అమరావతి: ప్రపంచబ్యాంకు బాటలోనే ఏఐఐబీ.. రాజధాని ప్రాజెక్టు నుంచి తప్పుకున్న ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు

ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి నిర్మాణానికి నిధులు సమకూర్చే ప్రణాళికల నుంచి ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు (ఏఐఐబీ) తప్పుకుందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
అమరావతి ప్రాజెక్టుకు నిధులు కేటాయించే ఆలోచన విరమించుకున్నట్లు శుక్రవారం ప్రపంచ బ్యాంకు ఇప్పటికే ప్రకటించింది.
ఇప్పుడు.. చైనా సారథ్యంలో నడిచే ఆసియా బ్యాంకు కూడా ప్రపంచబ్యాంకు బాటలోనే నిర్ణయం తీసుకుంది.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
ప్రపంచ బ్యాంకు ఎందుకు వెనక్కు తగ్గింది
అమరావతికి రుణం విషయంలో భారత ప్రభుత్వమే తన విజ్ఞప్తిని వెనక్కు తీసుకుందని ప్రపంచ బ్యాంకు ప్రతినిధి సుదీప్ ముజుందార్ అప్పుడు బీబీసీతో చెప్పారు.
"ప్రభుత్వ (భారత) నిర్ణయంతో దీన్ని పక్కన పెట్టాలని ప్రపంచ బ్యాంకు బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ నిర్ణయం తీసుకున్నారు" అన్నారు.
"ప్రపంచ బ్యాంకు లేనిపోని చికాకులు కలిగిస్తోందనే భారత ప్రభుత్వం రుణ దరఖాస్తును వెనక్కు తీసుకుంది" అని భారత ఆర్థిక వ్యవహారాల శాఖలోని ఒక ఉన్నతాధికారి అప్పుడు పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Ravisankar Lingutla
ఏఐఐబీ ఏం చెప్తోంది
''అమరావతి సుస్థిర మౌలిక సదుపాయాలు మరియు సంస్థాగత అభివృద్ధి ప్రాజెక్టుకు నిధులు సమకూర్చే అంశాన్ని ఏఐఐబీ ఇక పరిగణలోకి తీసుకోవట్లేదు'' అని బ్యాంకు అధికార ప్రతినిధి లారెల్ ఆస్ట్‌ఫీల్డ్ బీబీసీతెలుగుకు తెలిపారు.
అయితే.. ''ఏఐఐబీ అనేది నాకు తెలిసినంతవరకూ స్వతంత్ర సంస్థ కాదు. ప్రపంచ బ్యాంకు, ఏఐబీబీ కలిసి అమరావతికి నిధులు సమకూరుస్తున్నాయి. కాబట్టి.. ప్రపంచ బ్యాంకు ఈ ప్రాజెక్టును వదిలేస్తే.. సహజంగా ఏఐఐబీ కూడా అదే బాటలో నడుస్తుంది. అందుకు కాస్త సమయం పడుతుంది.. అంతే'' అని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ అధికారి ఒకరు బీబీసీ ప్రతినిధితో పేర్కొన్నారు.

మరొక సీనియర్ అధికారి కూడా ఇదే విషయం చెప్పారు. ''అమరావతి ప్రాజెక్టు.. ప్రపంచ బ్యాంకు, ఏఐఐబీ ఉమ్మడిగా నిధులు సమకూరుస్తున్న ప్రాజెక్టు. ప్రపంచ బ్యాంకు గురించి మేం ఏం చెప్పామో.. అదే యధాతథంగా ఏఐఐబీకీ వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉంటాయి. తీవ్ర ప్రతికూల పరిణామాలు చుట్టుముట్టి ఉన్న ఈ ప్రాజెక్టు ఒక్కదాని నుంచే అవి తప్పుకుంటున్నాయి'' అని వివరించారు.
అమరావతి నగర నిర్మాణ ప్రాజెక్టుకు రుణం కోసం చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఏపీ ప్రభుత్వం తరపున రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) ప్రపంచ బ్యాంకుకు దరఖాస్తు పంపింది.

ఫొటో సోర్స్, AP CRDA
ఏపీ ప్రభుత్వం ఎన్ని నిధులు కోరింది?
మొత్తం ప్రాజెక్టు వ్యయం 715 మిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 4,923 కోట్లు). ఇందులో 300 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2,065 కోట్లు) రుణంగా ఇవ్వాలని ప్రపంచ బ్యాంకును ఏపీ ప్రబుత్వం కోరింది.
మిగతా నిధులు ఏఐఐబీ నుంచి వస్తాయని ప్రభుత్వం ఆశించింది.
అయితే.. అమరావతి ప్రాజెక్టును విరమించుకుంటున్నట్టు ప్రపంచబ్యాంకు నిర్ణయం తీసుకోవటంతో తాజాగా ఏఐఐబీ కూడా అదే నిర్ణయం ప్రకటించింది.
ప్రపంచ బ్యాంకు, ఏఐఐబీ రుణ ఉపసంహరణపై రాష్ట్ర ప్రభుత్వ స్పందన
ప్రపంచ బ్యాంకు, ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడుల బ్యాంకు అమరావతికి రుణ ఉప సంహరణ ప్రకటనలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అమరావతి కోసం ప్రతిపాదిత రుణ ప్రాజెక్టులో ప్రపంచ బ్యాంకుతో పాటు ఏఐఐబీ కూడా ఒక భాగస్వామి అని, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రెండింటిలోనూ వర్తిస్తుందని తెలిపింది. కానీ, ఏఐఐబీని, ప్రపంచ బ్యాంకును విడివిడిగా చూపిస్తూ మరోసారి ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతీయడానికి ప్రయత్నాలు చేశారంటూ ఖండించింది.
ఏఐఐబీ రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులు మంజూరు చేసిందని, అయితే గత ప్రభుత్వం ఈ నిధులను సద్వినియోగం చేసుకోవడంలో, పనులను వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో విఫలమైందని ఆరోపించింది. ఈ ప్రాజెక్టులను వేగంగా అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది.
ఏఐఐబీ ఉపాధ్యక్షుడితో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు మాట్లాడారని, అన్ని రకాల సహాయ సహకారాలు కొనసాగిస్తామంటూ హామీ ఇచ్చారని ప్రభుత్వం వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
- చంద్రబాబు సాధిస్తారా? జగన్ అస్త్రంగా మలుచుకుంటారా?
- అమరావతికి రుణంపై వచ్చే వారం 'ఆసియా' బ్యాంకు నిర్ణయం
- అమరావతి: ఎన్జీటీ తీర్పులో ఏముంది?
- అమరావతి: రైతులేమనుకుంటున్నారు?
- అమరావతి అసెంబ్లీ కోసం సినిమా సెట్టింగ్!
- అమరావతి రైతుల సింగపూర్ యాత్రతో ఉపయోగం ఎంత?
- కార్గిల్ యుద్ధం: జనరల్ ముషారఫ్ ఫోన్ ట్యాప్ చేసి పాక్ ఆర్మీ గుట్టు రట్టు చేసిన 'రా'
- చంద్రయాన్-2 భూకక్ష్యలోకి చేరింది.. దీనివల్ల భారత్‌కు ఏం లభిస్తుంది?
- విమానం ఎగిరేముందు చక్రాల చాటున దాక్కున్నాడు, పైనుంచి కిందపడి మరణించాడు
- అక్కడ గ్రహాంతర జీవులున్నాయా? అందుకే ఎవరూ రావద్దని అమెరికా హెచ్చరించిందా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









