కేంద్ర బడ్జెట్ 2019: 13 ముఖ్యాంశాలు

నిర్మలా సీతారామన్

ఫొటో సోర్స్, AFP

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి స్థాయి బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రిగా మహిళ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం భారత్‌లో ఇదే మొదటిసారి.

గతంలో ఓ సారి ఇందిరాగాంధీ కూడా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కానీ అప్పుడు ఇందిర ప్రధానిగా ఉంటూ, ఆర్థిక శాఖను ఎవరికీ కేటాయించకుండా తనవద్దే ఉంచుకున్నారు.

మోదీ సర్కార్ 2.0 కొలువుదీరిన తర్వాత ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌లో ముఖ్యాశాంలు ఇవీ...

  • కార్మిక చట్టాలను సమ్మిళితం చేసి నాలుగు స్మృతులుగా తీసుకొస్తాం.
  • వ్యక్తిగత ఆదాయ పన్నుల స్లాబుల్లో ఎలాంటి మార్పులూ లేవు. వార్షికాదాయం రూ.5 లక్షల లోపు ఉంటే ఆదాయపన్ను చెల్లించక్కర్లేదు.
  • ఐటీ రిటర్నుల దాఖలుకు పాన్ కార్డు లేకపోయినా ఆధార్ కార్డు ఉపయోగించవచ్చు.
  • బంగారంపై కస్టమ్స్ సుంకం 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంపు.
  • పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం రూ.1 పెంపు.
  • విద్యుత్ వాహనాలకు ప్రోత్సాహం
  • రూ.45 లక్షల లోపు విలువైన ఇల్లు కొనుక్కునేవారి గృహ రుణ వడ్డీ చెల్లింపులో అదనంగా రూ.1.5 లక్షల పన్ను రాయితీ.
  • రూ. 1, 2, 5, 10, 20 విలువతో కొత్త నాణేలు తీసుకొస్తాం. ఈ నాణేలు సులభంగా గుర్తించేలా ఉంటాయి.
  • ప్రతి స్వయం సహాయక సంఘం (ఎస్‌హెచ్‌జీ)లో ఒక మహిళ ముద్ర పథకం కింద రూ.లక్ష రుణం పొందేందుకు అర్హురాలు.
  • ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరింత మూలధనాన్ని సమకూర్చేందుకు, రుణ పరపతిని పెంచేందుకు రూ.70 వేల కోట్లు అందిస్తాం.
  • 2019-20 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ.1,05,000 కోట్లు.
  • ఎయిరిండియాలో పెట్టుబడుల వ్యూహాత్మక ఉపసంహరణను తిరిగి ప్రారంభిస్తాం.
  • విమానయానం, బీమా, మీడియా, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ కామిక్స్ (ఏవీజీసీ) రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మరింతగా పెంచే అవకాశాన్ని పరిశీలిస్తాం.
రూపాయి పోక
ఫొటో క్యాప్షన్, అత్యధికంగా 23 శాతం పన్నులు, సుంకాల్లో రాష్ట్ర వాటాగా వెళ్తుంది.
రూపాయి రాక
ఫొటో క్యాప్షన్, అత్యధిక భాగం కార్పొరేట్ పన్ను రూపంలో వస్తుంది.

ఇవే కాకుండా,

ఏడాదిలో రూ.కోటికి మించి నగదు విత్‌డ్రా చేస్తే 2శాతం టీడీఎస్ విధిస్తున్నట్లు నిర్మల ప్రకటించారు.

వచ్చే ఐదేళ్ల కాలంలో భారత్‌ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఈ సంవత్సరంలో దీని విలువ 3 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని నిర్మల సీతారామన్ అన్నారు.

2017-18లో 3.4 శాతంగా ఉన్న ద్రవ్యలోటు ఈ ఏడాది 3.3 శాతానికి తగ్గిందన్నారు.

2022 నాటికి ప్రతి ఇంటికీ విద్యుత్, గ్యాస్ కనెక్షన్ ఇస్తామని తెలిపారు. ఎవరైనా తమకు కనెక్షన్ వద్దు అనుకుంటే తప్ప దేశంలో ఇవి లేని ఇల్లు ఉండదన్నారు.

బడ్జెట్ ప్రసంగం వీడియో

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది

ప్రత్యక్ష పన్నుల రాబడి 2013-14తో పోలిస్తే 78 శాతం పెరిగిందని, నాడు రూ.6.38 లక్షల కోట్లుగా ఉన్న ప్రత్యక్ష పన్నుల రాబడి 2018 నాటికి రూ. 11.37 లక్షల కోట్లకు చేరిందన్నారు.

స్టార్టప్ అండ్ స్టాండప్ కార్యక్రమాలతో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అనేకమంది వ్యాపారవేత్తలుగా ఎదిగే అవకాశం కల్పిస్తామని, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా ఇంధనంపై సుంకం పెంచాల్సి వచ్చిందని బడ్జెట్ అనంతరం నిర్మల తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)