ఇమ్రాన్ ఖాన్: ఆర్ఎస్ఎస్ హైదరాబాద్ కవాతు వీడియోను షేర్ చేసిన పాకిస్తాన్ ప్రధాని.. ముస్లింల నరమేధానికి పాల్పడకముందే అంతర్జాతీయ సమాజం మేల్కొనాలని ట్వీట్

ఫొటో సోర్స్, AFP
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్ఎస్)పై విమర్శల దాడి చేశారు.
ఆ సంస్థ కార్యకర్తలు హైదరాబాద్‌లో గురువారం చేసిన ఓ కవాతు వీడియో క్లిప్‌ను షేర్ చేస్తూ ట్విటర్ వేదికగా బీజేపీపై, భారత ప్రధాని మోదీపై ఆరోపణలు గుప్పించారు.
ఆర్‌ఎస్‌ఎస్ కవాతు వీడియోను సుచిత్ర విజయన్ అనే మహిళ ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
దీన్ని రీట్వీట్ చేస్తూ.. ఆర్ఎస్‌ఎస్ నరమేధం సృష్టించకముందే, అంతర్జాతీయ సమాజం మేల్కొనాలని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు.
‘‘ఏదో ఒక వర్గంపై విద్వేషాన్నే తమ పునాదులుగా చేసుకుని 'హిట్లర్ బ్రౌన్ షర్ట్స్', ఆర్ఎస్ఎస్ లాంటి మూకలు ఏర్పడ్డ ప్రతిసారీ అది నరమేధంతోనే ముగుస్తుంది. ఇదివరకు జరిగిన నరమేధాలన్నింటినీ మించిపోయేలా ఆర్ఎస్ఎస్ ముస్లింల నరమేధానికి పాల్పడే పరిస్థితి రాకముందే అంతర్జాతీయ సమాజం మేల్కొనాలి'' అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

ఫొటో సోర్స్, KarunaGopal1/twitter
ఇమ్రాన్ ఖాన్ కొంతకాలంగా ఆర్ఎస్‌ఎస్‌ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారు.
మోదీ ప్రభుత్వంపై ఇమ్రాన్ ఎప్పుడు విమర్శలు చేసినా, ఆర్ఎస్‌ఎస్ గురించి ప్రస్తావిస్తున్నారు.
జర్మనీలో గతంలో నియంత హిట్లర్ నేతృత్వంలో ఏర్పడిన నాజీ ప్రభుత్వంతో బీజేపీ ప్రభుత్వాన్ని పోల్చుతూ ఇమ్రాన్ విమర్శిస్తున్నారు.
''కశ్మీరీలకు వ్యతిరేకంగా ఫాసిస్టు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అణిచివేత, మానవ హక్కుల ఉల్లంఘనలను.. కశ్మీరీల ప్రతినిధిగా నేను బయటపెడతా. ఆర్ఎస్ఎస్ ఎజెండా నాజీ జర్మనీ నుంచి స్ఫూర్తి పొంది రూపొందించుకున్నదని పాశ్చాత్య దేశాలు అర్థం చేసుకోలేకపోతున్నాయి'' అని గత ఆగస్టు 30న ఆయన ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
గత ఆగస్టు 5న, ఆర్టికల్ 370ని సవరించడం ద్వారా జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని మోదీ ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే.
ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతూ, ఆర్ఎస్‌ఎస్‌పై ఇమ్రాన్ ఖాన్ విమర్శలు చేశారు.
ఐరాస సర్వసభ్య సమావేశంలో చేసిన ప్రసంగంలోనూ ఇమ్రాన్ ఖాన్.. ఆర్ఎస్‌ఎస్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోపణలకు దిగారు.
ఆర్ఎస్ఎస్ జాత్యహంకార, విద్వేష సంస్థ అని తీవ్రంగా మండిపడ్డారు.
''ఆర్ఎస్ఎస్ సంస్థలో మోదీ జీవితకాల సభ్యుడు. ఆ సంస్థ హిట్లర్, ముస్సోలినిల నుంచి స్ఫూర్తి పొందింది. ముస్లింలు, క్రైస్తవులను అణిచివేయడం వారి లక్ష్యం. వారి భావజాలం మహాత్మ గాంధీని కూడా బలి తీసుకుంది'' అని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి:
- కాందహార్ హైజాక్: 'హనీమూన్‌కు వెళ్లి బందీగా చిక్కారు'
- మీతో అధికంగా ఖర్చు చేయించే బిజినెస్ ట్రిక్... దాదాపు అందరూ ఈ 'వల'లో పడే ఉంటారు
- అయిదు మైళ్ల అవతల పొరుగు దేశంలో ఉన్న భార్యను కలవాలని పన్నెండేళ్లు తపించాడు.. చివరకు నదిలో కొట్టుకొచ్చిన ఆమె శవాన్ని చూశాడు
- ‘మా తల్లిదండ్రులు ఓ రహస్య గే పోర్న్ రాజ్యాన్ని నడిపారు'
- పాకిస్తాన్లో దైవదూషణ అభియోగాలపై లెక్చరర్‌కు మరణశిక్ష
- రాకాసి ఆకలి: తిండి దొరక్కపోతే తమని తామే తినేస్తారు
- హైదరాబాద్ నిజాం సొమ్ము కేసు: పాకిస్తాన్‌కు రూ.53.7 కోట్లు జరిమానా విధించిన బ్రిటన్ కోర్టు
- ఏపీకి రాజధాని విశాఖపట్నమా, అమరావతా.. ఒకటికి మించి రాజధానులున్న రాష్ట్రాల్లో వ్యవస్థలు ఎలా ఉన్నాయి
- పర్వేజ్ ముషరఫ్‌కు మరణ శిక్ష: 'మాజీ ఆర్మీ చీఫ్ ఎప్పటికీ దేశ ద్రోహి కాలేడు' - పాక్ మేజర్ జనరల్ గఫూర్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








