భారీ విమానాన్ని సముద్రంలో ముంచేసిన టర్కీ.. ఎందుకంటే..

ఫొటో సోర్స్, Getty Images
ఒక భారీ విమానాన్ని సముద్రంపైకి తీసుకువచ్చి, దాన్ని సముద్రపు నీళ్లలో ముంచేశారు. టర్కీకి వాయువ్య దిశలోని సారోస్ తీరంలో ఈ సంఘటన జరిగింది.
ఎయిర్ బస్ ఎ- 330 విమానాన్ని ఇబ్రైస్ పోర్టు నుంచి మోటారు బోట్ల సహాయంతో తీరం నుంచి సముద్రంలోకి కిలోమీటరు దూరం తీసుకెళ్లారు. తర్వాత దాన్ని నీళ్లలో ముంచేశారు.
90 టన్నుల బరువున్న ఈ ప్రయాణీకుల విమానాన్ని ఉపరితలానికి 30 మీటర్ల లోతులో ముంచేందుకు ఇంజనీర్లకు నాలుగు గంటల సమయం పట్టింది.
సముద్ర జీవులకు ఆవాసంగా ఈ విమానం ఉపయోగపడుతుందని, అలాగే స్కూబా డైవర్లను కూడా ఆకర్షిస్తుందని, అందుకే ఈ విమానాన్ని సముద్రంలో ముంచినట్లు టర్కీ అధికారులు తెలిపారు.
ఈ విమానం పొడవు 65 మీటర్లు కాగా వెడల్పు 60 మీటర్లు. 1995 నుంచి 2018 వరకూ ఇది ప్రయాణికులకు సేవలు అందించింది.
సముద్రంలో కృత్రిమ దిబ్బలు, ఆవాసాలను ఏర్పాటు చేసేందుకు విమానాన్ని ముంచడం ఇదే మొదటి సారి కాదు.
సముద్రంలో మునిగిపోయిన పడవలు, నౌకలు, విమానాలతో పాటు రైళ్లు కూడా సముద్రంలో భిన్న రకాల జీవులకు, మొక్కలకు ఆవాసాలుగా ఉపయోగపడుతున్నాయి. ఇవి చేపల్ని కూడా ఆకర్షిస్తుంటాయి.
స్కూబా డైవర్లు, సముద్రం లోపల ఈత కొట్టాలనుకునే వారు, చేపలు పట్టాలనుకునే వారిని కూడా ఇవి ఆకర్షించడంతో ఈ ప్రాంతంలో పర్యాటకం అభివృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, అన్ని రకాల కృత్రిమ దిబ్బలు, ఆవాసాలు పర్యావరణానికి మేలు చేయవు. 1972లో అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతంలో అధికారులు 7 లక్షల కారుటైర్లను సముద్రంలో ముంచారు.
ఇలా చేయడం ద్వారా సముద్రంలో కృత్రిమంగా దిబ్బల వంటి ఆవాసాలు ఏర్పడతాయని, అవి సముద్ర జీవులకు ఉపయోగపడతాయని అప్పట్లో పర్యావరణ నిపుణులు భావించారు.
అప్పట్లో రబ్బరు టైర్లను రీసైక్లింగ్ చేసేవారు కూడా కాదు. దీంతో వాటిని సేకరించే, సముద్రంలో ముంచే పని సులభం అయ్యింది.
కానీ, ఈ ప్లాన్ రివర్స్ అయ్యింది. తుపానులు, భారీ అలలు వచ్చినప్పుడు ఈ టైర్లు సముద్రపు నేలను తుడిచేసేవి. అలా సముద్ర జీవులకు సహాయం చేయాల్సింది పోయి సాధారణ సముద్ర జీవనాన్ని ధ్వంసం చేశాయి.
ఈ టైర్లను వెలికి తీసేందుకు కొన్ని సంవత్సరాల పాటు డైవర్లు కృషి చేయాల్సి వచ్చింది.
ఇవి కూడా చదవండి:
- శ్రీలంక: యుద్ధంలో బద్ధ శత్రువులు ప్రేమలో పడ్డారు
- అంతరిక్షం నుంచి సంపూర్ణ సూర్య గ్రహణం ఇలా ఉంటుంది
- శాండ్విచ్ జనరేషన్ అంటే ఏమిటి? మీరు ఈ కోవలోకి వస్తారా?
- సానియా మీర్జా: ‘నేను పాకిస్తాన్ జట్టుకు తల్లిని కాదు’
- చెన్నైలో తాగునీటికి కటకట: వర్షాలు పడకుంటే మురుగునీరే దిక్కా?
- టర్కీ: ఇస్లాంను తిరస్కరిస్తున్న యువత
- "అమ్మాయిలు ఐస్‌క్రీమ్‌లను నాకుతూ తినొద్దు"
- శోభనం రాత్రి బెడ్షీట్లు ఏం నిరూపిస్తాయి? పురాతన వివాహ సంప్రదాయాలు నేటితరం మహిళల్ని ఎలా వెంటాడుతున్నాయి?
- హాంకాంగ్ నిరసనల ముఖ చిత్రం ఇతడే.. పేరు జాషువా.. వయసు 22 ఏళ్లు.. లక్షలాది మందిని ఎలా కదిలించాడు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









