AUSvSA ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా విజయం

ఫొటో సోర్స్, Getty Images
క్రికెట్ ప్రపంచకప్ 2019 చివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. దక్షిణాఫ్రికా ఇప్పటికే సెమీస్ అవకాశాలు కోల్పోవడంతో ఆ జట్టుకు ఈ విజయం కొత్త అవకాశాలేమీ అందివ్వలేకపోయింది.
కాగా ఈ మ్యాచ్‌లో ఓటమితో ఆస్ట్రేలియా పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పరిమితమైంది. మూడోస్థానంలో ఉన్న ఇంగ్లండ్‌తో తలపడనుంది.
శనివారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 10 పరుగుల తేడాతో ఆసీస్‌పై నెగ్గింది. 326 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. 49.5 ఓవర్లలో 315 పరుగులకు ఆలౌటైంది.
వార్నర్ (122), కేరీ (85) పోరాడినా ఫలితం లేకపోయింది.
అంతకుముందు దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేసింది.
డుప్లెసిస్ (100), వాండర్‌డసెన్ (95) రాణించడంతో దక్షిణాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది.
ఒక్కసారి మాత్రమే..
ఈ మ్యాచ్ సహా ఆస్ట్రేలియా - దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన గత 9 వన్డేల్లో దక్షిణాఫ్రికా 8 గెలిచింది. ఒక్క వన్డేలో మాత్రమే ఆస్ట్రేలియా గెలిచింది.
ఆస్ట్రేలియా ఓటమి పాలవడంతో భారత్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి వచ్చింది. శ్రీలంకపై భారత్ గెలవడంతో 15 పాయింట్లతో పట్టికలో పైకి ఎగబాకింది.
లీగ్ మ్యాచ్లన్నీ ముగియడంతో సెమీస్ మ్యాచ్‌లు ఎవరు ఎవరితో ఆడుతారన్నది ఖరారైంది.
భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి సెమీ ఫైనల్.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య రెండో సెమీ ఫైనల్ జరగనున్నాయి.
ఇవి కూడా చదవండి:
- సెమీఫైనల్స్ ఆడే ముందు భారత్ ఏం చేయాలి...
- బ్రిటిష్ పాలకులు మొదటి భారత క్రికెట్ జట్టును ఎలా తయారు చేశారు...
- 1983 వరల్డ్ కప్ సెమీఫైనల్: స్టంప్ తీసి ప్రేక్షకులను బెదిరించిన అంపైర్
- రిహార్సల్స్ చేయిస్తున్న ట్రైయినర్‌ను చంపేసిన సర్కస్ పులులు
- ధోనీ లేని భారత జట్టును ఊహించగలరా...
- జీరో బడ్జెట్ వ్యవసాయం అంటే ఏమిటి? కేంద్ర ఆర్ధికమంత్రి ఏపీని ఎందుకు ప్రస్తావించారు...
- 'ఓ బేబీ': 70 ఏళ్ల వృద్ధురాలు 24 ఏళ్ల యువతిగా మారితే...
- చైనా ముస్లింలు: పిల్లలను కుటుంబాలకు దూరం చేస్తున్నారు
- కశ్మీర్ విలీనం: ఇది నేటికీ రగులుతున్న సమస్య
- హైదరాబాద్ పేరెత్తకుంటే.. కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు వదిలేస్తామని పటేల్ చెప్పింది నిజమేనా?
- కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చిన 'ఆర్టికల్ 370' రద్దు సాధ్యమేనా?
- పాకిస్తాన్ 'దుర్మార్గమైన అజెండా': చర్చల రద్దుకు దారి తీసిన ఈ స్టాంపులపై ఏముంది?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








