పదేళ్ల తర్వాత ఈ కప్పకు తోడు దొరికింది
ఈ కప్ప పేరు రోమియో. ప్రపంచంలో ఉన్న సెహ్యూన్కాస్ జాతికి చెందిన కప్ప ఇది. ఈ జాతి కప్పలు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
బొలీవియాలోని ఓ మ్యూజియంలో ఈ రోమియో పదేళ్లుగా ఒంటరిగా ఉంది. ఈ జాతి కప్పల్లో ఇదే చివరిదని ఇప్పటి వరకూ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఈ జాతిని అభివృద్ధి చేయడానికి శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆన్‌లైన్ డేటింగ్ సైట్లలో ఈ రోమియో కోసం ఓ ప్రొఫైల్ కూడా రూపొందించారు.
అయితే ఇన్నాళ్లకు వారి శ్రమ ఫలించింది. బొలీవియాలోని అడవుల్లో... దీనికో 'జూలియట్' దొరికింది.
ఓ అన్వేషకుల బృందం ఆ అడవుల్లో సంచరిస్తుండగా వారికి ఈ జాతి కప్పలు కనిపించాయి.
"మేము ఓ ముఖ్యమైన విషయం మీతో చెప్పాలనుకుంటున్నాం. మాకు ఈ జాతి కప్పలు మరో 5 కనిపించాయి. వాటిలో మూడు మగ కప్పలు, రెండు ఆడ కప్పలు" అని ఆ బృందానికి నేతృత్వం వహించిన టెరెసా కమాచో బదానీ తెలిపారు.
వీటి ద్వారా ఈ జాతిని మళ్లీ అభివృద్ధి చేయవచ్చని వారు భావిస్తున్నారు.
అయితే మనం చేయాల్సిందల్లా వీటిని పరిరక్షించడమే అని వారంటున్నారు.
ఇవి కూడా చదవండి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









