Breast Feeding Week: ‘బిడ్డకు పాలివ్వడం తల్లికి చాయిస్ కాదు.. తప్పనిసరి. కానీ, ఇవ్వలేకపోతే ఏం చేయాలి?’

తల్లిపాలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, లూ యాంగ్
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్

నేను పిల్లల పెంపకానికి సంబంధించిన శిక్షణా తరగతులకు వెళ్లాను. అక్కడ కృత్రిమ స్తనాలతో ఆడుకున్నాను. నర్సింగ్ బ్రాలు కూడా తెచ్చుకున్నాను. ఇక బిడ్డకు పాలిచ్చేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాను.

కానీ, నాకు బిడ్డ పుట్టిన రెండు రోజుల తర్వాత కూడా తల్లిపాలు చుక్కలు చుక్కలుగానే వస్తోంది. తల్లిపాలు సమృద్ధిగా రావాలని కొవ్వు పదార్ధాలను తిన్నాను. లీటర్ల కొద్ది ఆవు పాలు తాగాను. ఇక మూడో రోజు నన్ను మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. నా బిడ్డేమో ఆకలితో ఉంది.

ఆసుపత్రిలో సిబ్బంది నాకు మెకానికల్ బ్రెస్ట్ పంప్ పెట్టారు. పాలకు బదలు రక్తం వచ్చింది. ''నాకేం జరిగింది? మాతృత్వానికి నా శరీరం సిద్ధంగా లేదా?'' అని అనుకున్నాను. బిడ్డ నా చనుమొనలను గట్టిగా చప్పరిస్తూ కొంచెం పాలు తీసుకోవడానికి చాలా కష్టపడుతోంది.

తల్లి పాలివ్వడం సహజంగా జరిగే ప్రక్రియ కాదని నాకు తెలుసు. చేస్తూ నేర్చుకోవాల్సిందే. ఇందులో ఎలాంటి అడ్డదారులు లేవు. ప్రయత్నిస్తూ మరింత మెరుగవ్వొచ్చు. కానీ, ఇదంత సులువు కాదు, చాలా నొప్పి కూడా ఉంటుంది.

తల్లిపాలు

ఫొటో సోర్స్, Getty Images

ఒంటరితనం

నా శరీరం వాస్తవాన్ని అర్థం చేసుకుంది. బిడ్డకు పాలిచ్చేందుకు సిద్ధమైంది. ఇక నేను కూడా ఎక్కువగా అన్ని రకాల ద్రవాలు తీసుకున్నాను. నిద్రపోడానికి కూడా నాకు చాలా తక్కువ సమయం ఉండేది. ఇక బయటకు వెళ్లడం చాలా అరుదైపోయింది. ''ఇరుగుపొరుగు ఏమనుకుంటారో... నా స్నేహితులు ఏమనుకుంటారో?" అని కూడా అనిపించేది.

బహిరంగ ప్రదేశాల్లో పాలుపట్టడం నాకు ఇష్టముండదు. అందుకే నాకు ఇష్టమైన ప్రదేశాలకు కూడా వెళ్లడం లేదు.

ప్రపంచంతో సంబంధం లేకుండా నా బిడ్డే లోకం అయిపోయింది. తన కోసం అర్థరాత్రుళ్లు కూడా లేచేదాన్ని.

తల్లి అయ్యాక బిడ్డ మీద ఎంత శ్రద్ధ తీసుకుంటామో మన మీద కూడ అంతే శ్రద్ధ తీసుకోవడం ముఖ్యమని తెలుసుకున్నాను.

తల్లిపాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అప్పుడే పుట్టిన పిల్లలు ఎక్కువగా నిద్రపోవడం, పాలుతాగడం చేస్తుంటారు.

ఆస్పత్రిలో నా బిడ్డకు మొదటిసారి పోతపాలు పట్టిన తర్వాత చాలా సేపు తను పడుకుంది. దీంతో అప్పటి నుంచి తను పడుకోవాలంటే తల్లిపాలకు బదులు పోతపాలు ఇవ్వడం మొదలుపెట్టాను.

కానీ, అలా పోతపాలు పట్టించడం నాకు ఇబ్బందిగా అనిపించింది. పోతపాల వల్ల నా బిడ్డ నాలుక తెల్లగా మారింది. చెడు వాసనతో అసహజంగా అనిపించింది. రుచికరమైన, పోషకాలున్న తల్లి పాలకు బదులుగా నా బిడ్డ జంక్ ఫుడ్ తింటున్నట్లు అనిపించింది.

ప్రతిసారీ నేను కొంత మందగించాను, ఆ అపరాధభావం నన్ను వెంటాడింది. ''నేను చాలా కష్టపడాల్సింది. అదనంగా నిద్రపోవాల్సిన అవసరం కూడా నాకు లేదు.''

ఆ అపరాధ భావం నా నుంచి తొలగిపోలేదని తెలుసు. కానీ, అది అన్యాయం అని అనిపిస్తుంది. తల్లిపాలు ఇవ్వడమా లేదా పోతపాలు ఇవ్వడమా అనేది ఎవరైనా సొంతంగా నిర్ణయించుకోవాలి.

తల్లిపాలు

ఫొటో సోర్స్, Getty Images

'సాయం తీసుకోవాలి'

తల్లి పాలు అనేది ఇప్పుడు కోట్ల రూపాయిల వ్యాపారం. డబ్బులుంటే ప్రతీ సమస్యకు ఇక్కడ చక్కటి పరిష్కార మార్గం దొరుకుతుంది.

నా సమస్య పరిష్కారం కోసం సూపర్ మార్కెట్‌కు వెళ్లినప్పుడు మైక్రోవేవబుల్ లావెండర్ బూబ్ వార్మర్స్ (తల్లిపాలను పట్టే పరికరం) నుంచి చనుమొనలను సున్నితంగా ఉంచే క్రీమ్‌ల వరకు చాలా ఉత్పత్తలు కనిపించాయి.

కానీ, నాకు అనిపించిన అత్యుత్తమ మార్గం మాత్రం... తల్లిపాలు ఇవ్వడానికి సంబంధించిన వర్క్‌షాప్‌కు వెళ్లడం. అక్కడ అనుభవం ఉన్నవారి నుంచి నిపుణుల నుంచి తల్లిపాలకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడం.

తల్లిపాలు

ఫొటో సోర్స్, Getty Images

తల్లిపాలు ఇవ్వడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారిలో నేను ఒంటరిని కానని అనుకుంటున్నా. బిడ్డకు పాలు ఇవ్వడం అనేది ఛాయిస్ కాదు, అది కచ్చితమైన విధి అని నా అభిప్రాయం. కానీ, పాలివ్వడంలో విఫలమవ్వడం, పాలివ్వడాన్ని ఇష్టపడకపోవడం వల్ల మాతృత్వానికి పనికిరారు అనడం మాత్రం సరైంది కాదు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)