INDvsNZ సెమీఫైనల్: ఆట సాగేనా.. మాంచెస్టర్‌లో వాతావరణం ఏం చెబుతోంది

ఫొటో సోర్స్, Reuters
భారత్, న్యూజీలాండ్ మధ్య వరల్డ్ కప్ 2019 సెమీఫైనల్ మిగిలిన ఆట వర్షం వల్ల ఇప్పుడు రిజర్వ్ డే అంటే బుధవారం జరగనుంది.
మంగళవారం న్యూజీలాండ్ మొదట బ్యాటింగ్ చేసి 46.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. కానీ అప్పుడు వర్షం రావడంతో మ్యాచ్ నిలిపివేయాల్సి వచ్చింది.
భారీ వర్షం వల్ల అవుట్‌ఫీల్డ్ తడిగా మారడంతో అంపైర్లు మ్యాచ్‌ను రిజర్వ్ డే రోజున కొనసాగించాలని నిర్ణయించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఇప్పుడు వర్షం వల్ల మరింత అంతరాయం లేకపోతే న్యూజీలాండ్ రిజర్వ్ డే రోజున మిగతా 3.5 ఓవర్లు బ్యాటింగ్ చేస్తుంది. తర్వాత భారత్ బ్యాటింగ్ చేస్తుంది.
మ్యాచ్‌లో మళ్లీ వర్షం పడితే మ్యాచ్ ఫలితం తేలడానికి భారత్ కనీసం 20 ఓవర్లు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, TWITTER
బుధవారం వాతావరణం ఎలా ఉంది
అందుకే ఇప్పుడు, అసలు బుధవారం మాంచెస్టర్ వాతావరణం ఎలా ఉంటుందనే ప్రశ్న వస్తోంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
బ్రిటన్ కాలమానం ప్రకారం మ్యాచ్ బుధవారం ఉదయం 10.30 (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3)కు ప్రారంభం అవుతుంది. బ్రిటన్ వాతావరణ శాఖ అంచనాల ప్రకారం బుధవారం మాంచెస్టర్‌లో మబ్బులు కమ్మి ఉండే అవకాశం ఉంది. ఆగి ఆగి వర్షం పడుతూ ఉండచ్చు.

ఫొటో సోర్స్, UK METOFFICE
అయితే ఇక్కడ ఊరట ఇచ్చే విషయం ఒకటుంది. బుధవారం మాంచెస్టర్‌లో వాతావరణం మంగళవారంతో పోలిస్తే కాస్త మెరుగ్గా ఉండచ్చు.
అయినా ఇక్కడ మంగళవారం రాత్రి 12 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం అయ్యేవరకూ 5 నుంచి 10 శాతం వర్షం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
అటు బీబీసీ వెదర్ రిపోర్ట్ ప్రకారం మంగళవారం రాత్రి మాంచెస్టర్‌లో మబ్బులు కమ్మేసి ఉంటాయి. బుధవారం పొద్దెక్కిన తర్వాత నుంచి మధ్యాహ్నం వరకూ తేలికపాటి జల్లులు పడవచ్చు. మ్యాచ్‌కు వర్షం సమస్య ఉంటుంది. కానీ మంగళవారంతో పోలిస్తే వాతావరణం కాస్త వెచ్చగా ఉంటుంది. ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉండచ్చు.

ఇప్పటివరకూ కివీస్ ఇన్నింగ్స్ ఎలా సాగింది?
మంగళవారం మ్యాచ్ ఆగినపుడు రాస్ టేలర్ 67, టామ్ లాథమ్ 3 రన్స్ చేసి నాటౌట్‌గా ఉన్నారు. న్యూజీలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ సెమీఫైనల్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించాడు.
మ్యాచ్ పూర్తి కావాలంటే రిజర్వ్ డే రోజున భారత్ కనీసం 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయాలి.
ఒకవేళ రిజర్వ్ డే రోజు కూడా వర్షం పడి, మ్యాచ్ పూర్తి కాకపోతే భారత్ ఫైనల్ చేరుతుంది. ఎందుకంటే లీగ్ రౌండ్ పాయింట్ల పట్టికలో న్యూజీలాండ్ కంటే భారత్ చాలా పైనుంది. టేబుల్‌లో భారత్ టాప్‌లో ఉంటే న్యూజీలాండ్ నాలుగో స్థానంలో ఉంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
చెలరేగిన భారత బౌలర్లు
మంగళవారం కూడా మాంచెస్టర్‌లో మేఘాలు కమ్మి కనిపించాయి. దాంతో టాస్ గెలిచిన న్యూజీలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ తీసుకున్నాడు. కానీ భారత బౌలర్లు ప్రారంభం నుంచి మ్యాచ్‌పై పట్టు కొనసాగించారు.
మొదటి రెండు ఓవర్లలో జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ మెయిడిన్ వేశారు. న్యూజీలాండ్ ఇన్నింగ్స్ మొదటి పరుగు 17వ బంతికి వచ్చింది.
కానీ బుమ్రా తన తర్వాత ఓవర్ మూడో బంతికే మార్టిన్ గప్తిల్‌ను ఔట్ చేశాడు. విరాట్ కోహ్లీ పట్టిన క్యాచ్‌తో కివీస్ తొలి వికెట్ కోల్పోయింది.
2015 ప్రపంచకప్‌లో డబుల్ సెంచరీ చేసిన గప్తిల్, ఈ టోర్నీలో ఇప్పటివరకూ కేవలం 167 పరుగులు( 73 నాటౌట్, 25, 0, 35, 0, 5, 20, 8, 1) చేశాడు.
ఆ తర్వాత న్యూజీలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ క్రీజులోకి వచ్చాడు. కానీ భారత బౌలింగ్, ఫీల్డింగ్ వారిని పరుగులు చేయకుండా అడ్డుకట్ట వేసింది.
మొదటి ఆరు ఓవర్లలో న్యూజీలాండ్ 8 పరుగులు మాత్రమే చేయగలిగింది.
భారత బౌలర్లు ఏ స్థాయిలో చెలరేగారంటే న్యూజీలాండ్‌కు మొదటి బౌండరీ 8వ ఓవర్ చివరి బంతికి వచ్చింది. 10వ ఓవర్ల మొదటి పవర్ ప్లేలో న్యూజీలాండ్ 27 పరుగులే చేసింది.
ఈ టోర్నీలో మొదటి పవర్ ప్లేలో బౌలింగ్ చేసిన అన్ని టీమ్స్‌తో పోలిస్తే భారత బౌలర్లది అత్యుత్తమ ప్రదర్శన.
దీనికి ముందు ఇంగ్లండ్‌తో ఆడిన మ్యాచ్‌లో మొదటి పది ఓవర్లలో భారత్ చేసిన 28 పరుగులు ఈ టోర్నీలో తొలి పవర్ ప్లేలో అత్యల్ప స్కోరు. ఇప్పుడు భారత బౌలర్లే ఆ రికార్డును సరిచేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
విలియమ్సన్ కెప్టెన్ ఇన్నింగ్స్
తర్వాత పది ఓవర్లలో కూడా పరుగుల జోరు పెరగలేదు. 11-20 ఓవర్లలో 46 పరుగులే చేశారు. ఆ మధ్యలో రవీంద్ర జడేజా 18వ ఓవర్లో నికొల్స్(28)ని బౌల్డ్ చేశాడు.
అయితే విలియమ్సన్, టేలర్ మూడో వికెట్‌కు 65 రన్స్ భాగస్వామ్యం అందించారు. హాఫ్ సెంచరీ చేసిన విలియమ్సన్(67) తర్వాత చహల్ బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.
41వ ఓవర్ చివరి బంతికి హార్దిక్ పాండ్యా జిమ్మీ నీషామ్(12)ను పెవిలియన్ పంపితే, 45వ ఓవర్లో కొలిన్ డి గ్రాండ్‌హోమ్(16)ను భువనేశ్వర్ ఔట్ చేశాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
5 వికెట్ల నష్టానికి 211 పరుగుల స్కోరు దగ్గర వర్షంతో ఆట ఆగిపోయింది. బుధవారం మ్యాచ్ కొనసాగితే టేలర్(67), టామ్ లాథమ్(3) బ్యాటింగ్ కొనసాగిస్తారు.
భారత బౌలర్లలో ఐదుగురు బౌలర్లూ తలో వికెట్ పడగొట్టారు. బుమ్రా, భువనేశ్వర్‌కు రెండేసి ఓవర్లు ఇంకా మిగిలున్నాయి.

ఫొటో సోర్స్, TWITTER
వర్షం వల్ల మ్యాచ్ రద్దైతే...
ఇప్పుడు వర్షం వల్ల మ్యాచ్ పూర్తిగా రద్దైతే భారత్ బ్యాటింగ్ చేయకుండానే ఫైనల్ చేరుతుంది. ఎందుకంటే లీగ్ రౌండ్‌లో భారత్ న్యూజీలాండ్ కంటే ఎక్కువ పాయింట్లు సాధించింది.
పాయింట్ల పట్టికలో భారత్‌కు 15, న్యూజీలాండ్‌కు 11 పాయింట్లు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- బ్రిటిష్ పాలకులు మొదటి భారత క్రికెట్ జట్టును ఎలా తయారు చేశారు...
- క్రికెట్ బంతిని ఎలా తయారు చేస్తారో చూశారా
- సరిగ్గా 36 ఏళ్ల క్రితం భారత్ ప్రపంచ కప్ గెలిచిన రోజున దిల్లీలో ఏం జరిగింది..
- విరాట్ కోహ్లీ: "ఇదేం మైదానం, బౌండరీ అంత దగ్గరా..."
- క్రికెట్ ప్రపంచ కప్ 2019: ఆ ఒక్క బాల్‌తో క్రికెట్ బ్రిటిష్ పాలకులు మొదటి భారత క్రికెట్ జట్టును ఎలా తయారు చేశారు... రూల్స్ మారిపోయాయి
- క్రికెట్ ప్రపంచకప్ 2019: మీరు తెలుసుకోవాల్సిన 12 విషయాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)