క్రైస్ట్‌చర్చ్ దాడి: నేరారోపణలను అంగీకరించని బ్రెంటన్ టారంట్

ఫొటో సోర్స్, TVNZ
ఈ ఏడాది మార్చిలో జరిగిన క్రైస్ట్‌చర్చ్ దాడుల్లో ప్రధాన నిందితుడు తనపై వచ్చిన నేరారోపణలను అంగీకరించడం లేదని చెప్పారు.
న్యూజీలాండ్‌లో జరిగిన మాస్ షూటింగ్ ఘటనలో నిందితుడు బ్రెంటన్ టారంట్‌పై 51 మంది హత్య, 40 మందిపై హత్యాయత్నం, ఒక తీవ్రవాద ఆరోపణలు ఉన్నాయి.
జైలు నుంచి ఇచ్చిన ఒక వీడియో లింక్‌లో 28 ఏళ్ల ఆస్ట్రేలియన్ టరంట్ కూర్చుని ఉండగా, అతడి అభ్యర్థనను తన లాయర్ చదివి వినిపించడం కనిపిస్తోంది.
మార్చి 15న జరిగిన కాల్పుల ఘటనలో తుపాకీ పట్టుకున్న ఒక సాయుధుడు శుక్రవారం ప్రార్థనలు చేస్తున్న ముస్లింలపై విచక్షణారహితంగా కాల్పులు జరపడం కనిపించింది.
న్యూజీలాండ్‌లో ఒక వ్యక్తిపై ఉగ్రవాద ఆరోపణలు నమోదు కావడం ఇదే మొదటిసారి.
ఈ ఘటనలో ప్రాణాలు దక్కించుకున్నవారు, బాధితుల బంధువులు కూడా ఈ విచారణకు హాజరైనట్లు సిడ్నీ బీబీసీ ప్రతినిధి తెలిపారు.

ఫొటో సోర్స్, EPA
నిందితుడు బ్రెంటన్ టారంట్ నేరం అంగీకరించడం లేదనే విషయాన్ని అతడి లాయర్ షేన్ టైట్ గట్టిగా చదవగానే, నిర్ఘాంతపోయిన బాధితులు కోర్టులో కన్నీళ్లు పెట్టారు.
దీనిపై వచ్చే ఏడాది మే 4న విచారణ జరుగుతుందని హైకోర్ట్ జస్టిస్ కామెరాన్ మాండెర్ చెప్పారు. ఆగస్టు 16న ఈ కేసు రివ్యూ జరిగేవరకూ అతడిని రిమాండు కోసం కస్టడీకి పంపిస్తున్నట్లు తెలిపారు.
బ్రెంటన్ ఇంతకు ముందు ఏప్రిల్‌లో విచారణకు హాజరైనప్పుడు నేరాన్ని అంగీకరించడానికి ఫిట్‌గా ఉన్నాడా అనేది తెలుసుకోడానికి అతడికి మానసిక పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
నిందితుడి ముఖం కనపడేలా ఫొటోలు ప్రచురించడంపై ఉన్న నిషేధాన్ని గత వారం నుంచి ఎత్తివేశారు.

ఫొటో సోర్స్, Reuters
న్యూజీలాండ్ చరిత్రలో చీకటి రోజు
ఈ ఏడాది మార్చి 15న క్రైస్ట్‌చర్చిలో ఉన్న అల్ నూర్ మసీదు, లిన్‌వుడ్ ఇస్లామిక్ సెంటర్‌లో జరిగిన కాల్పుల్లో ప్రమేయం ఉందనే ఆరోపణలతో నిందితుడిని అరెస్ట్ చేశారు.
మొదట అల్ నూర్ మసీదుకు వెళ్లిన నిందితుడు, అక్కడ తన కారు పార్క్ చేసి, మసీదు ద్వారంలోంచి వెళ్తూ కాల్పులు జరిపాడని ఆరోపణలు వచ్చాయి.
మసీదులోని పురుషులు, మహిళలు, పిల్లలపై అతడు దాదాపు ఐదు నిమిషాల పాటు ఆగకుండా కాల్పులు జరిపాడని, తలకు పెట్టుకున్న కెమెరాతో ఈ దృశ్యాలను లైవ్ స్ట్రీమింగ్ కూడా చేశాడని ఆరోపిస్తున్నారు.
తర్వాత 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న లిన్‌వుడ్ మసీదుకు వెళ్లిన బ్రెంటన్ టరంట్ అక్కడ మరికొందరిపై కాల్పులు జరిపాడు.
నిందితుడు నగరంలోని రెండు మసీదుల్లో కాల్పులు జరపడంతో మొత్తం 51 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఆ సమయంలో ఈ దాడిని ఖండించిన న్యూజీలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ "దేశ చరిత్రలోని చీకటి రోజుల్లో ఇది ఒకటి" అన్నారు.
ఏఆర్-15, సెమీ ఆటోమేటిక్ రైఫిళ్లతో కాల్పులు జరిపిన నిందితుడు, ఎక్కువ మందిని హత్య చేయాలనే లక్ష్యంతో ఎక్కువ బుల్లెట్లు నింపేలా వాటి మాగజీన్లు మోడిఫై కూడా చేశాడు.
నిందితుడిని ప్రస్తుతం న్యూజీలాండ్‌లోనే అత్యంత కఠినమైన జైలుగా చెప్పే పారెమోరెమోలోని ఆక్లాండ్ జైలులో ఒంటరిగా ఉంచారు.
ఇవి కూడా చదవండి:
- ఉబర్ ఫ్లయింగ్ టాక్సీలు వచ్చేస్తున్నాయ్
- నాసా: అంతరిక్ష కేంద్రం సందర్శించేందుకు పర్యాటకులను అనుమతి
- ప్రమాదమని తెలుసు.. కానీ ఆకలే వారిని ఇరాక్‌కు వెళ్లేలా చేసింది!
- కెనడా ప్రధాని పర్యటనకు భారత్ ప్రాధాన్యం ఇవ్వడం లేదా?
- ఫ్యాక్ట్ చెక్: బీరు దొరకట్లేదని కేసీఆర్‌కు బ్యాలెట్ బాక్సు ద్వారా లేఖ నిజమేనా?
- మహేంద్ర సింగ్ ధోని ఆ కీపింగ్ గ్లవ్స్ వాడకూడదన్న ఐసీసీ.. అవే కొనసాగిస్తాడన్న బీసీసీఐ
- ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్: కొత్త ట్రెండ్.. ఉపవాసాలు చేసి బరువు తగ్గుతున్నారు
- అభిప్రాయం: ఇది విలీనం కాదు టోకు ఫిరాయింపు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








