బాలిస్టిక్ క్షిపణి ఘజ్నవిని పరీక్షించిన పాకిస్తాన్.. 290 కిలోమీటర్ల లక్ష్యం ఛేదించగల ఘజ్నవి

ఫొటో సోర్స్, TWITTER @DG ISPR
పాకిస్తాన్ తన బాలిస్టిక్ క్షిపణి ఘజ్నవిని పరీక్షించింది. ఈ మేరకు పాకిస్తాన్ ఆర్మీ అధికార ప్రతినిధి దీన్ని ధ్రువీకరించారు.
దీనికి సంబంధించిన వీడియోను పాకిస్తాన్ ఆర్మీ ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ డీజీ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
'పాకిస్థాన్ గత రాత్రి ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఘజ్నవి బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. 290 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇది ఛేదించగలుగుతుంది. వివిధ రకాల వార్‌హెడ్లను మోసుకెళ్లే శక్తి సామర్థ్యాలు ఈ బాలిస్టిక్ క్షిపణికి ఉన్నాయి. ఇది విజయవంతం కావడంపై ప్రధాని ఇమ్రాన్‌ఖాన్, ఇతర అధికారులు అభినందనలు తెలిపారు' అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బాలిస్టిక్ క్షిపణి అంటే ఏమిటి
బాలిస్టిక్ క్షిపణులు పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి. ఇవి భారీ బాంబులను మోసుకెళ్లే సామర్థ్యాన్నికలిగి ఉంటాయి.
ఈ తరహా క్షిపణులను సాధారణంగా అణుబాంబులను ప్రయోగించేందుకు ఉపయోగిస్తారు. ఒక్కోసారి, సాధారణ బాంబులను మోసుకెళ్లేందుకూ వీటిని ఉపయోగిస్తారు.
లక్ష్యాన్ని నిర్దేశించి వీటిని ప్రయోగించిన తరువాత మళ్లీ గతిని మార్చడం సాధ్యం కాదు.
ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్ రాష్ట్ర విభజన నిర్ణయాల నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం దృష్టిలో భారత్‌ను దోషిగా నిలిపేందు పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలు ఇంతవరకు ఫలించలేదు.
ఐరాస భద్రతా మండలిలోని సభ్యదేశాలైన అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్‌తో పాటు పలు ఇస్లామిక్ దేశాలు ఈ విషయంలో భారత్‌కే మద్దతు పలికాయి.
కశ్మీర్ విషయంలో తీసుకున్న నిర్ణయాలు పూర్తిగా అంతర్గత వ్యవహారమని చెప్పాయి.
ఇవి కూడా చదవండి:
- కడుపులోని పసికందునూ కబళిస్తోన్న కాలుష్యం
- ‘మా నాన్న ఒక గ్యాంగ్‌స్టర్... నా మూలాలు దాచేందుకు నా ముక్కునే మార్చేశాడు’
- పెరూలో బయటపడ్డ 500 ఏళ్లనాటి మృతదేహాలు.. ‘దేవతలను సంతృప్తి’ పరచడానికి 227 మంది పిల్లల సామూహిక బలి
- 6174: ఒక భారతీయ ఉపాధ్యాయుడు కనిపెట్టాడు.. డెబ్బై ఏళ్లుగా గణిత శాస్త్రజ్ఞులు ఆశ్చర్యపోతున్నారు
- అమరావతి నుంచి రాజధాని మారుస్తున్నారా? అక్కడేం జరుగుతోంది?
- కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత అమిత్ షా టార్గెట్ మావోయిస్టులేనా...
- ఇంటి అద్దె వద్దు.. సెక్స్ కావాలంటున్నారు
- సెక్స్ విప్లవానికి తెర లేచిందా...
- ఆర్ఎఫ్ఐడీ: రోజువారీ జీవితాల్లో భాగమైపోయిన ప్రచ్ఛన్న యుద్ధ కాలపు స్పై టెక్నాలజీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








