బంగారు చెవిదుద్దును కోడిపుంజు మింగేసింది.. కోసి బయటకు తీశారు

ఫొటో సోర్స్, Ethiopian Press Agency/APA
బంగారాన్ని తినే ఓ కోడిపుంజు హంగామా సృష్టించింది.
ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలో హచాల్తు బెదిరీ అనే మహిళా వ్యాపారి తమ కోళ్లను అమ్మేందుకు మార్కెట్‌కు వెళ్లారు.
రద్దీగా ఉన్న ఈ మార్కెట్లో ఇంకో వ్యాపారికి చెందిన కోడిపుంజు యజమాని నుంచి తప్పించుకొంది. అది హచాల్తు బంగారు చెవిదుద్దును లాక్కొని మింగేసింది.
కోడిపుంజు చేసిన పనితో ఈ ఇద్దరు వ్యాపారుల మధ్య గొడవ మొదలైంది.
చివరకు పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. వ్యాపారులిద్దరికీ సర్దిచెప్పి వారు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
తన బంగారు ఆభరణాన్ని మింగేసిన కోడిపుంజును దాని యజమాని నుంచి 150 ఇథియోపియన్ బిర్లకు (భారత కరెన్సీ ప్రకారం 363 రూపాయలు) కొనుక్కొనేందుకు ఆ మహిళా వ్యాపారి అంగీకరించారు.

ఫొటో సోర్స్, Ethiopian Press Agency/APA
తన కోడిపుంజు విపరీత ప్రవర్తన కారణంగా, మార్కెట్ ధరైన 250 బిర్ల కన్నా తక్కువకే దానిని అమ్మేందుకు యజమాని ఒప్పుకొన్నారు.
కోడిపుంజును కోసి హచాల్తు తన చెవిదుద్దును తీసుకున్నారు.
ఒరోమియా రాష్ట్రం వోలిసో పట్టణంలో ఈ నెల 10న ఈ ఘటన జరిగింది. ఈ నెల 12 గురువారం ఇథియోపియా కొత్త సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో నాడు మార్కెట్ రద్దీగా ఉంది.
మార్కెట్లో కోడిపుంజు అతి ఉత్సాహంతో తిరిగిందని, తమ కస్టడీలో ఉన్నప్పుడు పసిడి రంగు వస్తువుల కోసం వెతుకులాడిందని పోలీసు అధికారి టెడిస్సీ బెడాడా బీబీసీతో చెప్పారు.
ఇథియోపియా క్యాలండర్ గ్రెగోరియన్ క్యాలండర్ కన్నా దాదాపు ఏడేళ్లు వెనక ఉంటుంది. దీని ప్రకారం ఇది 2012వ సంవత్సరం.
ఇవి కూడా చదవండి:
- ఐఫోన్ 11 కెమెరాలను చూస్తే భయమేస్తోందా... అయితే మీకు ట్రైపోఫోబియా ఉన్నట్లే
- మానవ నివాసయోగ్యమైన ఆ గ్రహం మీద తొలిసారిగా గుర్తించిన నీటి జాడలు
- పక్షులు ఢీకొని ఎగిరిన కాసేపటికే మొక్కజొన్న పొలంలో దిగిన విమానం
- బ్రిటిష్ కొలంబియా ప్రజలకు చుక్కలు చూపిస్తున్న నెమళ్లు
- నల్లమలలో యురేనియం సర్వే: "ఇక్కడ తవ్వితే మా ఊళ్లు నాశనమైపోతాయి.. మేం తవ్వనివ్వం"
- బంగారం కొనాలా.. అమ్మాలా? ధర ఎందుకు పెరుగుతోంది?
- తెలంగాణ బడ్జెట్ సైజు తగ్గడానికి కారణాలు ఇవే – అభిప్రాయం
- విశాఖపట్నం ఎంఎస్ఎంఈలపై ఆర్థికమాంద్యం ప్రభావం: ‘ఆర్డర్లు తగ్గాయి.. ఉద్యోగాలు ఊడుతున్నాయి’
- కమలాత్తాళ్: "ఒక్క రూపాయికే ఇడ్లీ.. నేను చనిపోయే దాకా అమ్ముతా.. ఎప్పటికీ ధర పెంచను"
- బ్యాంకుల విలీనం: సంక్షోభం నుంచి భారత ఆర్థిక వ్యవస్థను, బ్యాంకింగ్ వ్యవస్థను గట్టెక్కిస్తుందా? - అభిప్రాయం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








