రఫేల్ నడాల్: US Open చాంపియన్, కెరియర్‌లో 19వ గ్రాండ్‌శ్లామ్

ఫొటో సోర్స్, Getty Images
రఫేల్ నడాల్ యూఎస్ ఓపెన్-2019 టైటిల్ విజేతగా నిలిచాడు.
హోరాహోరీగా ఐదు సెట్ల వరకూ జరిగిన మ్యాచ్‌లో రెండో ర్యాంక్‌లో ఉన్న నడాల్ ఐదో ర్యాంక్ ఆటగాడు డేనీల్ మెద్వెదేవ్‌ను 7-5, 6-3, 5-7, 4-6, 6-4 తేడాతో ఓడించాడు.
రష్యా ఆటగాడు మెద్వెదేవ్ మొదటిసారి ఒక గ్రాండ్ శ్లామ్ పోటీలో ఫైనల్ చేరుకున్నాడు. కానీ నడాల్ ముందు నిలవలేకపోయాడు.
ఇది నడాల్ కెరియర్‌లో 19వ గ్రాండ్ శ్లామ్ టైటిల్. అతడికి యూఎస్ ఓపెన్ విజేతగా నిలవడం ఇది నాలుగోసారి.
మరో టైటిల్ సాధిస్తే అగ్రస్థానంలో ఉన్న ఫెదరర్ రికార్డును నడాల్ సమం చేస్తాడు.
"నా టెన్నిస్ కెరియర్‌లోనే అత్యంత ఉద్విగ్న క్షణాల్లో ఇవి కూడా ఒకటి. అద్భుతమైన మ్యాచ్ ఇది. చాలా ఉత్సాహంగా జరిగింది" అని మ్యాచ్ అనంతరం నడాల్ వ్యాఖ్యానించాడు.
మ్యాచ్ పాయింట్ సాధించగానే నడాల్... కోర్టులో నేలపై పడి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.
"నేను రఫాను అభినందిస్తున్నా. 19 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గడం అంటే సాధారణ విషయం కాదు" అని రన్నరప్ మెద్వెదేవ్ అన్నాడు.
24000 మంది సామర్థ్యమున్న స్టేడియంలో ప్రేక్షకులంతా వీరిద్దరి ఆటకు ముగ్ధులైపోయారు. మ్యాచ్ ఐదో సెట్ వరకూ దారితీయడంతో ఏమైనా సంచలనం చోటుచేసుకుంటుందేమోనని వారంతా ఉద్విగ్నతతో మ్యాచ్ తిలకించారు.
ప్రస్తుతం స్విస్ ఆటగాడు రోజర్ ఫెదరర్ 20 టైటిళ్లతో అగ్రస్థానంలో ఉండగా నడాల్ రెండో స్థానంలో ఉన్నాడు. 16 టైటిళ్లు సాధించిన నొవాక్ జొకోవిచ్ మూడో స్థానంలో ఉన్నాడు.
ఇవి కూడా చదవండి:
- స్మగ్లర్లు ఈ చెక్‌పోస్టులను దాటి ముందుకెళ్లడం అసాధ్యం
- నగర జీవితం మీ ఆరోగ్యం, సంతోషం మీద ఎలా ప్రభావం చూపుతోంది?
- కడుపులోని పసికందునూ కబళిస్తోన్న కాలుష్యం
- ‘మా నాన్న ఒక గ్యాంగ్‌స్టర్... నా మూలాలు దాచేందుకు నా ముక్కునే మార్చేశాడు’
- పెరూలో బయటపడ్డ 500 ఏళ్లనాటి మృతదేహాలు.. ‘దేవతలను సంతృప్తి’ పరచడానికి 227 మంది పిల్లల సామూహిక బలి
- 6174: ఒక భారతీయ ఉపాధ్యాయుడు కనిపెట్టాడు.. డెబ్బై ఏళ్లుగా గణిత శాస్త్రజ్ఞులు ఆశ్చర్యపోతున్నారు
- అమరావతి నుంచి రాజధాని మారుస్తున్నారా? అక్కడేం జరుగుతోంది?
- కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత అమిత్ షా టార్గెట్ మావోయిస్టులేనా...
- ఇంటి అద్దె వద్దు.. సెక్స్ కావాలంటున్నారు
- సెక్స్ విప్లవానికి తెర లేచిందా...
- ఆర్ఎఫ్ఐడీ: రోజువారీ జీవితాల్లో భాగమైపోయిన ప్రచ్ఛన్న యుద్ధ కాలపు స్పై టెక్నాలజీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








