శరీరం బయట గుండె: మృత్యువును జయించిన పసిపాప

యూకేకు చెందిన వానిలోప్ విల్కిన్స్ అనే ఈ చిన్నారికి ఛాతి ఎముక లేదు. దాంతో పుట్టుకతోనే ఈ పాప గుండె శరీరం వెలుపల ఉంది.
ఈ చిన్నారి తల్లి కడుపులో ఉండగానే, గుండె శరీరం బయట ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అల్ట్రా సౌండ్ స్కానింగ్‌లలో విల్కిన్స్ గుండె శరీరం వెలుపల కొట్టుకుంటున్నట్లు స్పష్టంగా కనిపించింది.
చిన్నారి బతికే అవకాశాలు 10 శాతం కూడా లేవని వైద్యులు చెప్పారు.
పుట్టిన వెంటనే చిన్నారిని శస్త్ర చికిత్స కోసం యూకేలోని లెస్టర్ నగరానికి తరలించారు.
మూడు శస్త్ర చికిత్సలు చేసి వైద్యులు ఆ గుండెను శరీరం లోపల అమర్చారు. పుట్టినప్పటి నుంచి 14 నెలల పాటు ఈ చిన్నారి ఆస్పత్రిలోనే ఉండాల్సి వచ్చింది.
తమ బిడ్డను కాపాడుకునేందుకు ఆ తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది. ఇప్పుడు చిన్నారిని ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లేందుకు వైద్యులు అనుమతించారు.
చిన్నారికి ఛాతి ఎముకు లేదు కాబట్టి, ఆ భాగంలో ఊతంగా ఒక బ్రేస్‌ను ఏర్పాటు చేశారు. ఛాతి ఎముకను అభివృద్ధి చేసేందుకు కొన్నేళ్ల తర్వాత ఆమెకు మళ్లీ శస్త్ర చికిత్స చేయనున్నారు.
ఇవి కూడా చదవండి
- హైదరాబాద్‌లో ఈ అమ్మాయి బైక్ విన్యాసాలు చూస్తే.. కళ్లు తిరుగుతాయ్
- ఆంధ్రప్రదేశ్‌లో ఒకే రోజు 4 లక్షల గృహప్రవేశాలు
- 'కన్ను మూసినా, తెరిచినా కనిపించేది నీటి సమస్యే' #MyVoteCounts
- వీళ్లు దొంగ వీసాలు ఎలా తీసుకుంటున్నారో చూడండి
- ‘హైదరాబాద్ మెట్రో‘ లిఫ్ట్‌లో దృశ్యాలు వైరల్: ముద్దూ ముచ్చట అసాంఘికమా
- యూపీఎస్సీ: ‘సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూలో ఫెయిలైనా ప్రభుత్వ ఉద్యోగం’
- క్యాన్సర్‌తో చనిపోయే ముందు స్వీయ సంస్మరణ రాసిన బాలుడు.. ప్రపంచాన్ని కదిలించిన మాటలు
- 'కల తీర్చుకుందామని అమెరికా వెళ్లా.. ఇలా జరుగుతుందనుకోలేదు.. అసలు కారణం తెలిస్తే అమ్మానాన్న తట్టుకోలేరు'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









