ఇంగ్లండ్ Vs ఐర్లండ్: ప్రపంచకప్ గెలిచిన పిచ్‌పై 85 పరుగులకు ఆలౌట్

ఫొటో సోర్స్, Getty Images
సరిగ్గా పదిరోజుల కిందట వన్డే ప్రపంచకప్ గెలిచిన పిచ్‌పై కేవలం 85 పరుగులు చేసి ఆలౌట్ అయిన ఇంగ్లండ్ అప్రతిష్ఠను మూటకట్టుకుంది. లార్డ్స్ మైదానంలో ఐర్లండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో జో రూట్ సేన తొలి ఇన్నింగ్స్ 23.4 ఓవర్లకే ముగిసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టులో టాప్ స్కోరర్ డెన్లీ. అతడు 28 బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో 23 పరుగులు చేశాడు. ఆ తర్వాత బౌలర్లు స్టోన్ 19 పరుగులు, శామ్ కర్రన్ 18 పరుగులు చేశారు. బెయిర్‌స్టో, మొయీన్, క్రిస్ వోక్స్ ముగ్గురూ డకౌట్ అయ్యారు. జో రూట్ సహా మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ రెండంకెల స్కోరు చేరకుండానే పెవిలియన్ బాట పట్టారు.
ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్ ప్రారంభానికి మరో వారం రోజులు ఉండగా.. ఇంగ్లండ్ బ్యాటింగ్ లోపాలు ఈ ఇన్నింగ్స్‌తో బయటపడ్డాయి. లంచ్ సమయానికంటే ముందే ఇంగ్లండ్ ఆలౌట్ కావడం విశేషం.
ఐర్లండ్ బౌలర్లలో ముర్తాగ్ 9 ఓవర్లు వేసి 13 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అడైర్ 3 వికెట్లు, రన్కిన్ 2 వికెట్లు కూల్చారు.
9.5 ఓవర్లకు 36 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ మరో ఏడు పరుగులు జోడించే సరికి మొత్తంగా ఏడు వికెట్లు కోల్పోయింది. దీంతో 14.2 ఓవర్లకు స్కోరు 43 పరుగులకు 7 వికెట్లు.
గత మూడేళ్లలో ఇంగ్లండ్ జట్టు ఒకే సెషన్‌లో పది వికెట్లు కోల్పోవడం ఇది నాలుగోసారి.
కేవలం మూడో టెస్ట్ ఆడుతున్న ఐర్లండ్ జట్టు.. తన తొలి ఇన్నింగ్స్‌లో 207 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఒకానొక దశలో 132 పరుగులకు రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి పటిష్ఠంగా కనిపించిన ఐర్లండ్‌ను స్టువర్ట్ బ్రాడ్, స్టోన్, శామ్ కర్రన్‌లు తలా మూడు వికెట్లు తీసి దెబ్బకొట్టారు. మూడో వికెట్ నుంచి ఎనిమిదో వికెట్ వరకూ ఐర్లండ్ పది ఓవర్ల వ్యవధిలో 17 పరుగులు చేసి ఐదు వికెట్లు కోల్పోయింది.
ఇంగ్లండ్ జట్టు తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించినప్పటికీ ఒకే ఓవర్ ఆట సాధ్యమైంది. పరుగులేమీ చేయకుండా, వికెట్లు కోల్పోకుండా ఆ జట్టు తొలిరోజు ఆటలో రెండో ఇన్నింగ్స్ ముగించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇంగ్లండ్ కష్టాలు
దశాబ్దాల పాటు ఎదురుచూసిన ప్రపంచకప్ గెలుపొందడం ఇంగ్లండ్ క్రికెట్‌కు అత్యంత మధురమైన, చారిత్రాత్మక క్షణాలు. వన్డే క్రికెట్‌లో ప్రపంచ ఛాంపియన్లం తామేనని నిరూపించుకున్న ఇంగ్లండ్ టెస్టుల్లో మాత్రం ఎప్పట్లాగే ఇబ్బందులు పడుతోంది.
ప్రపంచకప్ గెలిచిన జట్టులోని ఐదుగురు ఆటగాళ్లు టెస్టు జట్టులో కూడా ఉన్నారు. ఇద్దరు ఆటగాళ్లు జోస్ బట్లర్, బెన్ స్టోక్‌లకు విశ్రాంతి ఇచ్చారు.
గత ఏడేళ్లుగా ఇంగ్లండ్ టెస్టు బ్యాటింగ్ ఏమంత గొప్పగా లేదు. ఈ కాలంలో పలుమార్లు బ్యాటింగ్ కుప్పకూలినప్పటికీ.. ఐర్లండ్‌తో తొలి ఇన్నింగ్స్ వాటన్నింటిలోకెల్లా అత్యంత బలహీనమైనదిగా కనిపించింది.
కాగా, ఎన్నో ఏళ్లుగా టెస్టు హోదా కోసం వేచి చూసిన ఐర్లండ్ ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే అది చారిత్రాత్మకం అవుతుంది.
ముర్తాగ్ బంతిపై పూర్తి నియంత్రణతో, స్వింగ్ చేస్తూ.. ఒకానొక దశలో 11 బంతుల్లో ఒక పరుగు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు కూల్చాడు.
ఐర్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో అత్యధికంగా బాల్‌బిర్నీ 55 పరుగులు చేశాడు.
- సొంత గడ్డపై టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొమ్మిదో తక్కువ స్కోరు ఇది
- బంతుల పరంగా చూస్తే ఇంగ్లండ్ ఆడిన 23.4 ఓవర్లు.. అత్యంత తక్కువ బంతులు ఆడిన ఐదో టెస్టు ఇన్నింగ్స్
- 2016 తర్వాత ఇంగ్లండ్ జట్టు ఒకే ఇన్నింగ్స్‌లో ఆలౌట్ కావడం ఇది నాలుగోసారి
- టిమ్ ముర్తాగ్ 13 పరుగులకు 5 వికెట్లు.. లార్డ్స్ మైదానంలో ఒక బౌలర్ అత్యంత వేగంగా తీసిన ఐదు వికెట్ల ప్రదర్శన
- స్టువర్ట్ బ్రాడ్ ఈ మ్యాచ్‌లో తీసిన మూడు వికెట్లతో మొత్తం 440 టెస్టు వికెట్లు కూల్చి టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఏడో బౌలర్ అయ్యాడు. దక్షిణాఫ్రికాకు చెందిన డేల్ స్టెయిన్‌ను వెనక్కు నెట్టాడు
ఇవి కూడా చదవండి:
- సూపర్ ఓవర్ నిబంధనలేంటి? బౌండరీలు కూడా టై అయితే విజేతను ఎలా నిర్ణయిస్తారు...
- క్రికెట్: భారత్‌లో బెట్టింగ్ చట్టబద్ధమైతే ఏమవుతుంది? బుకీలు ఏమంటున్నారు?
- ధోనీ కూడా రిటైర్మెంట్ విషయంలో సచిన్, కపిల్ దేవ్ల దారిలోనే వెళ్తున్నాడా...
- జింబాబ్వేను సస్పెండ్ చేసిన ఐసీసీ.. క్రికెట్‌లో రాజకీయ జోక్యంతో జాతీయ జట్టుపై నిషేధం
- క్రికెట్ స్పోర్ట్ కాదు.. క్రీడగా గుర్తించేందుకు నిరాకరించిన ప్రభుత్వం
- ఆపరేషన్ కమల్: కర్ణాటకలో ముగిసింది, తర్వాత టార్గెట్ మధ్యప్రదేశ్, రాజస్థాన్?
- అత్యధిక పోషక విలువలున్న 25 ఆహార పదార్థాలు ఇవే
- ప్రపంచబ్యాంకు బాటలోనే ఏఐఐబీ.. రాజధాని ప్రాజెక్టు నుంచి వెనక్కు
- కార్గిల్ యుద్ధం: జనరల్ ముషారఫ్ ఫోన్ ట్యాప్ చేసి పాక్ ఆర్మీ గుట్టు రట్టు చేసిన 'రా'
- నిస్సహాయ తల్లులను వ్యభిచారంలోకి నెడుతున్న సార్వత్రిక నగదు బదిలీ పథకం
- చంద్రయాన్-2 భూకక్ష్యలోకి చేరింది.. దీనివల్ల భారత్‌కు ఏం లభిస్తుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








