పసిబిడ్డను సజీవ సమాధి చేసిన తల్లి.. మట్టిని తవ్వి బిడ్డను కాపాడిన శునకం

కుక్క

ఫొటో సోర్స్, iStock

ఫొటో క్యాప్షన్, కుక్క (ఫైల్ ఫొటో)

తన కడుపున పుట్టిన బిడ్డను ఓ తల్లి వదిలించుకోవాలనుకుంది. పుట్టిన వెంటనే పసికందును సజీవంగా మట్టిలో పూడ్చిపెట్టి వెళ్లిపోయింది. ఆ శిశువును ఒక శునకం రక్షించింది. ఈ ఘటన ఉత్తర థాయిలాండ్‌లోని బాన్ నోంగ్ ఖామ్ అనే గ్రామంలో జరిగింది.

తాను గర్భం దాల్చి, ప్రసవించిన విషయం తల్లిదండ్రులకు తెలియకూడదన్న ఆలోచనతో 15 ఏళ్ల యువతి తన బిడ్డను పుట్టిన వెంటనే సజీవ సమాధి చేసి వెళ్లినట్లు పోలీసులు చెప్పారు.

శునకం, తాయిలాండ్

ఫొటో సోర్స్, KHAOSOD

ఫొటో క్యాప్షన్, మట్టిని తవ్వి పసిబిడ్డను కాపాడిన కుక్క ఇదే

ఊరికి కిలోమీటర్ దూరంలో ఉన్న పొలంలో ఈ శునకం గట్టిగా మొరుగుతూ మట్టిని తవ్వుతోంది. కుక్క ఎందుకు అలా చేస్తోందని అక్కడికి వెళ్లి చూడగా మట్టిలోంచి బయటకు వచ్చిన పసికందు కాలు కనిపించిందని ఆ శునకం యజమాని చెప్పారు.

వెంటనే స్థానికులు ఆ పసిబిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు చిన్నారి శరీరాన్ని శుభ్రం చేసి వైద్యం అందించారు. ఇప్పుడు ఆ శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు.

శునకం, థాయిలాండ్

ఫొటో సోర్స్, KHAOSOD

ఫొటో క్యాప్షన్, కారు ఢీకొట్టడంతో ఈ శునకం కాలు విరిగింది

"ఇది ఎంతో విశ్వాసం, విధేయత కలిగిన కుక్క. పశువులను మేతకు తోలుకెళ్లేటప్పుడు నా వెంటే వస్తుంది. చాలా సాయం చేస్తుంది. దీనిని గ్రామస్థులంతా ప్రేమిస్తారు" అని 'ఖవోసోద్' పత్రికతో శునకం యజమాని ఉసా నిసైఖా చెప్పారు.

శిశువును సజీవ సమాధి చేసేందుకు ప్రయత్నించిందన్న అభియోగం కింద ఆ తల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆ ఘటన జరిగిన సమయంలోనే ఒక 15 ఏళ్ల బాలిక భారీ మొత్తంలో న్యాప్‌కిన్లు కొనడంపై అనుమానం వ్యక్తి చేసిన పోలీసులు నిందితురాలిని గుర్తించగలిగారని బ్యాంకాక్ పోస్ట్ తెలిపింది.

ప్రస్తుతం ఆమెను తన కుటుంబ సభ్యులు, మానసిక నిపుణుల పర్యవేక్షణలో ఉంచినట్లు చుమ్ ఫ్వాంగ్ పోలీసు స్టేషన్‌కు చెందిన అధికారి పునువత్ పుట్టకం చెప్పారు.

తక్కువ లోతులో పూడ్చిపెట్టడం వల్ల ఆ శిశువు బతికి ఉన్నారని పోలీసులు తెలిపారు.

తాను చేసిన పనిపట్ల ఆ తల్లి విచారం వ్యక్తం చేసింది. చిన్నారి బాగోగులను తాము చూసుకుంటామని ఆమె తల్లిదండ్రులు అంగీకరించారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)