ఫిన్‌లాండ్: 34 ఏళ్లకే ప్రధాని పదవి చేపట్టనున్న సనా మారిన్.. ప్రపంచంలోనే అతి చిన్న వయసు ప్రధానిగా రికార్డు

సనా మారిన్

ఫొటో సోర్స్, Reuters

సనా మారిన్ వయసు 34 సంవత్సరాలు. ఫిన్‌లాండ్‌లో మహిళల సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వ ప్రధానమంత్రిగా ఆమె బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రపంచంలో ప్రధాని పదవి చేపట్టనున్న అతి చిన్న వయస్కురాలిగా చరిత్రకెక్కబోతున్నారు.

సోషల్ డెమొక్రటిక్ పార్టీకి చెందిన సనా మారిన్‌ ప్రస్తుతం రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. ప్రస్తుత ప్రధాని ఆంటి రిన్ తర్వాత ఆ పదవికి ఆమెను పార్టీ ఎంపిక చేసింది. సనా ఈ వారంలోనే ప్రధానిగా ప్రమాణం చేసే అవకాశం ఉంది.

మొత్తం మహిళల సారథ్యంలోనే గల ఐదు పార్టీల వామపక్ష కూటమికి సనా మారిన్ సారథ్యం వహిస్తారు.

పోస్టల్ సమ్మె విషయంలో సంకీర్ణంలోని ఒక పార్టీ విశ్వాసం కోల్పోవటంతో ఆంటి రిన్ ప్రధాని పదవి నుంచి వైదొలగారు.

సనా మారిన్ ప్రధానిగా బాధ్యతలు చేపడితే.. ప్రస్తుతం ప్రపంచంలో అతి తక్కువ వయసున్న ప్రధానమంత్రి అవుతారు. ప్రస్తుతం.. ఉక్రెయిన్ ప్రధానమంత్రి ఒలెక్సీ హాంచారుక్ వయసు 35 సంవత్సరాలు కాగా.. న్యూజీలాండ్ ప్రధానమంత్రి జసిందా ఆర్డెర్న్ వయసు 39 సంవత్సరాలు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

విశ్వాస తీర్మానాన్ని స్వల్ప ఆధిక్యంతో నెగ్గిన సనా మారిన్.. ''విశ్వాసాన్ని పునర్నిర్మించటానికి మనం చాలా కృషి చేయాల్సి ఉంది'' అని మీడియాతో పేర్కొన్నారు.

ఆమె తన వయసు గురించి అడిగిన ప్రశ్నలను కొట్టివేశారు. ''నేను ఎన్నడూ నా వయసు, లింగం గురించి ఆలోచించలేదు. నేను రాజకీయాల్లోకి వచ్చిన కారణాల గురించి ఆలోచిస్తాను. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్న కారణాల గురించి ఆలోచిస్తాను'' అని చెప్పారు.

ఫిన్‌లాండ్‌లో మూడో మహిళా ప్రధానమంత్రిగా కూడా సనా మారిన్ చరిత్రకెక్కనున్నారు. ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో సోషల్ డెమొక్రటిక్ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. కాబట్టి.. సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహించే ప్రధానమంత్రిని ఆ పార్టీ నియమించగలదు.

ఫిన్‌లాండ్ టీవీ చానల్ వైఎల్‌ఈ కథనం ప్రకారం.. సనా మారిన్ ఒంటరి తల్లి వద్ద పెరిగారు. ఆమె తన కుటుంబంలో విశ్వవిద్యాలయంలో చదివిన మొట్టమొదటి వ్యక్తి.

యూరోపియన్ యూనియన్ అధ్యక్ష పదవి కూడా ప్రస్తుతం ఫిన్‌లాండ్ నిర్వహిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)