INDvSL రోహిత్ శర్మ, రాహుల్ సెంచరీలు... శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో భారత్ విజయం

ఫొటో సోర్స్, Getty Images
టీమిండియా లీగ్ దశలో చివరి సమరంలో శ్రీలంకపై విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 264 పరుగులు చేయగా.. 265 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 43.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.
విరాట్ కోహ్లీ (31 బంతుల్లో మూడు ఫోర్లతో 34 పరుగులు), హార్దిక్ పాండ్యా (4 బంతుల్లో ఒక ఫోర్ సాయంతో 7 పరుగులు) నాటౌట్‌గా నిలిచారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
శ్రీలంకపై విజయంతో భారత జట్టు 15 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
శనివారమే జరిగిన మరో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోవడంతో భారత్ ఈనెల 9వ తేదీ మంగళవారం మాంచెస్టర్ వేదికగా జరిగే తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజీలాండ్‌తో తలపడనుంది.
మ్యాచ్ విశేషాలు, రికార్డులు
- ఒకే ప్రపంచ కప్‌లో ఐదు సెంచరీలు సాధించిన మొదటి బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ
- భారత్ తరపున ప్రపంచ కప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ (6 సెంచరీలు) సరసన రోహిత్ శర్మ చేరాడు
- రోహిత్ శర్మ ఇప్పటికి ఈ ప్రపంచ కప్‌లో 647 పరుగులు సాధించి, ఒక ప్రపంచకప్‌తో అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 673 పరుగులతో సచిన్ టెండూల్కర్ (2003 ప్రపంచకప్‌లో) మొదటి స్థానంలో ఉన్నాడు
- తొలి వికెట్ భాగస్వామ్యానికి రాహుల్, రోహిత్ శర్మ జోడించిన 189 పరుగులు ఈ ప్రపంచకప్‌లో ఇప్పటి వరకూ అత్యధిక మొదటి వికెట్ భాగస్వామ్యం
- జస్‌ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీశాడు. భారత్ తరపున వన్డేల్లో వేగంగా 100 వికెట్లు తీసిన ఆటగాడు
- ఈ ప్రపంచ కప్‌లో ఆసియా ఖండం నుంచి ఐదు జట్లు పోటీ పడగా.. గ్రూప్ మ్యాచ్‌లు ముగిసే సరికి బరిలో ఉన్న ఏకైక జట్టు భారత్
- శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మలింగకు ఇదే ఆఖరి వన్డే మ్యాచ్. ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్ మలింగ. మెక్‌గ్రాత్, ముత్తయ్య మురళీధరన్ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
మూడో వికెట్.. శ్రీలంక రివ్యూ
41.6 ఓవర్ల వద్ద ఉదాన వేసిన బంతి వికెట్ల ముందు రిషబ్ పంత్(నాలుగు బంతుల్లో ఒక ఫోర్ సహాయంతో నాలుగు పరుగులు) కు తగిలింది. శ్రీలంక ఎల్బీడబ్ల్యూ అప్పీల్ చేయగా.. అంపైర్ నాటౌట్ ఇచ్చారు. అయితే శ్రీలంక రివ్యూ కోరగా.. థర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చారు.
రెండో వికెట్
40.6 ఓవర్ల వద్ద మలింగ్ బౌలింగ్‌లో కీపర్ పెరీరాకు క్యాచ్ ఇచ్చి కేఎల్ రాహుల్ (118 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 111 పరుగులు) ఔటయ్యాడు.
40 ఓవర్లలో 234/1
40 ఓవర్లలో భారత జట్టు ఒక వికెట్ నష్టానికి 234 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (102 పరుగులు), విరాట్ కోహ్లీ (24 పరుగులు) క్రీజులో ఉన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
కేఎల్ రాహుల్ సెంచరీ
38.1 ఓవర్లకు మలింగ్ బౌలింగ్‌లో థర్డ్ మ్యాన్ దిశగా బంతిని కొట్టి ఒక పరుగుతో కేఎల్ రాహుల్ సెంచరీ (109 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్‌తో) పూర్తి చేశాడు.
35 ఓవర్లలో 221/1
35 ఓవర్లలో భారత జట్టు ఒక వికెట్ నష్టానికి 221 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (91 పరుగులు), విరాట్ కోహ్లీ (12 పరుగులు) క్రీజులో ఉన్నారు.
మొదటి వికెట్
30.1 ఓవర్ల వద్ద రజిత బౌలింగ్‌లో రోహిత్ శర్మ సెంచరీ (94 బంతుల్లో 14 ఫోర్లు, రెండు సిక్స్‌ల సహాయంతో 103 పరుగులు) ఔటయ్యాడు.
తొలి వికెట్‌కు రాహుల్, రోహిత్ శర్మ 189 పరుగులు జోడించారు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటి వరకూ ఇదే అత్యధిక మొదటి వికెట్ భాగస్వామ్యం.
30 ఓవర్లకు 189/0
30 ఓవర్లలో భారత జట్టు వికెట్ నష్టపోకుండా 189 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (81 పరుగులు), రోహిత్ శర్మ (103 పరుగులు) క్రీజులో ఉన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
రోహిత్ శర్మ రికార్డు సెంచరీ
28.6 ఓవర్ వద్ద రజిత బౌలింగ్‌లో ఫోర్ కొట్టి రోహిత్ శర్మ సెంచరీ (92 బంతుల్లో 14 ఫోర్లు, రెండు సిక్స్‌ల సహాయంతో 102 పరుగులు) సెంచరీ చేశాడు.
ఒకే ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ.
25 ఓవర్లకు 152/0
25 ఓవర్లలో భారత జట్టు వికెట్ నష్టపోకుండా 152 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (68 పరుగులు), రోహిత్ శర్మ (81పరుగులు) క్రీజులో ఉన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
కేఎల్ రాహుల్ అర్థ సెంచరీ
22.3 ఓవర్ల వద్ద డి సిల్వ ఓవర్‌లో ఫోర్ కొట్టి కేఎల్ రాహుల్ (67 బంతుల్లో ఐదు ఫోర్ల సహాయంతో) అర్థ సెంచరీ చేశాడు.
20 ఓవర్లకు 109/0
20 ఓవర్లలో భారత జట్టు వికెట్ నష్టపోకుండా 109 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (42 పరుగులు), రోహిత్ శర్మ (66 పరుగులు) క్రీజులో ఉన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7

పోస్ట్ of X ముగిసింది, 8
రోహిత్ శర్మ అర్థ సెంచరీ
16.1 ఓవర్ల వద్ద డిసిల్వ బౌలింగ్‌లో సిక్స్‌తో రోహిత్ శర్మ (48 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఒక సిక్స్‌తో) అర్థ సెంచరీ చేశాడు.
15 ఓవర్లకు 81/0
15 ఓవర్లలో భారత జట్టు వికెట్ నష్టపోకుండా 81 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (35 పరుగులు), రోహిత్ శర్మ (45 పరుగులు) క్రీజులో ఉన్నారు.

ఫొటో సోర్స్, AFP/Getty Images
10 ఓవర్లకు 59/0
10 ఓవర్లకు భారత్ వికెట్ నష్టపోకుండా 59 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (27 పరుగులు), రోహిత్ శర్మ (31 పరుగులు) క్రీజులో ఉన్నారు.
5 ఓవర్లకు 39/0
ఐదు ఓవర్లకు భారత్ వికెట్ నష్టపోకుండా 39 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (18 పరుగులు), రోహిత్ శర్మ (20 పరుగులు) క్రీజులో ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
శ్రీలంక బ్యాటింగ్
50 ఓవర్లలో శ్రీలంక ఏడు వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది.
ధనంజయ డి సిల్వా (36 బంతుల్లో ఒక ఫోర్ సహాయంతో 29 పరుగులు), ఇరుసు ఉదాన (ఒక బంతికి ఒక పరుగు) నాటౌట్‌గా నిలిచారు.
భారత బౌలర్లలో బుమ్రా పది ఓవర్లలో 37 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ తలా పది ఓవర్లు వేసి, తలొక వికెట్ తీశారు.
ధోనీ మూడు క్యాచ్‌లు పట్టి, ఒక స్టంపింగ్ చేశాడు.
ఏడో వికెట్
49.2 ఓవర్ల వద్ద తిసార పెరీరా (2 బంతుల్లో రెండు పరుగులు) భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో పాండ్యాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
ఆరో వికెట్
48.2 ఓవర్ల వద్ద ఏంజెలో మాథ్యూస్ (128 బంతుల్లో పది ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 113 పరుగులు) బుమ్రా బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
45 ఓవర్లలో 233/5
45 ఓవర్లలో శ్రీలంక ఐదు వికెట్లు కోల్పోయి 233 పరుగులు చేసింది. ఏంజెలో మాథ్యూస్ (104 పరుగులు), ధనంజయ డి సిల్వా (14 పరుగులు) క్రీజులో ఉన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 9
మాథ్యూస్ సెంచరీ
43.5 ఓవర్ల వద్ద పాండ్యా బౌలింగ్‌లో ఫోర్ కొట్టి మాథ్యూస్ సెంచరీ (115 బంతుల్లో 9 ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో) పూర్తి చేశాడు.
ఏంజెలో మాథ్యూస్ వన్డేల్లో మూడు సెంచరీలు చేయగా.. ఆ మూడూ భారత్‌పైనే కావడం విశేషం.
40 ఓవర్లలో 200/5
40 ఓవర్లలో శ్రీలంక ఐదు వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. ఏంజెలో మాథ్యూస్ (85 పరుగులు), ధనంజయ డి సిల్వా (6 పరుగులు) క్రీజులో ఉన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 10
ఐదో వికెట్
37.5 ఓవర్ల వద్ద లహిరు తిరిమానే (68 బంతుల్లో నాలుగు ఫోర్ల సహాయంతో 53 పరుగులు) కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
క్యాచ్ మిస్
36.2 ఓవర్ల వద్ద జడేజా బౌలింగ్‌లో మాథ్యూస్ ఇచ్చిన క్యాచ్‌ను లాంగాన్‌లో ఉన్న భువనేశ్వర్ కుమార్ పట్టలేకపోయాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 11
తిరిమానే అర్థ సెంచరీ
35.1 ఓవర్ల వద్ద కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి తిరిమానే (63 బంతుల్లో నాలుగు ఫోర్ల సహాయంతో) అర్థ సెంచరీ చేశాడు.
35 ఓవర్లలో 159/4
35 ఓవర్లలో శ్రీలంక నాలుగు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఏంజెలో మాథ్యూస్ (57 పరుగులు), లహిరు తిరిమానే (47 పరుగులు) క్రీజులో ఉన్నారు.
మాథ్యూస్ హాఫ్ సెంచరీ
33 ఓవర్ల వద్ద ఏంజెలో మాథ్యూస్ 76 బంతుల్లో మూడు ఫోర్ల సహాయంతో 50 పరుగులు పూర్తి చేశాడు.
30 ఓవర్లలో 127/4
30 ఓవర్లలో శ్రీలంక నాలుగు వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. ఏంజెలో మాథ్యూస్ (41 పరుగులు), లహిరు తిరిమానే (31 పరుగులు) క్రీజులో ఉన్నారు.
25 ఓవర్లలో 102/4
25 ఓవర్లలో శ్రీలంక నాలుగు వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. ఏంజెలో మాథ్యూస్ (26 పరుగులు), లహిరు తిరిమానే (22 పరుగులు) క్రీజులో ఉన్నారు.
20 ఓవర్లలో 83/4
20 ఓవర్లలో శ్రీలంక నాలుగు వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. ఏంజెలో మాథ్యూస్ (19 పరుగులు), లహిరు తిరిమానే (10 పరుగులు) క్రీజులో ఉన్నారు.
15 ఓవర్లలో 62/4
15 ఓవర్లలో శ్రీలంక నాలుగు వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. ఏంజెలో మాథ్యూస్ (7 పరుగులు), లహిరు తిరిమానే (2 పరుగులు) క్రీజులో ఉన్నారు.
నాలుగో వికెట్
11.4 ఓవర్ల వద్ద అవిష్క ఫెర్నాండో (21 బంతుల్లో నాలుగు ఫోర్లతో 20 పరుగులు) పాండ్యా బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
మూడో వికెట్
10.4 ఓవర్ల వద్ద కుశాల్ మెండిస్ (13 బంతుల్లో 3 పరుగులు) జడేజా బౌలింగ్‌లో ముందుకు వచ్చి ఆడాలని చూడగా ధోనీ స్టంప్ ఔట్ చేశాడు.
10 ఓవర్లలో 52/2
10 ఓవర్లలో శ్రీలంక రెండు వికెట్లు కోల్పోయి 52 పరుగులు చేసింది. అవిష్క ఫెర్నాండో (19 పరుగులు), కుశాల్ మెండిస్ (3 పరుగు) క్రీజులో ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రెండో వికెట్
7.1 ఓవర్ల వద్ద కుశాల్ పెరీరా (14 బంతుల్లో మూడు ఫోర్లతో 18 పరుగులు) బుమ్రా బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
శ్రీలంక రివ్యూ
5.3 ఓవర్లకు ఫెర్నాండోను బుమ్రా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. బుమ్రా అప్పీల్ చేయగా అంపైర్ ఎల్బీడబ్ల్యూ ఔటిచ్చాడు. అయితే, శ్రీలంక రివ్యూ కోరగా.. బంతి వికెట్లను తాకటం లేదని తేలింది. దీంతో థర్డ్ అంపైర్ ఫెర్నాండోను నాటౌట్‌గా ప్రకటించారు.
5 ఓవర్లలో 28/1
తొలి ఐదు ఓవర్లలో శ్రీలంక జట్టు ఒక వికెట్ కోల్పోయి 28 పరుగులు చేసింది. కుశాల్ పెరీరా (17 పరుగులు), అవిష్క ఫెర్నాండో (సున్నా పరుగులు) క్రీజులో ఉన్నారు.
క్యాచ్ మిస్
4.1 ఓవర్లకు భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో పెరీరా కొట్టిన బంతిని మిడాఫ్, మిడాన్‌ల మధ్య కుల్దీప్, పాండ్యాలు సమన్వయం లేక వదిలేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 12
తొలి వికెట్
3.4 ఓవర్ల వద్ద దిముత్ కరుణరత్నే (17 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 10 పరుగులు) బుమ్రా బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది.

జడేజాకు స్థానం
ఈ ప్రపంచకప్‌లో తొలిసారి రవీంద్ర జడేజా భారత తుది జట్టులో స్థానం సంపాదించాడు.
ఈ మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లీ రెండు మార్పులు చేశాడు. షమీ స్థానంలో జడేజా, చాహల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్‌లో బరిలో దిగారు.
భారత జట్టు: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), రిషబ్ పంత్, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా
శ్రీలంక జట్టు: దిముత్ కరుణరత్నే (కెప్టెన్), కుశాల్ పెరీరా (వికెట్ కీపర్), అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, లహిరు తిరిమానే, ధనంజయ డి సిల్వా, ఇసురు ఎదాన, లసిత్ మలింగ్, కసున్ రజిత, తిసార పెరీరా

ఫొటో సోర్స్, Getty Images
భారత్ వర్సెస్ శ్రీలంక.. 20 ఏళ్లకు తొలి విజయం
ప్రపంచకప్‌లో భారత్, శ్రీలంకలు తొలిసారి 1979లో తలపడ్డాయి. మాంచెస్టర్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించింది.
అనంతరం 1992 ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు తలపడ్డాయి. కానీ, మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే వర్షం కురవడంతో రద్దయింది.
ఆ తరువాత 1996లో భారత్‌లో ఈడెన్‌గార్డెన్స్ వేదికగా రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. భారత్ మ్యాచ్ ఓడిపోతున్న దశలో అభిమానలు అల్లరి చేయడంతో మ్యాచ్ రిఫరీ శ్రీలంకను విజేతగా ప్రకటించారు.
1999 ప్రపంచకప్‌లో శ్రీలంక, భారత్ మధ్య మరోసారి మ్యాచ్ జరిగింది. అందులో భారత్ విజయం సాధించింది. అంటే ప్రపంచకప్ సమరంలో శ్రీలంకపై భారత్‌కు 20 ఏళ్ల తర్వాత విజయం లభించింది.
అనంతరం 2003 ప్రపంచకప్‌లో భారత్ శ్రీలంకపై గెలిచింది.
2007లో మళ్లీ శ్రీలంక విజయం సాధించింది. 2011 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ గెలిచింది. ఆ మ్యాచ్‌లో ధోనీ కొట్టిన సిక్స్‌తో మ్యాచ్ ముగిసింది. మ్యాచ్‌తో పాటు ప్రపంచకప్‌ను కూడా భారత్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
2015లో రెండు జట్లు వేర్వేరు గ్రూపుల్లో ఉండడంతో వీటి మధ్య మ్యాచ్‌లు జరగలేదు.
ఇవి కూడా చదవండి:
- సెమీఫైనల్స్ ఆడే ముందు భారత్ ఏం చేయాలి...
- రిహార్సల్స్ చేయిస్తున్న ట్రైయినర్‌ను చంపేసిన సర్కస్ పులులు
- ధోనీ లేని భారత జట్టును ఊహించగలరా...
- జీరో బడ్జెట్ వ్యవసాయం అంటే ఏమిటి? కేంద్ర ఆర్ధికమంత్రి ఏపీని ఎందుకు ప్రస్తావించారు...
- 'ఓ బేబీ': 70 ఏళ్ల వృద్ధురాలు 24 ఏళ్ల యువతిగా మారితే...
- చైనా ముస్లింలు: పిల్లలను కుటుంబాలకు దూరం చేస్తున్నారు
- కేంద్ర బడ్జెట్ 2019: 13 ముఖ్యాంశాలు
- భారత దేశ మొదటి బడ్జెట్ ఎంతో తెలుసా?
- భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్‌లో సందడి చేసిన బామ్మ
- వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో భారత్ ప్రత్యర్థి ఎవరు...
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)