణంగా పేరు మార్చాలని ప్రభుత్వాన్ని కోరతామని వీరు చెప్పడం సోషల్ మీడియాలో షేర్ అయిన వీడియోల్లో ఉంది.
ఈ దాడి వల్ల గురుగోవింద్ సింగ్ జయంతిని పురస్కరించుకుని గురుద్వారాను సందర్శించాలని భావించిన ఎందరో సిక్కు భక్తులు లోపలకి వెళ్లలేకపోయారు. లోపల చిక్కుకున్న వారు బయటకు రాలేకపోయారు. పోలీసులు వచ్చే వరకూ ఇదే పరిస్థితి కొనసాగింది.
అయితే, జగ్జీత్ కౌర్‌ను కిడ్నాప్ చేసి, బలవంతంగా మతం మార్చారని ఆమె కుటుంబం ఆరోపిస్తోంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
తీవ్రంగా ఖండించిన భారత్
ఈ వ్యవహారంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. గురుద్వారాపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, సిక్కు ప్రజల భద్రత, సంక్షేమానికి తగిన చర్యలను పాకిస్తాన్ వెంటనే తీసుకోవాలని కోరింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈ దాడిని ఖండించారు.
దాడికి పాల్పడ్డవారిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేసి, చర్యలు తీసుకునేలా భారత ప్రభుత్వం ఒత్తిడి తేవాలని ఆమె ట్విటర్ ద్వారా డిమాండ్ చేశారు.
భవిష్యత్‌లో ఇలాంటి దాడులు జరగకుండా, భక్తులకు తగిన భద్రతా ఏర్పాట్లు చేపట్టేలా పాకిస్తాన్ అధికారుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లాలని ఆమె కోరారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఈ దాడి ఘటనపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో మాట్లాడాలని భారత ప్రధాని నరేంద్ర మోదీని శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ కోరారు.
పాకిస్తాన్ స్పందన ఏంటి
మరోవైపు, భారత స్పందనకు వ్యతిరేకంగా పాకిస్తాన్ స్పందించింది. తీవ్రమైన, ముఖ్యమైన అంశాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇది భారత ప్రభుత్వం చేపట్టిన చర్య అని పాకిస్తాన్ ఈ ఘటనను అభివర్ణించింది.
వ్యక్తిగత వివాదానికి మతపరమైన రంగు పులిమేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పాకిస్తాన్ మంత్రి ఎజాజ్ షా బీబీసీతో అన్నారు.
భారత ప్రభుత్వం, భారత మీడియా తమ దేశ ప్రజల దృష్టిని సీఏఏ నిరసనల వైపు నుంచి, కశ్మీర్ అంశం నుంచి మరల్చేందుకు ఈ అంశాన్ని ఉపయోగించుకుంటున్నారని పంజాబ్ ప్రావిన్స్ సమాచార శాఖ మంత్రి ఫయాజుల్ హసన్ చౌహాన్ బీబీసీతో అన్నారు. ఇది రెండు కుటుంబాల వ్యక్తిగత వివాదమని, కేవలం గంటల్లోనే అది సద్దుమణిగిందని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, AFP
వివాదం ఎలా మొదలైంది?
19 ఏళ్ల జగ్జీత్ కౌర్‌ను ఎత్తుకెళ్లి, బలవంతంగా మతమార్పిడి చేశారనే ఆరోపణలతో ఆరుగురు వ్యక్తులపై నాన్‌కానా పోలీస్ స్టేషన్లో గత సెప్టెంబర్లో ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు ఈ వివాదం మొదలైంది.
జగ్జీత్‌ను బలవంతంగా కిడ్నాప్ చేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
అయితే, తన ఇష్టానుసారమే కౌర్ ఇస్లాం మతంలోకి మారారని, ముహమ్మద్ హసన్‌తో ఆమె వివాహం జరిగిందని కౌర్ తరపు న్యాయవాదిని అని చెబుతున్న వ్యక్తి అధికారులతో చెప్పారు.
ఆ తర్వాత జగ్జీత్ వాంగ్మూలాన్ని లాహోర్‌లోని న్యాయమూర్తికి సమర్పించారు. దానిలో తన కుటుంబం తనను వేధిస్తోందని ఆమె పేర్కొన్నారు.
ఈ మొత్తం వ్యవహారంతో ఆగ్రహం చెందిన సిక్కు వర్గం ప్రభుత్వ జోక్యాన్ని కోరింది.
దీంతో, పంజాబ్ గవర్నర్ ముహమ్మద్ సర్వార్ మధ్యవర్తిత్వం జరిపారు. సమస్య సామరస్యంగా పరిష్కారమైందని ఆయన ట్విటర్లో ప్రకటించారు.
కానీ, ఇప్పటికీ భద్రతా కారణాలను చూపిస్తూ ఆమెను లాహోర్‌లోని షెల్టర్ హోమ్ లోనే ఉంచారు.
జగ్జీత్‌ను తమకు అప్పగించకపోతే సిక్కులను ఈ ప్రాంతంలో నివసించనీయబోమని గురుద్వారాపై రాళ్లు రువ్విన గుంపు హెచ్చరించింది.
జగ్జీత్ కౌర్ తాత ఈ గురుద్వారాలో పనిచేస్తుంటారు.

ఫొటో సోర్స్, RAVINDER SINGH ROBIN
హర్మీత్ సింగ్ ఆ సమయంలో గురుద్వారాలో ఉన్నారు.
"మా వేడుకలు ఇది నాశనం చేసింది. భక్తులు లోపలకు రాలేకపోయారు. మొదట్లో ఆ మూకలో కొద్దిమందే ఉన్నారు. క్రమంగా సంఖ్య పెరిగింది. మేమంతా భయపడిపోయాం. మా వాళ్లంతా తమ ఇళ్లలోనుంచి బయటకు రావడానికి కూడా వణికిపోయారు" అని ఆయన అన్నారు.
భవిష్యత్ ప్రణాళికను చర్చించడానికి తామంతా సమావేశం అవుతామని ఆయన తెలిపారు.
"ఇది బాబా నానక్ పుట్టిన ప్రదేశం. మాకిది చాలా పవిత్రమైనంది. వాళ్లు దీనిపై రాళ్లు రువ్వారు. ఇది చాలా బాధగా ఉంది. దీన్ని మేం సహించం" అని హర్మీత్ వ్యాఖ్యానించారు.
ఈ నిరసన కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కుల మనోభావాలు దెబ్బతిన్నాయని పాకిస్తాన్ సిక్ కౌన్సిల్ పాట్రన్ ఇన్ చీఫ్ రమేష్ సింగ్ బీబీసీకి తెలిపారు.
జగ్జీత్ అంశం రెండు కుటుంబాల వ్యక్తిగత విషయం. దీనికోసం ప్రార్థనా మందిరాలపై దాడులు చేయడం సరికాదు. ఇది చాలా బాధిస్తోంది అని ఆయనన్నారు.
కర్తార్‌పూర్ కారిడార్ ద్వారా వెల్లివిరిసిన శాంతి, సౌభ్రాతృత్వాలను ఈ ఘటన చెదరగొట్టిందని ఆయన అన్నారు.
ప్రభుత్వం మా మందిరాన్ని రక్షించడానికి సైన్యాన్ని మోహరించాలని కోరారు.
అలాగే జగ్జీత్ అంశాన్ని కూడా ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.
"ఆమె వెనక్కి తిరిగి రావాలనుకుంటే, రానివ్వాలి. ఆమె వాళ్లతోనే ఉండాలంటే ఉండనివ్వాలి. వ్యక్తిగత వివాదాల కారణంగా మొత్తం వర్గాన్నే తక్కువ చేసి చూస్తామంటే అంగీకరించేది లేదు" అని రమేశ్ సింగ్ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి.
- ఏపీ రాజధానిపై బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఏం సూచించింది
- "ప్రభుత్వం మారిన ప్రతిసారి రాజధాని మారుస్తారా?".. సీఎం జగన్ వ్యాఖ్యలపై అమరావతి రైతుల నిరసన
- తొలిసారి విమానం ఎక్కాడు.. ఇంజిన్లోకి లక్కీ కాయిన్లు విసిరాడు
- గుజరాత్ పంట పొలాలపై పాకిస్తాన్ మిడతల ‘సర్జికల్ స్ట్రైక్’... 8 వేల హెక్టార్లలో పంట నష్టం
- నర మానవుల్లేని ‘దెయ్యాల’ టౌన్: ఈ పట్టణంలోకి అడుగుపెట్టొద్దు - అధికారుల హెచ్చరిక
- చరిత్రలో అత్యంత ఘోరమైన సంవత్సరం
- రూ. 3,208 కోట్ల విలువైన బిట్కాయిన్లు మాయం.. క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించే స్టోరీ
- చైనాలో ఇస్లాం వ్యాప్తి చేస్తున్న పాకిస్తాన్ మదరసా విద్యార్థులు
- దైవదూషణ కేసులో మరణశిక్ష తప్పించుకుని పాకిస్తాన్ వదిలివెళ్లిన ఆసియా బీబీ
- గులాలాయీ ఇస్మాయిల్: పాకిస్తాన్ నుంచి అమెరికా పారిపోయిన మానవహక్కుల కార్యకర్త
- 'మరణం తర్వాత మెదడులో మళ్లీ చలనం.. మనసును చదివే చిప్స్': వైద్య రంగంలో అద్భుత విజయాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








