బిజినెస్ ట్రిప్‌లో శృంగారం చేస్తూ ఉద్యోగి మరణం... ఇది ఇండస్ట్రియల్ యాక్సిడెంట్, పరిహారం చెల్లించాలన్న కోర్టు

ఫొటో సోర్స్, Getty Images
ఫ్రాన్స్‌లో బిజినెస్ ట్రిప్‌పై వెళ్లిన ఓ ఉద్యోగి అపరిచితురాలితో శృంగారంలో పాల్గొంటూ మృతి చెందారు. ఆ ఉద్యోగిని నియమించుకున్న సంస్థ ఆయన కుటుంబానికి పరిహారం చెల్లించాల్సిందేనని అక్కడి కోర్టు తీర్పు చెప్పింది.
ఘటన జరిగిన సమయంలో ఉద్యోగ సంబంధమైన విధుల్లో లేనందున ఆ ఉద్యోగికి పరిహారం ఎందుకు ఇవ్వాలని ఈ కేసులో సదరు సంస్థ కోర్టు ముందు వాదించింది.
అయితే , ఆ ఉద్యోగి మృతిని 'ఇండస్ట్రియల్ యాక్సిడెంట్'గానే పరిగణించాలని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.
జేవియర్ ఎక్స్ అనే వ్యక్తి మరణం విషయంలో పారిస్‌లోని ఓ కోర్టు ఈ తీర్పు చెప్పింది.
ఫ్రాన్స్‌లో రైల్వే సంబంధిత సేవలు అందించే టీఎస్‌ఓ అనే సంస్థలో ఆయన ఉద్యోగం చేసేవారు.

ఫొటో సోర్స్, Getty Images
2013లో జేవియర్ తన ఉద్యోగంలో భాగంగా బిజినెస్ ట్రిప్‌పై మధ్య ఫ్రాన్స్‌కు వెళ్లారు.
అక్కడ ఓ అపరిచిత మహిళను ఆయన కలిశారు. ఆమె ఉంటున్న హోటల్ గదిలోకి పోయారు.
అయితే, ఆమెతో శృంగారంలో పాల్గొంటున్న సమయంలో జేవియర్‌కు కార్డియాక్ అరెస్టు వచ్చింది. ఆయన అక్కడే మరణించారు.
ఈ ఘటనను 'వర్క్‌ప్లేస్ యాక్సిడెంట్'గా పరిగణిస్తూ జేవియర్ కుటుంబానికి పరిహారం ఇవ్వాలని ప్రభుత్వ బీమా సంస్థ టీఎస్‌ఓను ఆదేశించింది.
ఫ్రాన్స్ చట్టాల ప్రకారం బిజినెస్ ట్రిప్ సమయంలో ఉద్యోగికి జరిగే ఏ ప్రమాదానికైనా, సంస్థే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
ఆ సంస్థ దీనిపై కోర్టుకు వెళ్లింది. 'అపరిచితురాలితో వివాహేతర సంబంధం' పెట్టుకోవడం వల్ల జేవియర్ మరణించారని వాదించింది.
తినడం, స్నానం చేయడం లాగే సెక్స్ కూడా సాధారణ చర్యేనంటూ ప్రభుత్వ బీమా సంస్థ తమ నిర్ణయాన్ని సమర్థిస్తూ వాదనలు వినిపించింది.
కోర్టు కూడా ఈ వాదనతో ఏకీభవించింది.
బిజినెస్ ట్రిప్‌పై వెళ్లిన ఉద్యోగికి పరిస్థితులతో సంబంధం లేకుండా ఆ మొత్తం సమయమూ సామాజిక భద్రత వర్తిస్తుందందటూ తీర్పు చెప్పింది.
ఇవి కూడా చదవండి:
- సెక్స్ కోసం మహిళను మగాడు బలవంతం చేస్తే అది రేప్... మరి అదే పని ఒక మహిళ చేస్తే
- 9/11 దాడులను అమెరికా కావాలనే అడ్డుకోలేదా? కుట్ర సిద్ధాంతాలు ఏమంటున్నాయి, నివేదికలు ఏం చెబుతున్నాయి?
- మగాళ్ళ గర్భనిరోధక జెల్ ఎలా పని చేస్తుంది...
- బ్యాంకు ఖాతాలో 90 లక్షలు వచ్చాయి.. డ్రా చేశారు, ఖర్చుపెట్టేశారు.. ఆ తర్వాత...
- "చనిపోయిన భర్త జుట్టు, గోళ్లతో చేసే సూప్ తాగిస్తారు"
- ఈ పిల్ వేసుకుంటే కండోమ్ అవసరం ఉండదు.. కానీ అది మార్కెట్లోకి రావట్లేదు?
- యూరప్‌లో వందల సంఖ్యలో ఆడవాళ్లను చంపేస్తున్నారు.. ఎందుకు?
- కండలు పెంచే ప్రయత్నంలో సంతానోత్పత్తి సామర్థ్యం కోల్పోతున్నారు
- సెక్స్‌కు గుండెపోటుకు సంబంధముందా?
- సెక్స్ అడిక్షన్: కోరికలు ఎక్కువగా ఉంటే వ్యాధిగా భావించాలా
- శృంగారం వల్ల శరీరంలో చేరి ప్రాణాంతకంగా మారే 4 రకాల బ్యాక్టీరియాలు మీకు తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








