విమానం బ్యానర్లపై ఐసీసీకి బీసీసీఐ లేఖ.. సెమీ ఫైనల్ స్టేడియాల వద్ద ‘నో ఫ్లై జోన్’

కశ్మీర్

ఫొటో సోర్స్, Getty Images

హెడింగ్లేలో భారత్, శ్రీలంక క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా ఒక చిన్నపాటి విమానం మైదానానికి సమీపంలో ఎగిరింది.

టీవీ, మొబైల్ ఫోన్లలో క్రికెట్ చూస్తున్నవారంతా.. కామెంట్రీ సందర్భంగా ఈ విమానం శబ్ధాన్ని వింన్నారు.

ఆ విమానానికి #JusticeForKashmir (కశ్మీర్‌కు న్యాయం) అని రాసి ఉన్న బ్యానర్ కట్టారని హెడింగ్లే నుంచి బీబీసీ ప్రతినిధి నితిన్ శ్రీవాస్తవ చెప్పారు.

మ్యాచ్ ముగిసిన వెంటనే ఈ వ్యవహారంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి భారత క్రికెట్ మండలి బోర్డు (బీసీసీఐ) లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిందని పీటీఐ వార్తా సంస్థ ఒక కథనంలో తెలిపింది.

మ్యాచ్ ప్రారంభమైన కొద్ది సేపటికే ‘‘కశ్మీర్‌కు న్యాయం’’ అని రాసిఉన్న బ్యానర్‌ కట్టుకుని గాల్లో ఎగిరిన ఈ విమానం, అరగంట తర్వాత ‘‘భారత్ ఊచకోత ఆపాలి, కశ్మీర్‌ను వదిలేయాలి’’ అని మరొకసారి.. తర్వాత భారత జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మూడోసారి ‘‘మూకదాడుల్ని ఆపేందుకు సాయం చేయండి’’ అంటూ మరొక బ్యానర్‌ కట్టుకుని ఈ విమానం గాల్లో ఎగిరింది.

వీడియో క్యాప్షన్, వీడియో: మ్యాచ్‌లో వినిపిస్తున్న శబ్దం ఈ విమానానిదే

అయితే, ఈ విమానాన్ని ఎవరు నడుపుతున్నారు? ఇలా ఎందుకు బ్యానర్ కట్టారు అన్న వివరాలు ఇంకా తెలియరాలేదు.

అయితే, ఈ హ్యాష్ ట్యాగ్ మాత్రం ట్విటర్‌లో ట్రెండ్ అయ్యింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

‘‘ఇది ఏమాత్రం ఆమోదించదగ్గ విషయం కాదు. మేం ఐసీసీకి లిఖితపూర్వకంగా మా ఆందోళనను తెలిపాం. సెమీ ఫైనల్స్‌ సందర్భంగా ఇలాంటి సంఘటన పునరావృతమైతే.. అది నిజంగా దురదృష్టకరం. మా ఆటగాళ్ల భద్రత, రక్షణే మాకు అన్నింటికంటే ముఖ్యం’’ అని బీసీసీఐ సీనియర్ అధికారి చెప్పారని పీటీఐ వెల్లడించింది.

పది రోజుల కిందట అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా కూడా ఒక విమానం ‘‘బలూచిస్తాన్‌కు న్యాయం’’ అన్న బ్యానర్‌ కట్టుకుని ఎగిరింది.

ఈ విమానం బ్రాడ్‌ఫోర్డ్ విమానాశ్రయంలో దిగింది.

కాగా, ఈ సంఘటనల పట్ల ఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘పురుషుల క్రికెట్ ప్రపంచకప్ సందర్భంగా ఎలాంటి రాజకీయ పరమైన సందేశాలనూ మేం క్షమించబోం’’ అని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఉత్తర ఇంగ్లండ్‌లోని యార్క్‌షైర్, బ్రాడ్‌ఫోర్డ్ ప్రాంతాల్లో పాకిస్తాన్ జనాభా ఎక్కువ నివశిస్తుంటుంది.

సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరిగే మాంచెస్టర్, బర్మింగ్‌హామ్ స్టేడియాల సమీపంలో ఎలాంటి విమానాలూ ప్రయాణించకుండా ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

జూలై 9, 11 తేదీల్లో మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు ఈ స్టేడియాల వద్ద ‘నో ఫ్లై జోన్’ అమలు చేయాలన్న ఐసీసీ విజ్ఞప్తికి.. మాంచెస్టర్, యార్క్‌షైర్ పోలీసు యంత్రాంగాలు అంగీకారం తెలిపాయి.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)